rajiv gandhi airport
-
ఉప్పల్‌లో వన్డే.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
సూపర్ కార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: విలాసవంతమైన లగ్జరీ కార్ల ప్రేమికులకు శుభవార్త . ఇప్పుడు తమ అభిమాన లగ్జరీ కారును అద్దెకు తీసుఉని ఎంచక్కా నగరంలో చక్కర్లు కొట్టొచ్చు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఈ బంపర్ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. సూపర్ కార్ ప్రియులకు ఈ ప్రత్యేకమైన సేవను అందించే మొదటి విమానాశ్రయంగా హైదరాబాద్‌లోని విమానాశ్రయం అవతరించింది. దీంతో లంబోర్ఘిని గల్లార్డో, జాగ్వార్ ఎఫ్ టైప్, పోర్స్చే 911 కారెరా, ఫోర్డ్ ముస్టాంగ్, లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, మసెరటి గిబ్లి, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి , వోల్వో ఎస్ 60 వంటి కార్లను ఎంచుకోవచ్చు. దీంతోపాటు టయోటా ఫార్చ్యూనర్ లేదా మారుతి సుజుకి సియాజ్‌ను కూడా లభ్యం. విమానాశ్రయంనుంచి నగరంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే ఇప్పటికే వరకు క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇపుడు హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులందరూ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత స్థానిక నగర ప్రయాణానికి అద్దె ప్రాతిపదికన లగ్జరీ కారును బుక్ చేసుకోవచ్చు. ఒక డ్రైవర్‌తో లేదా లేకుండా కూడా ఈ ఆఫర్ లభ్యం. అంటే సూపర్ కార్ల డ్రైవింగ్ అనుభవాన్ని కూడా పొందవచ్చన్నమాట. కార్టోక్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మీ ఫ్లైట్ హైదరాబాద్‌లోకి రాకముందే మీరు మీకు నచ్చిన కారును ఆన్లైన్లో లేదా ఫోన్ కాల్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని కార్లు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్టు పేర్కొంది. కారు లేదా బైక్ అద్దె మోడల్ దేశవ్యాప్తంగా ట్రెండిగ్‌లో ఉంది. మనాలి లేదా గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో రోజుకు కేవలం రూ .1000 చొప్పున బైక్‌లు / స్కూటర్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు అలాగే డ్రైవర్ లేకుండా సుమారు 5000 రూపాయలు చెల్లించి కారును అద్దెకు తీసుకోనే అవకాశం పలు పర్యాటక నగరాల్లో లభిస్తోంది. మరి హైదరాబాద్‌లో ఎంత చార్జ్ చేయబోతున్నారనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రైఫిల్ షూటర్ విజేతలకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
సాక్షి, శంషాబాద్: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖతార్‌లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్లో బంగారు పతకం సాధించిన అబిద్ అలీఖాన్‌కు, ఇషాసింగ్‌కు ఎయిర్‌పోర్టులో మంత్రి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొన్న ఐదుగురు క్రీడాకారులు కూడా వివిధ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. రైఫిల్ షూటింగ్ క్రీడాకారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఇషాసింగ్‌ను సన్మానిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
శంషాబాద్‌లో భారీగా పట్టుబడ్డ విదేశీ నగదు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా విదేశీ నగదు పట్టుబడింది. ఖతర్, యూఏఈ, బెహ్రాన్, కువైట్, సౌదీ దేశాలకు చెందిన నగదును ఓ ప్రయాణికుడి వద్ద ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్ము మొత్తం దాదాపు కోటికి పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహ్మద్ పర్వేజ్ వద్ద ఈ నగదు పట్టుపడినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మయన్మార్ నుంచి బంగారం స్మగ్లింగ్.. మరోవైపు విశాఖలో కూడా భారీగా బంగారం పట్టుబడింది. గౌహతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 3314 గ్రాముల బంగారంను ఆర్డీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న బంగారు విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఓ ముఠా మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. -
సాలార్జంగ్ మ్యూజియం వద్ద ప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీలోని సాలార్జంగ్ మ్యూజియం వద్ద బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫార్చూనర్ కారు అతివేగంగా వస్తూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందినవారే. ఇమ్రాన్ అనే వ్యక్తి విదేశాల నుంచి హైదరాబాద్‌కు బుధవారం వేకువజామున వచ్చాడు. ఇమ్రాన్‌ను స్నేహితులు పికప్ చేసుకుని శంషాబాద్ నుంచి పాతబస్తీకి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. వివరాలు.. శనివారం సాయంత్రం 6.53 గంటలకు శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా-514 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో తిరిగి 7.11 గంటలకు విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నిపుణులు విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. -
విమానాశ్రయంలో వీడియోవాల్స్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 వీడియో వాల్స్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోని జాతీయ, అంతర్జాతీయ టెర్మినళ్లలో నాలుగు వీడియో వాల్స్‌కు అత్యాధునిక పన్నెండు స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు వీటిల్లో టీవీ కార్యక్రమాలను వీక్షించడానికి అవకాశం ఉందన్నారు. వీటితోపాటు ఆటోమోటెడ్ వాయిస్ అనౌన్స్‌మెంట్‌ను కూడా నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందులో విమానాలకు సంబంధించిన సమాచారం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తారన్నారు. -
నీళ్లు అనుకొని విషం తాగిన ఉద్యోగి మృతి
హైదరాబాద్ : మంచి నీళ్లు అనుకుని గుర్తు తెలియని విషాన్ని తాగిన ఓ ఉద్యోగి ఆదివారం మృతి చెందాడు. శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్బీనగర్ లో నివాసముండే విశ్వనాథం రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని నర్సరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల 19న నర్సరీలో పనిచేసిన తర్వాత అలసటకు గురైన అతను ఓ బాటిల్ లో నీళ్లలా ఉన్న విషాన్ని తాగాడు. అనంతరం అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య ఉమతో పాటు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.