sankaranthi festival
-
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్‌లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్‌రూమ్‌ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్‌నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
కుటుంబ సభ్యులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భోగి సంబరాలు
-
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సాక్షి, మంచిర్యాలఅర్బన్(అదిలాబాద్): సంక్రాంతి అనగానే తెలుగు సంప్రదాయాలతో కూడిన పండగ. దేశ, విదేశాల నుంచి సొంత ఊళ్లకు వస్తుంటా రు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, తది తర అవసరాల కోసం స్వగ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లటం సర్వసాధరణం. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల ప్రకటించటంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌కు ఉద్యోగరిత్యా వెళ్లినవారితోపాటు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు సంక్రాంతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియ న్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏయే డిపో నుంచి ఎన్ని బస్సులు..? నడపాలో కసరత్తు పూర్తి చేసింది. సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం, మరోవైపు ఆర్టీసీ యా జమాన్యం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకో వాలని యోచిస్తోంది. గతేడాది ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి 168 బస్సులు హైదరాబా ద్‌కు నడపగా ఈ ఏడాది 194 బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అదనపు చార్జీలతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపటానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా నుంచి దూర ప్రాంతాలకు ప్రత్యేకంగా నడిపే బస్సులకు మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు: రూ.30 ఉంటే రూ.45 వసూలు చేయనున్నారు). ప్రత్యేకంగా వెళ్లే బస్సులు అప్ అన్ డౌన్లో ఏదో వైపు ఖాళీగా వెళ్లాల్సి ఉండటంతోనే చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రత్యేక బస్సులు ఇలా.. సంక్రాంతి పండగ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూర్, భైంసా, ఆసిఫాబాద్ డిపోల నుంచి హైదరాబాద్‌కు 194 బస్సులు నడపనున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి సాధారణ రోజుల్లో 30 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ వేళ ఈ డిపో నుంచి ప్రత్యేకంగా మరో 39 బస్సులు ఏర్పాటు చేశారు. రీజినల్ వారీగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోనేలా ఏర్పాట్లు చేశారు. ఆయా డిపోల నుంచి 28 రిజర్వేషన్ బస్సులు నడపనున్నారు. నిర్మల్ నుంచి 12, మంచిర్యాల 7, ఆదిలాబాద్ 4, భైంసా 4, ఆసిఫాబాద్ నుంచి 1 బస్సుకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించారు. జనవరి 10న ఆరు డిపోల నుంచి రీజియన్ వారీగా 36 బస్సులు, 11న 46 బస్సులు, 12న 70, 13న 37, 14న 5 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవికాకుండా ప్రయాణికుల అవసరాలను బట్టీ అదనంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని డిపోల వారీగా సంక్రాంతి పండుగకు నడపనున్న బస్సుల వివరాలను ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. మరిన్ని బస్సులు నడిపే అవకాశం సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 194 ప్రత్యేక బస్సులు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాం. మరో 28 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నాం. çపండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉంటే మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నాం. డీఎం స్థాయి అధికారితోపాటు తానూ పర్యవేక్షిస్తాను. – విజయ్‌భాస్కర్, రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
ఎన్నికలకు ముందు గంగిరెద్దులోళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ రాగానే గంగిరెద్దులోళ్లు వచ్చినట్టుగా ఎన్నికలు రాగానే పార్టీలంటూ హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ టీడీపీ ఇన్చార్జి నెహ్రూనాయక్ కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘రాజకీయాల్లోకి వస్తానంటూ పవన్‌కల్యాణ్ అనే హీరో బయల్దేరిండట. అంతకుముందు ఎన్నికల్లో ఆయన అన్న చిరంజీవి వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు తమ్ముడు పవన్‌కల్యాణ్ కూడా అదే చేస్తడు. ఇప్పుడు చిరంజీవి వంటివారు కాదు చిరునవ్వుల తెలంగాణ కావాలె. సంక్రాంతి రాగానే గంగిరెద్దులోళ్లు వచ్చేవారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే నేను నేను అంటూ అందరూ వచ్చి ఆగమాగం చేస్తరు. వాళ్లను పట్టించుకోవద్దు. ఇంకా ఆంధ్రోళ్ల పాలన మనకు అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, ఇతర నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే... తెలంగాణ వచ్చింది కదా అని రిలాక్స్ కావొద్దు. అసలు పని ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు రాజకీయాలు తక్కువ, కార్యం ఎక్కువగా ఉండాలి. టీఆర్ఎస్కు 17 ఎంపీలుంటేనే కేంద్రంలో తెలం గాణకు కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం ఇంకొకరిని చేయాలంటే ఎట్లా? యుద్ధం చేయాలంటే కత్తి మన చేతిలోనే ఉండాలి. మాజీ సీఎం కిరణ్ వంటివారు ఇంకా తెలంగాణను ఆపుతానంటూ హడావుడి చేస్తున్నారు. అపాయింట్మెంట్ డేట్ వచ్చింది, ఎవరూ ఏమీ చేయలేరు. తెలంగాణకోసం అందరూ రోడ్ల మీదకొచ్చి కొట్లాడుతుంటే ఎక్కడా కనిపించని పార్టీలు ఎన్నికలు రాగానే గడబిడ చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి కావాలంటె మంచి నాయకుడు కావాలి. మనం ఇస్తున్న హామీలను, చేయాల్సిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. -
ఆంధ్రా ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం
-
‘కోడి’తే కోట్లే..!
* గోదావరి జిల్లాల్లో మొదలైన కోడి పందేల జాతర * ముహూర్తం చూసుకుని మరీ బరిలోకి * కిక్కిరిసిన భీమవరం ప్రాంతాలు * పోలీసుల ఆంక్షలను లెక్కచేయని వైనం * రూ.400 కోట్లు దాటనున్న పందేరం * 3 రోజులూ రేయింబవళ్లూ పందేల జాతరే ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంకుల సమరానికి బరులు సిద్ధమయ్యాయి. పందెం రాయుళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లలా తర్ఫీదు ఇప్పించిన కోడిపుంజులను గోదాల్లోకి దింపారు. పండగ రోజున వినోదం పేరుతో జరిగే ఈ పందేలకు సోమవారం ముహూర్తం చూసుకుని మరీ తెరలేపారు. ఈసారి పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు చేసిన హడావుడి పైస్థాయి నుంచి ఒత్తిడి ముందు దూదిపింజలా ఎగిరిపోయింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పందేలు నిరాటంకంగా జరిగీఖపోతున్నాయి. కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలో అయితే ఎప్పటిమాదిరిగానే పందేల పందేరం జూద మహాసభలను తలపిస్తున్నాయి. పండుగ మూడు రోజులూ రేయింబవళ్లూ పందేలు నిరాటంకంగా జరగనున్నాయి. లక్షల్లో పందేలు.. కోట్లలో లావాదేవీలు.. * పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం, భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, భీమవరం మండలంలోని వెంప రాష్ర్టంలోనే భారీగా పందేలు జరిగే ప్రాంతాలుగా గుర్తింపుపొందాయి. * వెంపలో సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ముహూర్తం పెట్టి మరీ పందేలను ఆరంభించారు. * నిడమర్రు మండలం ఫత్తేపురంలో ఏకంగా 30 ఎకరాల చెరువును ఎండబెట్టి బరిని సిద్ధం చేశారు. * ఐ.భీమవరంలోనే ఈ 3 రోజుల్లో రూ.100 కోట్లకుపైగా సొమ్ములు చేతులు మారతాయని అంచనా. ప్రకృతి ఆశ్రమం, వెంపలో రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య లావాదేవీలు జరుగుతాయని చెబుతున్నారు. వెంపలో సోమవారం సాయంత్రం ఒకే పందెం రూ.12 లక్షలకు జరిగింది. * నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంతోపాటు దాదాపు జిల్లాలోని ప్రతి మండలంలోనూ 10 నుంచి 15 చోట్ల పందేల బరులు ఏర్పాటయ్యాయి. ఉండి మండలం మహదేవపట్నం, జువ్వలపాలెంలోనూ భారీ పందేలు జరుగుతాయి. ఏలూరు సమీపంలోని కాళ్లచెరువు, కొప్పాక, దుగ్గిరాల ప్రాంతాల్లోనూ భారీ పందేలు వేస్తున్నారు. * తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి, ఐ.పోలవరం మండలం పెదమడి, కేశనకుర్రు, ఆత్రేయపురం, మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి ప్రాంతాల్లో కూడా పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు * మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో మూడు రోజులు కలిపి రూ.300 కోట్లకుపైగా పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నా, అదికాస్తా ఇప్పుడు రూ.400 కోట్లు దాటుతుందంటున్నారు. ఇవే పందెం కోళ్లు.. ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు వారి ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఐ.భీమవరం కోడిపందేలకు సంబంధించి ‘తెలుగు వారి లాస్‌వేగాస్’ అన్న ఖ్యాతి పొం దింది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రూ.70 కోట్ల పందేలు జరుగుతాయని అంచనా. పందేలను చూడ్డానికి వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉం డడంతో భీమవరం పరిసర ప్రాంతాల్లో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ రూములన్నీ 4 నెలల క్రితమే బుక్ అయిపోయాయి. హోటళ్ల నిర్వాహకులు ఒక్కో రూమ్‌కు రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. భీమవరం చుట్టుపక్కల 200 అతిథిగృహాలు సైతం నిండిపోయాయి. రూములు దొరకని వారు రాజమండ్రి, ఏలూరు, తణుకు, విజయవాడ తదితర పట్టణాల్లో హోటళ్లు బుక్‌చేసుకుని అక్కడి నుంచి వస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాలతోపాటు కోస్తా జిల్లాల నుంచి సాధారణ వ్యక్తులతోపాటు ప్రజాప్రతినిధులు, రాజ కీయ, పారిశ్రామిక, సినీ రంగాల ప్రముఖులు కూడా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో సోమవారం ఉదయం నుంచి భీమవరం పట్టణం స్తంభించింది. ప్రకృతి ఆశ్రమానికి వెళ్లే రోడ్డు ఖరీదైన కార్లతో నిండిపోయి ముందుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కత్తి కడితే కనకవర్షమే... - కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆ సొమ్ము నుంచే నాయకులకు, పోలీసులకు వాటాలు అందుతుంటాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేల బినామీలే స్వయంగా పందేలు నిర్వహిస్తుండడం గమనార్హం. పశ్చిమలో ఒక ఎమ్మెల్యే ఏటా ఈ సీజన్లో పందేల నిర్వాహకుని అవతారం ఎత్తుతున్నారంటే ఏ స్థాయిలో గిట్టుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ‘కత్తుల’ వెనక విషపు క్రీనీడ - సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. పందేలు.. ప్రత్యక్ష ప్రసారం నిడదవోలు పాత పటిక ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటుచేసిన బరుల్లో భారీస్థాయిలో టెంట్లు, స్టేడియం తరహాలో గ్యాలరీలు, వీఐపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధానంగా పందేలను దగ్గరనుంచి వీక్షించే వీలులేని వారికోసం ఎల్సీడీలు ఏర్పాటుచేసి మరీ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. సుమారు 400 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ గార్డులతో వీఐపీ గ్యాలరీలకు భద్రత కల్పిస్తున్నారు. సినీనటులు తనీష్, వెన్నెల కిషోర్, ఆదర్శ్ తదితరులు పందేలను తిలకించేందుకు వచ్చారు. - న్యూస్‌లైన్, నిడదవోలు చేతులెత్తేసిన పోలీసులు.. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలు జరగనివ్వమని పోలీసులు జారీ చేసిన హెచ్చరికలు ఉత్తిదేనని మరోసారి తేటతెల్లమైంది. ఉన్నతాధికారులు పందేలను ఆపడానికి విశ్వప్రయత్నం చేసినా పైస్థాయిలో ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఏలూరు రేంజి ఐజీ విక్రమ్‌సింగ్ మాన్ పందేలను ఆపేందుకు భారీ కసరత్తు చేశారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పం దేలు జరిగే ప్రాంతాలను ముందే గుర్తించి బరులను స్వాధీనం చేసుకోవడం, అటువెళ్లే దారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఈసారి పందేలు జరగవేమోనని సోమవారం ఉదయం వరకు జూదగాళ్లు ఆందోళన చెందారు. ఐతే మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఉదయం 11 గంటల నుంచి పోలీసులు బరుల నుంచి పక్కకు వెళ్లిపోవడంతో పందేల పందేరం మొదలైంది. బరిప్రియులకు ఒకరోజు ‘బోనస్’ ఈ ఏడాది కోడి పందేలను నిలిపివేయాలంటూ పలువురు లోకాయుక్తతోపాటు, హైకోర్టును ఆశ్రయించడంతో పందెంరాయుళ్లు తొలుత కొంత దిగాలుపడ్డారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ పండుగ తరువాతే ఆరంభించడంతో వారి ఉత్సాహం కట్టలు తెగిన గోదావరే అయింది. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజులపై.. భోగి 13 తేదీయా, లేక 14నా అనే సందేహం నెలకొనడంతో పందెం ప్రియులకు బోనస్రోజూ వచ్చి చేరింది. -
పసిడి రాశుల పచ్చని కాంతిసంక్రాంతి
ఇళ్లముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుంచి కిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, వాటిపైనుంచి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్కకుండా ‘హరిలో రంగ హరి’ అంటూ తమ మధుర గానంతో మేలుకొలుపు పలుకుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు...తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు... అదొక కళావిలాసం. అదే సంక్రాంతి పండుగ వైభవం. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరూ. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరూ పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా, కంటికి ఇంపుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకు, కూలీలకు, పాలేర్లకు, పశువులకు, పక్షులకు అన్నింటికీ కృతజ్ఞతను తెలియచేసుకోవడం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవడం ఈ వేడుకల్లో కనపడుతుంది. ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు? భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకర సంక్రమణం. