Malaysia flight
-
Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో
కౌలాలంపూర్: మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు క్షణాల వ్యవధిలో వైరల్ గా మారాయి. మలేషియాలోని ఒక నాలుగు లైన్ల రహదారిపై వెళ్తోన్న కారు డాష్ కెమెరాలో ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఊడిపడినట్టుగా ఓ విమానం రెప్పపాటులో నేలకొరిగింది. అంతే వేగంగా కూలిన విమానం నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు. విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. Dashcam footage shows final moments of the private jet crash in Malaysia. https://t.co/1rsoP7ALGx Viewer discretion advised. pic.twitter.com/fo4Fqxu319 — Breaking Aviation News & Videos (@aviationbrk) August 17, 2023 మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు. ఇది కూడా చదవండి: సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం -
కీలక దశకు చేరుకున్న మలేషియా విమాన అన్వేషణ
కౌలాంపూర్/పెర్త్ : మలేషియా బోయింగ్ 777 విమానం ఎంహెచ్370 కోసం సాగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకుంది. బోయింగ్ శకలాల ఆనవాళ్ల కోసం మినీ రోబో జలాంతర్గామి ‘బ్లూఫిన్-21’ ఏడోసారి హిందూ మహాసముద్రంలో గాలిస్తోంది. శని, ఆదివారాల్లో గాలింపు పరిధిని బాగా కుదించడంతో గాలింపు కీలక దశకు చేరుకుందని మలేసియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుసేన్ తెలిపారు. బ్లూఫిన్ వారంలోగా అన్వేషణ పూర్తి చేస్తుందన్నారు. బ్లూఫిన్ గాలింపు లోతును 4,500 మీటర్ల 4,696 మీటర్ల లోతుకు పెంచారు. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ప్రయాణికులున్న మలేసియా బోయింగ్ గత నెల 8న కౌలాంలపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం తెలిసిందే. కౌలాంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరి అదృశ్యమైన ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలించాయి.