viswanatham
-
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గం
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్‌రావు, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.శరత్‌బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. -
కార్డు రెన్యువల్ అంటూ డబ్బు లాగేశారు.
మామిడికుదురు(తూర్పుగోదావరి): ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోస పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు. రాజోలు ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపిన వివరాలమేరకు మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన దాకే విశ్వనాధానికి జగ్గన్నపేట ఎస్బీఐ శాఖలో ఖాతా ఉంది. గత నెల 17వ తేదీన అతని సెల్‌కు జగ్గన్నపేట ఎస్బీఐ మేనేజర్ పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు పాడైపోయింది. దాన్ని రెన్యువల్ చేయించుకోవల్సి ఉందని, అందుకు గాను మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాలని అపరిచిత వ్యక్తి విశ్వనాధంను అడిగాడు. అతని మాటలు నమ్మిన విశ్వనాధం ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. తరువాత డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా అతని ఖాతాలో డబ్బులు పోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. గత నెల 17, 18, 19, 20 తేదీల్లో వరుసగా నాలుగు రోజులు రూ.49,900 వంతున మొత్తం రూ.1,99,600 తన ఖాతా నుంచి ఆగంతకులు డ్రా చేశారని విశ్వనాధం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చోరీతో పెళ్లి ఆగిపోయిందని వాపోయాడు. విశ్వనాధం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. -
నీళ్లు అనుకొని విషం తాగిన ఉద్యోగి మృతి
హైదరాబాద్ : మంచి నీళ్లు అనుకుని గుర్తు తెలియని విషాన్ని తాగిన ఓ ఉద్యోగి ఆదివారం మృతి చెందాడు. శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్బీనగర్ లో నివాసముండే విశ్వనాథం రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని నర్సరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల 19న నర్సరీలో పనిచేసిన తర్వాత అలసటకు గురైన అతను ఓ బాటిల్ లో నీళ్లలా ఉన్న విషాన్ని తాగాడు. అనంతరం అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య ఉమతో పాటు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.