నిజామాబాద్(నిజాంసాగర్): నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పద్నాలుగు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14 వేలు చెల్లించి బిల్లు మాత్రం రూ.12 వందలకే తీసుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో 14 ఇసుక లారీలను సీజ్ చేశారు.
మహారాష్ట్రలోని ఏస్గీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లారీలను స్టేషన్‌కు తరలించారు.