నీళ్లు అనుకొని విషం తాగిన ఉద్యోగి మృతి | employee died after he consuming poison instead of water | Sakshi
Sakshi News home page

నీళ్లు అనుకొని విషం తాగిన ఉద్యోగి మృతి

Published Sun, Oct 27 2013 8:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

employee died after he consuming poison instead of water

హైదరాబాద్ : మంచి నీళ్లు అనుకుని గుర్తు తెలియని విషాన్ని తాగిన ఓ ఉద్యోగి ఆదివారం మృతి చెందాడు. శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్బీనగర్ లో నివాసముండే విశ్వనాథం రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని నర్సరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల 19న నర్సరీలో పనిచేసిన తర్వాత అలసటకు గురైన అతను ఓ బాటిల్ లో నీళ్లలా ఉన్న విషాన్ని తాగాడు. అనంతరం అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉద్యోగి మృతి చెందాడు.

 

మృతుడికి భార్య ఉమతో పాటు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement