
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగానే హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థను సిట్ అధికారులు సీజ్ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్ సంస్థలో సిట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలోని మరింత సమాచారాన్ని వారు సేకరించారు. మరోసారి విచారణకు తమముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీచేసింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్‌కు మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.
(అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?)
Comments
Please login to add a commentAdd a comment