
పుట్టను తవ్వుతున్న మెస్రం అల్లుళ్లు
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో జాతర వైభవంగా సాగుతోంది. గురువారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం వెనుక భాన్‌దేవత, పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు, మెస్రం వంశం కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి భాన్‌దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
మెస్రం వంశీయులు కుల పెద్ద దేవత పెర్సపేన్ పూజలను ఘనంగా నిర్వహించారు. కటోడ మెస్రం హనుమంత్‌రావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగోబా యూత్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కృతి క్రీడలను కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment