శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లే అహ్మద్ అనే వ్యక్తి లగేజీలో రూ.55 ల క్షల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విదేశీ కరెన్సీ భారీగా దొరకటం ఈ వారంలో ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు.