![ఢిల్లీ విమానాశ్రయానికి మూడు అవార్డులు](/styles/webp/s3/article_images/2017/09/3/81456864977_625x300.jpg.webp?itok=ALkjD8xm)
ఢిల్లీ విమానాశ్రయానికి మూడు అవార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) మూడు అవార్డులను దక్కించుకుంది. ఏటా 25-40 లక్షల ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసే విభాగంలో ఆసియా పసిఫిక్‌లో సైజ్ అండ్ రీజియన్ విభాగంలో రెండు అవార్డులను, అలాగే ఏసియా పసిఫిక్‌లో రెండో ఉత్తమ విమానాశ్రయం అవార్డునూ దక్కించుకుంది. ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ)-2015 అవార్డులను ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) మంగళవారం ప్రకటించింది.