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకర రాశిని సంక్రమించినపుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకర సంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటివరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరు నెలల నుండి దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం అని, ఉత్తరాయణాన్ని దేవయానంఅని చెబుతారు. అందుకనే ఈరోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తాము సంతోషంగా ఉండే కాలంలో ఆ ఆనందాన్ని వ్యక్తపరచుకునేందుకు ఈ పుణ్యకాలాన్ని నిర్ణయించుకున్నారు. విధులు: అంతరిక్షంలో జరిగే ఖగోళ విశేషాలననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన రుషుల ఘనత, అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా ఉంటాయి. ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్ర విజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. నిజానికి మన పండుగలు బహుళార్థ సాధన ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరుప్పావై లేక శ్రీవ్రతాన్ని ఆచరిస్తారు. ద్వాపర యుగం చివరిలో గోపికలు ఆచరించిన ఈవ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమైంది. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవడం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. భోగి: సంక్రమణానికి ముందు రోజుని భోగి అనే పేరుతో జరుపుకోవడం మన సంప్రదాయం. తెల్లవారుజామునే లేచి ఒక పక్క భోగిమంటల దగ్గర కొంతమంది చలి కాచుకుంటూ ఉంటే, మిగిలిన వారు వంటికి నువ్వుల నూనె రాసుకొని, నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని, నువ్వులు వేసి కాచిన వేడినీళ్ళతో తలంటు పోసుకొని, కొత్తబట్టలు కట్టుకుంటారు. (చలికాలం వల్ల వచ్చే ఎన్నో ఇబ్బందులను అధిగమించటానికి నువ్వుల వాడకం ఆరోగ్యసూత్రం) పిండి వంటలతో పులగం, చక్కెరపొంగలి మొదలైనవాటితో భోజనం, అరిసెలు, చక్కిలాలు(సకినాలు)మొదలైనవి నములుతూ, ఇంటికి వచ్చినవారికి ఇస్తూ బంధుమిత్రుల ఇళ్ళకి వెళుతూ ఆనందంగా గడుపుతారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భోగి పళ్ళుపోస్తారు. వీటివల్ల దృష్టిదోషం పోయి, ఒక సంవత్సరం వరకు దృష్టి సోకకుండా ఉంటుందని నమ్మకం. ఆడపిల్లలు ఉంటే బొమ్మల కొలువు పెడతారు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మగారి కొలువును తమ ఇంటిలో చిన్న పన్నాలో చూడడం నేర్పటానికి. సృష్టిలోని అన్ని రకాల వస్తువులని కొలువులో పెట్టి, వాటికి పూజ చేసి, నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వటంతో అన్నీ దేవుడి స్వరూపాలుగా చూడటం అలవాటవుతుంది. అంతేకాదు, భోగి పళ్ళకి, బొమ్మల కొలువుకి పేరంటం చేసి వచ్చిన వారికి తాంబూలాలివ్వటం పద్ధతి. ఆ తాంబూలాలతో పాటు తమ శక్తికొద్దీ ఇంకేమైనా ఇస్తారు. తమకు కలిగిన దానిని అందరితో పంచుకోవడం అలవాటు చేయడం ఈ వేడుకలలో అంతరార్థం. పితృదేవతలకేకాక సమస్తానికి కృతజ్ఞతలని తెలియజేసే పండుగ కదా! తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియజేయటం ఈ పండుగలో ప్రతి అంశంలోనూ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమనాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపుముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. ఆ రోజు మాట్టు పొంగల్ అంటారు. వారికి పొంగలి వండటం ప్రధానం కనుక ఈ సంక్రాంతి పండుగను పొంగల్ అంటారు. తెలుగువారు కూడా పొంగలి వండుతారు. దానిని తెలుగువారు పులగం అంటారు. కొత్తబియ్యం, కొత్తపెసరపప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. ఈ సందర్భంగా కొత్త బియ్యాన్ని లేగంటిఆవు పాలలో వండి, కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారుచేయడం చాలా ముఖ్యం. అన్ని కొత్త వస్తువులను ఇప్పుడే ఉపయోగించడం మొదలుపెడతారు. ‘కనుమునాడు కాకైనా కదలదు’, ‘కనుమునాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి, పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ఏమైనా పండుగలలోని ఆచారాలను అర్థం చేసుకుని ఆచరిస్తేనే అసలైన ఆనందం. - డాక్టర్ ఎన్.అనంతలక్ష్మి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడు రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్టం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకర రాశిలో ఉండే శ్రవణా నక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వులదానం చేయడం శ్రేయస్కరం. దీనితోబాటు వస్త్రదానం, పెరుగుదానంతో పాటు ఏ దానాలు చేసినా మంచిదే. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరు నెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతాపూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుమనాడు తర్పణాలిస్తారు. కనుమని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రెపొటేళ్ళ పోటీలు, కోడి పందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈ రోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండివంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఇందుకు ఉపయోగిస్తారు. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. -
పామాయిల్ నిల్
సాక్షి, అనంతపురం : సంక్రాంతి పండుగంటేనే పిండి వంటల హడావుడి. అయితే... పేద, మధ్య తరగతి కుటుంబీకులు ఈ సారి పండుగంటేనే భయపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాటు పిండి వంటలకు అవసరమైన పామాయిల్ చౌక దుకాణాల నుంచి అందే అవకాశం లేకుండా పోయింది. గతంలో పర్వదినాలకు ప్రభుత్వం చక్కెర, కందిపప్పు, గోధుమలు కాస్త ఎక్కువగా ఇచ్చేది. ఈసారి అలా ఇవ్వడం లేదు. దీంతో పండుగ ఖర్చు తలకు మించిన భారం అవుతోందని సామాన్యులు వాపోతున్నారు. జిల్లాలో 11 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. అత్యధికులు ఇతర నిత్యావసర సరుకులతో పాటు పామాయిల్ కూడా కొనుగోలు చేస్తున్నారు. రెండు నెలలుగా చౌక దుకాణాలకు పామాయిల్ సరిగా సరఫరా కావడం లేదు. పామాయిల్‌ను ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అక్కడి నుంచి ఒక్కసారిగా దిగుమతి నిలిచిపోవడంతో పౌరసరఫరాల శాఖ చౌక దుకాణాలకు సరఫరా ఆపేసింది. జిల్లాకు ఇప్పటి వరకు రెండు లక్షల పామాయిల్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. ఇవి కూడా చౌక దుకాణాలకు చేరలేదు. ఫలితంగా కార్డుదారులకు సంక్రాంతికి పామాయిల్ అందకుండా పోతోంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.58 నుంచి రూ.60 వరకు ఉంది. అదే చౌక దుకాణాల ద్వారా రూ.40తోనే సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో లీటర్‌పై రూ.20 చొప్పున అదనపు భారం పడుతోంది. ఇలా 11 లక్షల కార్డులకు లెక్కిస్తే రూ.2.20 కోట్లు అదనపు భారం పడనుంది. గతంలో పౌరసరఫరాల శాఖ పండుగల సమయంలో చ క్కెర, గోధుమలు, కందిపప్పు అదనపు కోటాగా పంపిణీ చేసేది. ఈ సారి ఆ ఊసేలేదు. దీని కారణంగానూ మరో రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. ‘గ్యాస్’ బాదుడు నూతన సంవత్సర సంబరాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం సామాన్యులపై గ్యాస్ బాంబు విసిరింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.10, సబ్సిడీ లేని సిలిండర్‌పై రూ.215, వాణిజ్య సిలిండర్‌పై రూ.387 చొప్పున భారం మోపింది. సబ్సిడీ సిలిండర్లను తొమ్మిదికే పరిమితం చేయడంతో ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు కోటా ఎప్పుడో పూర్తయింది. అలా కుటుంబాలు పూర్తి మొత్తాన్ని వెచ్చించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. దిగుమతి లేకనే... పామాయిల్ మలేషియా నుంచి రావాల్సి ఉంది. అక్కడి నుంచి దిగుమతి ఆలస్యం కావడంతోనే జిల్లాకు ఆలస్యంగా సరఫరా అవుతోంది. మలేషియా నుంచి అరకొరగా వస్తున్న పామాయిల్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒకే సారి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల మరింత ఆలస్యమవుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -వెంకటేశం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, అనంతపురం