
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా విదేశీ నగదు పట్టుబడింది. ఖతర్, యూఏఈ, బెహ్రాన్, కువైట్, సౌదీ దేశాలకు చెందిన నగదును ఓ ప్రయాణికుడి వద్ద ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్ము మొత్తం దాదాపు కోటికి పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహ్మద్ పర్వేజ్ వద్ద ఈ నగదు పట్టుపడినట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
మయన్మార్ నుంచి బంగారం స్మగ్లింగ్..
మరోవైపు విశాఖలో కూడా భారీగా బంగారం పట్టుబడింది. గౌహతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 3314 గ్రాముల బంగారంను ఆర్‌డీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న బంగారు విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఓ ముఠా మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment