
టోల్‌ప్లాజా వద్ద తనిఖీ నిర్వహిస్తుడంగా.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనంలో నగదు బయటపడింది.
సాక్షి, ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్‌లో భారీగా నగదు పట్టుపడింది. జిల్లాలోని జైనాథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తుండగా రూ.10 కోట్ల నగదు బయటపడింది. తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకకు చెందిన వాహనంగా అధికారులు గుర్తించారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనంలో నగదు బయటపడింది.
వాహనం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అక్రమ నగదు సరఫరాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు విస్రృతంగా తనిఖీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.