Malaysia Plane Crash: Dashcam Captures Moment Airplane Crashes On Highway Near Elmina; Video Viral - Sakshi
Sakshi News home page

Malaysia Plane Crash: చూస్తుండగానే హైవేపై కుప్పకూలిన విమానం.. పది మంది మృతి.. వీడియో వైరల్‌

Published Thu, Aug 17 2023 8:02 PM | Last Updated on Thu, Aug 17 2023 8:31 PM

Caught On Camera Moment Plane Crashed On Malaysia Highway - Sakshi

కౌలాలంపూర్: మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు  రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు క్షణాల వ్యవధిలో వైరల్ గా మారాయి. 

మలేషియాలోని ఒక నాలుగు లైన్ల రహదారిపై వెళ్తోన్న కారు డాష్ కెమెరాలో ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఊడిపడినట్టుగా ఓ విమానం రెప్పపాటులో నేలకొరిగింది. అంతే వేగంగా కూలిన విమానం నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు. విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. 

మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు.

ఇది కూడా చదవండి: సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement