sized
-
కొరియర్లో మద్యం.. తెలంగాణ టు గాజువాక
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నగరంలో పొరుగు రాష్ట్రాల మద్యం వరదలా పారుతోంది. దీని కోసం వ్యాపారుల ఏకంగా కొరియర్ సెంటర్‌ను కేంద్రంగా చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కొరియర్ ద్వారా గాజుకవాక తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు తేల్చారు. ఇదీ పరిస్థితి మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డి దారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఎస్ఈబీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ వ్యాపారులకు చెక్ పడుతున్నారు. నగరంలో ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) దాడుల్లో బుధవారం భారీగా పక్క రాష్ట్రాల మద్యం బాటిల్స్ పట్టుబడింది. ఎంవీపీ సర్కిల్–2 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎస్ఈబీ అధికారులు బుధవారం అక్రమ రవాణాపై నిఘా పెట్టగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఎస్ఐ మురళీ తెలిపిన వివరాలు .. ఎంవీపీ ఎస్ఈబీకి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో మద్దిలపాలెం కూడలిలో సిబ్బంది మాటువేశారు. మధ్యాహ్నం మీసాల ఆదినారాయణ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి ఒడిశాకు చెందిన 7 రాయల్‌స్టాగ్ సీసాలతో పాటో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా తెలంగాణ నుంచి కూడా అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపాడు. గాజువాకలోని ఒక కొరియర్ సెంటర్‌కు తెలంగాణ నుంచి మద్యం సీసాలు వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో అతన్ని తీసుకొని గాజువాక వెళ్లిన పోలీసులు కొరియర్ సెంటర్‌కు అతని పేరు మీద వచ్చిన పార్సిల్‌ను తీసుకొని చూడగా అందులో 192 మద్యం సీసాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో వేర్వు వేర్వు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఇతనికి సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా బృందంగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్, కొరియర్ సర్వీసులతో పాటు పలు పద్ధతుల ద్వారా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండటంతో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో ఇలాంటి మరిన్ని గ్రూపులు మద్యం రవాణా, దిగుమతులు చేస్తున్నట్లు ఎస్ఐ మురళీ తెలిపారు. ఎస్ఈబీ ద్వారా అక్రమ రవాణాపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత వ్యవహారంలో మిగతా ఇద్ధరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదుతో పాటు దర్యాప్తుపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ అప్పారావు, హెచ్‌సీ శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బార్ అండ్ రెస్టారెంట్ క్లోజ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇన్నాళ్లకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ మాఫియాకి అడ్డుకట్ట మొదలైంది. ఏడు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం దన్నుతో ఆయన ‘లిక్కర్’ అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆయన జోలికి వెళ్లేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులు ఈ మధ్యనే ఎట్టకేలకు దాడులు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి బినామీ బార్లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. కానీ సరైన చర్యలు లేకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఉన్నత స్థాయి ఆదేశాలతో ఎట్టకేలకు సదరు బార్ క్లోజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకాబస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలకు సంబంధించి ఈ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అధికారం దన్నుతో గత ఐదేళ్లుగా ఎవరూ దాడులు చేసే సాహసం చేయలేదు. ఈనెల 12వ తేదీన గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్ టాస్క్‌ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్‌ను, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని ఎంసీ బ్రాందీలో మిక్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్లను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఘటన జరిగిన దరిమిలా ఎక్సైజ్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేసు తాత్సారం చేస్తూ వచ్చిన ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు ఆదివారం పొద్దుపోయాక బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. -
ఐటీ దాడుల కలకలం.. 15 కోట్లు స్వాధీనం
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీదాడుల కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకునే పీఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన పలు నివాసాలు, ఆఫీస్‌లలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. చెన్నై, నమక్కల్, తిరునల్వేలిలోని 18 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో రూ.14.72 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఓటర్లకు నగదు పంచేందుకు అభ్యర్థులకు పీఎస్కే నుంచి పెద్ద మొత్తంలో నగదు పంపుతున్నట్లు ఐటీ శాఖకు సమాచారమందింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పీఎస్కే యజమానులు, వారి సంబంధీలకు ఇళ్లు, ఆఫీస్‌లలో అధికారులు సోదాలు చేశారు. ఐటీ అధికారుల బృందం చెన్నై ఎగ్మూరు, అన్నానగర్, సెంట్రల్ ప్రాంతాల్లోని పీఎస్కే చైర్మన్ పెరియస్వామి, కొడుకులు అరుణ్, అశోక్‌ల ఇళ్లు, వీరి ఫైనాన్షియర్లు ఆకాశ్ భాస్కర్, సుజయ్ రెడ్డిల ఇళ్లు, ఆఫీస్‌లు కలుపుకుని మొత్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహించారు. సుజాయ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీస్‌లలో లెక్కల్లో చూపని రూ.18 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. తిరునల్వేలి, విల్లుపురం, నమక్కల్‌లలోనూ తనిఖీలు చేశారు. -
కారులో రూ.1.09 కోట్లు స్వాధీనం
-
ఐటీగ్రిడ్స్ సంస్థను సీజ్ చేసిన సిట్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగానే హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థను సిట్ అధికారులు సీజ్ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్ సంస్థలో సిట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలోని మరింత సమాచారాన్ని వారు సేకరించారు. మరోసారి విచారణకు తమముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీచేసింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్‌కు మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. (అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?) -
కర్నూలులో పోలీసుల తనిఖీలు
-
హైదరాబాద్ పోలీసులు 102కిలోల గంజాయి పట్టివేత
-
శంషాబాద్‌లో భారీగా పట్టుబడ్డ విదేశీ నగదు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా విదేశీ నగదు పట్టుబడింది. ఖతర్, యూఏఈ, బెహ్రాన్, కువైట్, సౌదీ దేశాలకు చెందిన నగదును ఓ ప్రయాణికుడి వద్ద ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్ము మొత్తం దాదాపు కోటికి పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహ్మద్ పర్వేజ్ వద్ద ఈ నగదు పట్టుపడినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మయన్మార్ నుంచి బంగారం స్మగ్లింగ్.. మరోవైపు విశాఖలో కూడా భారీగా బంగారం పట్టుబడింది. గౌహతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 3314 గ్రాముల బంగారంను ఆర్డీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న బంగారు విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఓ ముఠా మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. -
భారీగా నగదు పట్టివేత
సాక్షి, ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్‌లో భారీగా నగదు పట్టుపడింది. జిల్లాలోని జైనాథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తుండగా రూ.10 కోట్ల నగదు బయటపడింది. తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకకు చెందిన వాహనంగా అధికారులు గుర్తించారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనంలో నగదు బయటపడింది. వాహనం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అక్రమ నగదు సరఫరాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు విస్రృతంగా తనిఖీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
పద్నాలుగు ఇసుక లారీలు పట్టివేత
నిజామాబాద్(నిజాంసాగర్): నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పద్నాలుగు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14 వేలు చెల్లించి బిల్లు మాత్రం రూ.12 వందలకే తీసుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో 14 ఇసుక లారీలను సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ఏస్గీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లారీలను స్టేషన్‌కు తరలించారు. -
తనిఖీల్లో 154 కిలోల వెండి స్వాధీనం
-
ఉప్పల్‌లోని పెట్రోల్ బంక్ సీజ్