
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్ వెళ్లేందుకు చెక్‌ఇన్ పూర్తి చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నాడు. ముందస్తు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేయడంతో అతడి లగేజీని తనిఖీ చేశారు.
దీంతో అతడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన ఒమన్, సౌదీ దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.