
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ రాకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై డీసీపీ (విమానాశ్రయం) రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణిస్తున్న విమానం లోపల బాంబు ఉందని ఓ అగంతకుడు ఫోన్ చేశాడని తెలిపారు. దీంతో వెంటనే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
విమానంలో ఉన్న సుమారు 52 మంది ప్రయాణికులను మరో విమానానికి తరలించి విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆకాష్ దీప్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తన కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదని, అతడు విమానంలో కూర్చున్నప్పుడు తన ఫోన్ నుంచి కాల్ చేశాడని ఆకాష్ దీప్ తండ్రి పోలీసులకు చెప్పినట్లు డీసీపీ తెలిపారు.
చదవండి: హియర్ ఐ యామ్ : 1400 కోవిడ్ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
Comments
Please login to add a commentAdd a comment