adhilabad
-
తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
-
తెలంగాణ బంద్: అడవుల్లో హై అలర్ట్
సాక్షి, ఆదిలాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు. మంచిర్యాల-మహారాష్ట్ర ప్రాంతాలపై కోటపల్లి, వెమనపల్లి, నీల్వయి ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 3 రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సాయుధ దళాల సంచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ రాష్ట్ర కార్యదర్శి పేరిట ఈ నెల 25 న బంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ అధ్వర్యంలో జిల్లా డీసీపీ, ఏసీపీలతో పాటు మొత్తం 500 మంది స్పెషల్ పార్టీ, క్యాట్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణహిత పరివాహక గ్రామాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. అలాగే సీఐ, ఎస్పై, సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలలో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను అలాగే డోన్ కెమెరాలను వాడుతున్నట్టు అధికారులు తెలిపారు.మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మావోలు నది దాటి వచ్చే అవకాశం ఉన్నందున అపరిచిత వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సాక్షి, మంచిర్యాలఅర్బన్(అదిలాబాద్): సంక్రాంతి అనగానే తెలుగు సంప్రదాయాలతో కూడిన పండగ. దేశ, విదేశాల నుంచి సొంత ఊళ్లకు వస్తుంటా రు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, తది తర అవసరాల కోసం స్వగ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లటం సర్వసాధరణం. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల ప్రకటించటంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు ఉద్యోగరిత్యా వెళ్లినవారితోపాటు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు సంక్రాంతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియ న్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏయే డిపో నుంచి ఎన్ని బస్సులు..? నడపాలో కసరత్తు పూర్తి చేసింది. సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం, మరోవైపు ఆర్టీసీ యా జమాన్యం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకో వాలని యోచిస్తోంది. గతేడాది ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి 168 బస్సులు హైదరాబా ద్‌కు నడపగా ఈ ఏడాది 194 బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అదనపు చార్జీలతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపటానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా నుంచి దూర ప్రాంతాలకు ప్రత్యేకంగా నడిపే బస్సులకు మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు: రూ.30 ఉంటే రూ.45 వసూలు చేయనున్నారు). ప్రత్యేకంగా వెళ్లే బస్సులు అప్ అన్ డౌన్లో ఏదో వైపు ఖాళీగా వెళ్లాల్సి ఉండటంతోనే చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రత్యేక బస్సులు ఇలా.. సంక్రాంతి పండగ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూర్, భైంసా, ఆసిఫాబాద్ డిపోల నుంచి హైదరాబాద్‌కు 194 బస్సులు నడపనున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి సాధారణ రోజుల్లో 30 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ వేళ ఈ డిపో నుంచి ప్రత్యేకంగా మరో 39 బస్సులు ఏర్పాటు చేశారు. రీజినల్ వారీగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోనేలా ఏర్పాట్లు చేశారు. ఆయా డిపోల నుంచి 28 రిజర్వేషన్ బస్సులు నడపనున్నారు. నిర్మల్ నుంచి 12, మంచిర్యాల 7, ఆదిలాబాద్ 4, భైంసా 4, ఆసిఫాబాద్ నుంచి 1 బస్సుకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించారు. జనవరి 10న ఆరు డిపోల నుంచి రీజియన్ వారీగా 36 బస్సులు, 11న 46 బస్సులు, 12న 70, 13న 37, 14న 5 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవికాకుండా ప్రయాణికుల అవసరాలను బట్టీ అదనంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని డిపోల వారీగా సంక్రాంతి పండుగకు నడపనున్న బస్సుల వివరాలను ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. మరిన్ని బస్సులు నడిపే అవకాశం సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 194 ప్రత్యేక బస్సులు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాం. మరో 28 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నాం. çపండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉంటే మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నాం. డీఎం స్థాయి అధికారితోపాటు తానూ పర్యవేక్షిస్తాను. – విజయ్‌భాస్కర్, రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
అతివకు అర్ధభాగం
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు ఇంటికే పరిమితంకాకుండా రాజకీయాల్లో రాణించేలా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్ మండలాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పల్లెపోరు సిద్ధమైంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా నూతన పంచాయతీరాజ్ చట్టం మహిళలకు పెద్దపీఠ వేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరిలో 50శాతం కోటాను మహిళలకు కేటాయించింది. మిగితా స్థానాల్లో కూడా పురుషులతో సమానంగా పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో.. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల మండలంలో మూడు గ్రామపంచాయతీలు, ఆదిలాబాద్‌రూరల్ మండలంలో 34 జీపీలు, జైనథ్ మండలంలో 42, బేల మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో యాభైశాతం మహిళలకు రిజర్వేషన్ చేయగా, మిగతా యాభైశాతం జనరల్‌స్థానాల్లో మహిళలు, పురుషులు పోటీలో ఉండనున్నారు. అతివలకే సగం స్థానాలు పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపట్ల శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మహిళలకు 50 శాతం స్థానాలు దక్కడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు పలువురు మహిళలు ఆసక్తిచూపుతున్నారు. వచ్చేనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయా గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 50శాతం రిజర్వేషన్ ప్రకటించడం గతంలో సర్పంచ్‌గా పని చేసిన పలువురు మహిళా సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, మహిళా ఉద్యోగులు పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఖరారైన జైనథ్ సర్పంచు రిజర్వేషన్లు జైనథ్: మండలంలోని 29పాత, 13 కొత్త గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 42 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం రాత్రి ఖరారయ్యాయి. జనరల్ : మాంగుర్ల, పిప్పర్వాడ, పూసాయి, కామాయి, దీపాయిగూడ, కంఠ, సాంగ్వి(కే), రాంపూర్(టి), బెల్గాం. జనరల్ మహిళ: పెండల్వాడ, మాండగాడ, ఆకోలి, బహదూర్‌పూర్, పిప్పల్‌గావ్, ఖాప్రి, కరంజి, కూర, భోరజ్, మాకోడ. బీసీ జనరల్ : బాలాపూర్, హషీంపూర్, గిమ్మ(కే), అడ, కౌఠ, సిర్సన్న. బీసీ మహిళ : లేకర్వాడ, సావాపూర్, ఆకుర్ల, నిరాల, తరోడ, కోర్ట. ఎస్సీ జనరల్ : గూడ, జైనథ్. ఎస్సీ మహిళ : పార్డి(కే), లక్ష్మీపూర్. ఎస్టీ జనరల్ : కాన్ప మేడిగూడ(సి), పార్డి(బి), సుందరగిరి, మార్గూడ. ఎస్టీ మహిళ : కాన్పమేడిగూడ(ఆర్), జామ్ని, బెల్లూరి. 42 పంచాయతీలకు 19 స్థానాలు జనరల్‌కు, 12 స్థానాలు బీసీలకు, నాలుగు స్థానా లు ఎస్సీలకు, ఏడు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. దీంట్లో 50శాతం స్థానాలు(21 జీపీలు) మహిళలకు కేటాయించారు. 50శాతం రిజర్వేషన్ హర్షణీయం ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకోసం అమలు చేస్తున్న 50శాతం రిజర్వేషన్ హర్షించదగిన విషయం. ఇదే సమయంలో గ్రా మాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందే మహిళలను వారి కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మహిళల ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయంగా రిజర్వేషన్ వర్తింపజేస్తుంది. రాజకీయంగానే కాకుం డా కుటుంబ సభ్యులు అన్నిరంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. – ఏదుల్లా శోభ, బట్టిసావర్గాం -
ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, ఆసిఫాబాద్: దేశ భద్రత కోసం ఆర్మీలో చేరిన తెలంగాణకు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ శ్రీనగ్‌ర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కశ్మీర్లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్.. విధుల నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పోల్లో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటుచేశారు. ఈరోజు సాయంత్ర వరకు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
పార్టీ మారను.. నేనే పోటీ చేస్తా
సాక్షి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ ఇటీవల హస్తం నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ నేత, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పార్టీ మారుతారని, ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎంపీ నగేష్ ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తనపై ఇకముందు ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున ఆదిలాబాద్ నుంచి తానే పోటీచేస్తానని నగేష్ ప్రకటించారు. దానికోసం ఇప్పటి నుంచే బీఫాం చేతిలో పట్టుకుని తిరుగుతున్నాని ఆయన తెలిపారు. కాగా మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి గులాబీ పార్టీకి షాకిచ్చిన విషయం తెలిసిందే. తనతోపాటు మరికొంత మంది నేతలు పార్టీని వీడుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గల్లో చర్చకు దారితీశాయి. -
భారీగా నగదు పట్టివేత
సాక్షి, ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్‌లో భారీగా నగదు పట్టుపడింది. జిల్లాలోని జైనాథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తుండగా రూ.10 కోట్ల నగదు బయటపడింది. తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకకు చెందిన వాహనంగా అధికారులు గుర్తించారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనంలో నగదు బయటపడింది. వాహనం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అక్రమ నగదు సరఫరాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు విస్రృతంగా తనిఖీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఘనంగా నాగోబా జాతర పూజలు
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో జాతర వైభవంగా సాగుతోంది. గురువారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం వెనుక భాన్‌దేవత, పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు, మెస్రం వంశం కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి భాన్‌దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు కుల పెద్ద దేవత పెర్సపేన్ పూజలను ఘనంగా నిర్వహించారు. కటోడ మెస్రం హనుమంత్‌రావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగోబా యూత్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కృతి క్రీడలను కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రారంభించారు. -
బాలికను విక్రయించిన ముఠా అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం నాగల్‌గొందికి చెందిన గిరిజన బాలికను రాజస్థాన్‌లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక బంధువైన బాయక్క, వాంకిడి మండలానికి చెందిన మధ్యవర్తులు నాందేవ్, భీమేష్, అర్జున్‌లతో కలిసి రాజస్థాన్‌కు చెందిన హరిశంకర్‌తో లక్షా 5వేలకు బేరం కుదర్చుకుంది. బాలికను మాయమాటలతో నమ్మించి రాజస్థాన్‌కు పంపించింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలికను విచారించిన తర్వాత బాయక్కతో పాటు మధ్యవర్తుల్ని అరెస్టు చేశారు.