
ఎయిర్‌పోర్టులో రైఫిల్ షూటింగ్ విజేత అబిద్ అలీఖాన్‌ను సన్మానిస్తున్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, శంషాబాద్: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖతార్‌లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన అబిద్ అలీఖాన్‌కు, ఇషాసింగ్‌కు ఎయిర్‌పోర్టులో మంత్రి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొన్న ఐదుగురు క్రీడాకారులు కూడా వివిధ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. రైఫిల్ షూటింగ్ క్రీడాకారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.
ఇషాసింగ్‌ను సన్మానిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment