మంచిర్యాల డిపోలోని ఆర్టీసీ బస్సులు
సాక్షి, మంచిర్యాలఅర్బన్(అదిలాబాద్): సంక్రాంతి అనగానే తెలుగు సంప్రదాయాలతో కూడిన పండగ. దేశ, విదేశాల నుంచి సొంత ఊళ్లకు వస్తుంటా రు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, తది తర అవసరాల కోసం స్వగ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లటం సర్వసాధరణం. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల ప్రకటించటంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు ఉద్యోగరిత్యా వెళ్లినవారితోపాటు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు సంక్రాంతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియ న్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏయే డిపో నుంచి ఎన్ని బస్సులు..? నడపాలో కసరత్తు పూర్తి చేసింది. సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం, మరోవైపు ఆర్టీసీ యా జమాన్యం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకో వాలని యోచిస్తోంది. గతేడాది ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి 168 బస్సులు హైదరాబా ద్‌కు నడపగా ఈ ఏడాది 194 బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
అదనపు చార్జీలతో..
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపటానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా నుంచి దూర ప్రాంతాలకు ప్రత్యేకంగా నడిపే బస్సులకు మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు: రూ.30 ఉంటే రూ.45 వసూలు చేయనున్నారు). ప్రత్యేకంగా వెళ్లే బస్సులు అప్ అన్ డౌన్‌లో ఏదో వైపు ఖాళీగా వెళ్లాల్సి ఉండటంతోనే చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది.
ప్రత్యేక బస్సులు ఇలా..
సంక్రాంతి పండగ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూర్, భైంసా, ఆసిఫాబాద్ డిపోల నుంచి హైదరాబాద్‌కు 194 బస్సులు నడపనున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి సాధారణ రోజుల్లో 30 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ వేళ ఈ డిపో నుంచి ప్రత్యేకంగా మరో 39 బస్సులు ఏర్పాటు చేశారు. రీజినల్ వారీగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోనేలా ఏర్పాట్లు చేశారు. ఆయా డిపోల నుంచి 28 రిజర్వేషన్ బస్సులు నడపనున్నారు. నిర్మల్ నుంచి 12, మంచిర్యాల 7, ఆదిలాబాద్ 4, భైంసా 4, ఆసిఫాబాద్ నుంచి 1 బస్సుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ కల్పించారు.
జనవరి 10న ఆరు డిపోల నుంచి రీజియన్ వారీగా 36 బస్సులు, 11న 46 బస్సులు, 12న 70, 13న 37, 14న 5 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవికాకుండా ప్రయాణికుల అవసరాలను బట్టీ అదనంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని డిపోల వారీగా సంక్రాంతి పండుగకు నడపనున్న బస్సుల వివరాలను ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు.
మరిన్ని బస్సులు నడిపే అవకాశం
సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 194 ప్రత్యేక బస్సులు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాం. మరో 28 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నాం. çపండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉంటే మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నాం. డీఎం స్థాయి అధికారితోపాటు తానూ పర్యవేక్షిస్తాను.
– విజయ్‌భాస్కర్, రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment