
సాక్షి, ఆసిఫాబాద్: దేశ భద్రత కోసం ఆర్మీలో చేరిన తెలంగాణకు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ శ్రీనగ్‌ర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్.. విధుల నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పోల్లో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటుచేశారు. ఈరోజు సాయంత్ర వరకు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment