nagoba jatara
-
నాగోబాను దర్శించుకున్న సీతక్క
-
అంగరంగ వైభవంగా నాగోబా జాతర..ఆకట్టుకున్న ఆదివాసీల సాంస్కృతి (ఫొటోలు)
-
నేడు గిరిజన దర్బార్
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్‌కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెపుతున్నారు. నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగోబా జాతరలో.. గిరిజన దర్బార్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 1940 కాలంలో గిరిజన పోరాట యోధుడు కొమురంభీం వీర మరణం తర్వాత అప్పటి నైజాం సర్కార్.. గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితాలపై పరిశోధించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారంకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజనుల కోసం విద్య, ఇతర పథకాలను అమలు చేసేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే గిరిజనులు అత్యధిక సంఖ్యలో కేస్లాపూర్లో కలుస్తారని, అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని 1942 ప్రాంతంలో హైమన్‌డార్ఫ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకొనేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నైజాం సర్కార్ వరకు చేరేవి. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాయి. నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా గిరిజన దర్బార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ దర్బార్‌లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున గిరిజనులు తరలి వస్తారు. -
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
కెస్లాపూర్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
-
అంగరంగ వైభవంగా ఆదివాసీ ‘నాగోబా జాతర’ ప్రారంభం (ఫొటోలు)
-
రేపే నాగోబా మహాజాతర
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 28న మహాపూజతో సంబరం మొదలు కానుంది. ఇప్పటికే పవిత్ర గంగాజలంతో వచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో పడియోర్ జన్మ స్థలమైన మర్రిచెట్టు వద్ద గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు. రెండు రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళలో ప్రదాన్ కితకు చెందిన వారు కిక్రి వాయిస్తూ నాగోబా, 22 కితల వంశీయుల చరిత్ర చెబుతున్నారు. ఆదివారం ఉదయం మహిళలు కితల వారీగా జొన్న గట్కా, సంప్రదాయ పిండి వంటలు చేసి ఆచారం ప్రకారం నైవేద్యాలు సమర్పింపంచారు. 22 కితల్లో మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూమ్ (కర్మకాండ) పూజలు చేపట్టినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. మరణించిన వారు ఈ పూజలతో నాగోబా సన్నిధికి చేరినట్లు భావిస్తామని పేర్కొన్నారు. పూజల్లో జొన్నగట్కా ప్రత్యేకం పూజల్లో భాగంగా సమర్పించే నైవేద్యంలో జొన్న గట్కాకు ప్రత్యేక స్థానం ఉంది. పూజల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇంటి నుంచి తీసుకువచ్చిన జొన్న పిండితో గట్కా, ఇతర పిండి పదార్థాలు తయారు చేస్తారు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత కితల వారీగా పంపిణీ చేసి భోజనం చేస్తారు. ఆలయానికి చేరిన కుండలు నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలకు అవసరమయ్యే సిరికొండలోని గుగ్గిల స్వామి తయారుచేసిన ఏడు రకాల కుండలు ఆదివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. మొత్తం 350 మట్టి పాత్రల్లో పెద్ద బాణాలు, సాధారణ కుండలు, మూతలు, కడుముంతలు, దీపాంతలు ఉన్నాయి. వీటిని ఆలయంలో భద్రపరిచారు. తూమ్ పూజలతో దేవుడి సన్నిధికి..ఆదివాసీల్లో మరణించిన పెద్దలకు కుటుంబ సభ్యులు తమ కుల దేవతల వద్దకు వెళ్లి తూమ్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మరణించిన వారు దేవుడి సన్నిధికి చేరినట్లుగా భావిస్తారు. ఈ పూజల అనంతరమే వంశంలోని తమ కితకు చెందిన కోడళ్ల బేటింగ్ (దేవుడి పరిచయం)తో పాటు ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.నాగోబా జాతరకు దృశ్య రూపంఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసిన యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రాచీనమైన నాగోబా జాతర గురించి మనకు తెలిసింది ఎంత? అంటూ వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఆదిలాబాద్ బాట పట్టారు యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్. ఎనిమిదేళ్ల పరిశోధన తర్వాత ‘నాగోబా జాతర’పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. తాను తెలుసుకున్న విషయాలు, చిత్రీకరించిన ఫొటోలతో అందమైన పుస్తకాన్ని కూడా ప్రచురించారామె. నాగోబా జాతరలోని ప్రతి ఘట్టాన్ని అందంగా చిత్రించారు. ఇందుకు తన పరిశోధనే కారణమంటారామె. ‘సినిమా చిత్రీకరణ ఒక్క టే నాకు తెలిసిన కళ. నా దృష్టికొచ్చిన గొప్ప విషయాన్ని నాకు చేతనైన మాధ్యమంలో ఒక రూపం కల్పించానని చెప్పడానికి గర్వంగా ఉంది’అన్నారు జెన్నిఫర్. ‘గుస్సాడీ’పుస్తకం ఆమెజాన్లో ఉంది. ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును ఆమె తీసుకోలేదు. నేరుగా ఆదివాసీల అభ్యు న్నతి కోసం ఏర్పాటు చేసిన నిధికి చేరుతోంది. ‘నాగోబా జాతర’రచన మార్కెట్లో విడుదల కావాల్సి ఉంది. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పరిధిలోని కేస్లాపూర్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నాగోబా జాతర జరగనుంది. జెన్నిఫర్ హైదరాబాదీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జెన్నిఫర్ ఆల్ఫాన్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆమె తీసిన ‘కచరా’ఫిల్్మకు మూడు నంది అవార్డులు వచ్చాయి. ‘స్ట్రేంజర్’సినిమా కేన్స్‌లో స్క్రీన్ అయ్యింది. దానికి 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఆ డబ్బుతో ఆదివాసీల జీవనం, కళలపై రీసెర్చ్ చేస్తున్నారు.ఇవి మన సంస్కృతి మూలాలుహైదరాబాద్లోని శిల్పారామంలో గుస్సాడీ నృత్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మూలాలను వెతుక్కుంటూ ఆదిలాబాద్ అడవులకెళ్లాను. గుస్సాడీ మీద ఒక డాక్యుమెంటరీ, పుస్తకం తెచ్చాను. 2014 నుంచి ఇప్పటివరకు రెండు డాక్యుమెంటరీలు, రచనలు వచ్చాయి. మూడవది ఆదివాసీ దేవత జంగుబాయి డాక్యుమెంటరీ చిత్రీకరణ దశలో ఉంది. నా పుస్తకాలను చూసిన మన తెలుగువారు చాలామంది ఆఫ్రికాలో షూట్ చేశారా అని అడిగారు. మన మూల సంస్కృతి అడవి దాటి బయటకు రాకపోతే ఇక ప్రపంచానికి ఏమి చెబుతాం? ప్రపంచదేశాలకు తెలియచేయడానికి ఇంగ్లిష్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. డాక్యుమెంటరీ మన తెలుగుదనాన్ని కోల్పోకూడదని ఆదివాసీల మాటలను అలాగే ఉంచాను. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, ఫిల్మ్ డైరెక్టర్ -
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
-
నాగోబా జాతరకు వేళాయె
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతరను ఈనెల 28 నుంచి ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం వేదికగా.. ఏటా నిర్వహించే ఈ జాతర ప్రసిద్ధి చెందింది. ఆదివాసీల్లోని మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాలు ఇందులో ప్రతిబింబిస్తాయి. పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ప్రచార రథయాత్ర పూర్తి చేసిన వంశీయులు.. ప్రస్తుతం గంగా జల సేకరణ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మేడారం తర్వాత నాగోబా జాతరను పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు.మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం..గిరిజనుల్లోని ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయులకు నాగోబా ఆరాధ్య దైవం. ఏటా పుష్య మాసంలో నాగోబా మహాపూజ, జాతర నిర్వహిస్తారు. నెలవంక కనిపించిన మర్నాడు గంగాజల సేకరణ పాదయాత్రను వంశీయులు చేపడతారు. కలశాల్లో సేకరించిన జలంతోనే నాగోబాకు మహాపూజ రోజు అభిషేకం నిర్వహిస్తారు. అంతకుముందు ఆలయానికి సమీపంలోని ఇంద్రాదేవికి పూజలు చేసి అక్కడి మర్రిచెట్టు వద్ద బస చేస్తారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి చేరుకుని నాగోబాను అభిషేకించడంతో జాతర మొదలవుతుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు.నూతన ఆలయంలో..తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు. తర్వాత కాలంలో 1956లో గడ్డి పొరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించేవారు. 1995లో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ఆధునికతను జోడిస్తూ ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించి 2022 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ ఆలయం గర్భగుడి ద్వారమే నాగదేవత పడగ. మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులు కళ్లకు కట్టేలా ఆలయ మండపంలోని స్తంభాలపై శిల్పాలు చెక్కారు. ఒకప్పటి గోండ్వానా రాజ్యం చిహ్నాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.నిర్మాణ విశిష్టత..నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి.. ఈ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కిచ్చారు. వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కుల్లో రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అప్పట్లో రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన ఆలయంలోనే మూడేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు.అతి ప్రాచీనమైన గోండి ధర్మం..అతి ప్రాచీనమైన గోండి ధర్మాన్ని ఆచరించే మెస్రం వంశస్తుల మూల పురుషుడు పడియోర్. ‘పాతాళ్ శ్రీ శేకు నాగోబా’వెలిసిన పుణ్య క్షేత్రం కేస్లాపూర్లో తరతరాల నుంచి ధర్మ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కాపాడుతూ.. ముందు తరాలకు సంస్కృతిని అందించే కేంద్రంగా విరజిల్లుతోంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆదివాసీ గోండు తెగలోని మెస్రం వంశీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా పుష్యమాసం ప్రారంభం నుంచి కఠోర దీక్షలు, నియమనిష్టలు పా టిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర గంగాజలం కోసం తెల్లని వస్త్రాలు ధరించి వరుస క్రమంలో కాలినడకన వందల కిలోమీటర్లు పయనిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి దగ్గర గోదావరిలోని హ స్తినమడుగు నుంచి కలశంలో గంగాజలం సేక రించి తిరుగు పయనమవుతారు. పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా మహాదేవుడి అభిషేకం, మహాపూజ కార్యక్రమం నిర్వహిస్తారు.గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యంనాగోబా జాతరలో గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యం ఉంది. 1940లో గిరిజన పోరాట యోధుడు కుమురంభీం వీరమరణం తర్వాత.. అప్పటి నిజాం సర్కార్ గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణాలపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన సతీమణి బెట్టి ఎలిజబిత్తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీ జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజన ప్రజల కోసం వివిధ విద్య, ఇతర పథకాల అమలుకు కృషి చేశారు. అన్ని దేశీయ సంస్కృతులు, భాషలను సంరక్షించడం కోసం ప్రభుత్వాలకు సూచనలు చేశారు. గిరిజనులు అత్యధికంగా కేస్లాపూర్లో కలుస్తారని, 1942 కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను ప్రస్తావిస్తారు. అప్పట్లో నిజాం సర్కార్ వరకు ఇవి చేరేవి. దీంతో గిరిజన దర్బార్‌కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. దేశం కాని దేశం వచ్చి ఇక్కడి గిరిజనుల కోసం విశేషంగా కృషి చేసిన దివంగత హైమన్‌డార్ఫ్, ఆయన సతీమణి బెట్టి ఎలిజబిత్ దంపతుల విగ్రహాలను మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఏటా ఆ దంపతుల వర్ధంతిని గిరిజనులు నిర్వహిస్తున్నారు.భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాంనాగోబా ప్రాశస్త్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాం. పవిత్రమైన ఈ జాతర నిర్వహణలో మెస్రం వంశీయులం పాల్గొంటాం. మూడేళ్ల క్రితం నూతన ఆలయాన్ని ప్రారంభించాం. వంశీయులమంతా డబ్బులు జమ చేసుకుని సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. -
దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్: బండి సంజయ్
ఆదిలాబాద్: కేశ్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగదేవత అత్యంత శక్తిమంతమైన దేవత అన్నారు. హిందువుగా పుట్టడమే తన అదృష్టమని పేర్కొన్నారు. గోండిలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగోబా జాతరకు వేల మంది తరలి వస్తున్నా ఏర్పాట్లు సరిగా చేయలేదన్నారు. నిజాం శవానికి అంత్యక్రియలు చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యత అదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ నాగోబా జాతరకు రాలేదని ధ్వజమెత్తారు. 'పోడు భూముల సమస్య ఉంది. కుర్చీ వేసుకోని పట్టాలు ఇస్తామన్నారు సీఎం. ఆ సంగతి మర్చిపోయారు. పోటుగాడు సీఎం కేసీఆర్ పైసలు ఇస్తామని తండాలను పంచాయితీ చేశారు. కాని ఒక్కపైసా ఇవ్వలేదు. గ్రామపంచాయితీ నిదులు దోంగిలించిన దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్ పేదలను ముంచుతున్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఇది లాస్ట్ అసెంబ్లీ. ఇచ్చిన హమీలను అసెంబ్లీ వేదికగా అమలు చేయాలి. అన్ని జాతులను ,వర్గాలను మోసం చేసిన నాయకుడు సీఎం. టీఆర్ఎస్ బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ మార్చారు.' అని బండి ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా బండి సంజయ్‌తో పాటు నాగోబా జాతరలో పాల్గొన్నారు. నాగోబా దేవతను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. చందాలు వేసుకొని అద్భుతమైన మందిరాన్ని నిర్మించారని కొనిడాడారు. జల్ ,జంగల్, జమీన్ హక్కులు కల్పించడంతో తెలంగాణ సర్కారు విపలైందని అర్జున్ ముండా ఆరోపించారు. 'ఆదివాసీలకు జంగలే దేవుడు. పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం కమ్యూనిటీ హక్కులు ఇవ్వడం లేదు. తెలంగాణ లో బీజేపీ అదికారంలో వస్తుంది. అదికారంలోకి రాగానే పట్టాలు ఇస్తాము. కొందరు అడవులను మింగేస్తున్నారు. ఆదివాసీల ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. అదివాసీల కోసం కేశ్లాపూర్ దర్మశాల నిర్మిస్తాం.' అని అర్జున్ ముండా అన్నారు. చదవండి: డెక్కన్‌మాల్ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా? -
కేస్లాపూర్ నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు(ఆదివారం) రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేశ్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. కాగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా, బండి పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మొదలైన నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. చదవండి: ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్ -
Nagoba Jatara 2023 : ఆదిలాబాద్‌లో ‘నాగోబా’ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ
ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమవారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లోని మురాడి వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాథోడ్ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. –ఇంద్రవెల్లి -
మెస్రం బేతాళ్ నృత్యం
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గతనెల 31న మహాపూజతో ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా మెస్రం వంశీయులు శుక్రవారం బేతాళ్, మండగాజిలింగ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దల కాళ్లు కడిగి ఆహ్వానం పలికారు. ఆదివాసుల ఆనవాయితీ ప్రకారం ప్రధాన్ (పటడి)లకు మెస్రం వంశీయులు, మహిళలు, కోడళ్లు బుందో(కానుకలు) సమర్పించారు. తర్వాత వంశ పెద్దలు వెదురు కర్ర పట్టుకుని బేతాళ్ నృత్యాలు చేశారు. కోడళ్లు, మహిళలు, మెస్రం వంశీయులు సంప్రదాయ నృత్యాలు చేశారు. సాయంత్రం వాయిద్యాలు వాయిస్తూ అందరూ నాగోబాను దర్శించుకుని సంప్రదాయ పూజలను ముగించారు. ఈ పూజల్లో మెస్రం వంశం పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశం పెద్దలు మెస్రం చిన్ను పటేల్, కటోడ మెస్రం కోసేరావ్, మెస్రం బాదిపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
Nagoba Jatara: ఆదివాసీ సంస్కృతికి అద్దంపట్టేలా జాతర షురూ..
-
నాగోబా మహాపూజ; చెట్టెక్కిన మెస్రం అల్లుడు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా మహాపూజ సందడి మొదలైంది. మహాపూజ కోసం మెస్రం వంశీయులు కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి వచ్చారు. ముందుగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పవిత్ర జలాన్ని కిందపెట్టకుండా మర్రి చెట్టుపై ఉంచి పూజలు చేశారు. అనంతరం నాగోబా ఆలయానికి పవిత్ర జలాన్ని ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాల్సి ఉండటంతో, వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల అల్లుడు మర్రి చెట్టు ఎక్కి పవిత్ర జలాన్ని కటోడా (పూజారి)కి అందజేశారు. 11న మహాపూజ మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు చేసి ఈనెల 11న పుష్యమాసం అమావాస్యనుపురస్కరించుకుని గోదావరి నది హస్తీన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన గంగా జలంతో నాగోబా ఆలయాన్ని శుద్దిచేసి మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నట్టు మెస్రం వంశం పెద్దలు తెలిపారు. చదవండి: ఆ ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎందుకంటే! ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు -
నేటి నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం మహాపూజలతో ప్రారంభమయ్యే రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఈ నెల 30 వరకు అధికారికంగా.. ఫిబ్రవరి 3 వరకు అనధికారికంగా జరగనుంది. మెస్రం వంశీయులు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన తిరిగి ఈ నెల 20న కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు (వడమరా)వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి గురువారం సాయంత్రం వరకు 300 ఎడ్లబండ్లు, 110 వాహనాలతో మెస్రం వంశీయులు తరలివచ్చి మర్రి చెట్టు వద్ద బస చేసి.. కాగా గురువారం తెల్లవారు జామున ఆచారం ప్రకారం మెస్రం వంశంలో మృతి చెందిన 63 మంది పేరిట ‘తూమ్’పూజలు నిర్వహించారు. ఈ పూజలతో చనిపోయిన వారు నాగోబా సన్నిధికి చేరుతారనేది వారి నమ్మకం. నాగోబా మహాపూజకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. మహాపూజ అనంతరం అర్ధరాత్రి మెస్రం వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని మెస్రం కోడళ్లకు వారి కుటుంబ సభ్యులు నాగోబా దర్శనం చేయించి వారి వంశ పెద్దలను పరిచయం చేయిస్తారు. ఈ కార్యక్రమంతో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ నెల 27వ తేదీన నాగోబా దర్బార్ ఏర్పాటు చేయనున్నట్లు మెస్రం వంశీయులు, అధికారులు తెలిపారు. -
నాగోబా..అదరాలబ్బా
సాక్షి, హైదరాబాద్ : గిరిజన గ్రామాలకు పండుగొచ్చింది. దసరా, దీపావళి అంటే అందరికీ తెలుసు.. కానీ సిరాల్ పండుగ, భౌరాపూర్ జాతర అంటే తెలియని వారే ఎక్కువ. ఇవి గిరిజనులు జరుపుకునే పండుగలు. నాగోబా సహా ఇలాంటి వాటి గురించి అందరికీ తెలియాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సంకల్పించి అమలు చేస్తోం ది. ఇందులో భాగంగా ఒక్కో పండగను ప్రభుత్వ కేలండర్లో జోడించిన గిరిజన సంక్షేమ శాఖ.. నిర్దేశిత తేదీల్లో ఆయా తెగలున్నచోట ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తోంది. గిరిజనుల్లో 8 ప్రధాన తెగలున్నాయి. వీరిలో గోండ్, అంద్, కొలామ్, నాయక్‌పోడ్, ఎరుకల, చెంచు, లంబాడి, కోయ తెగలున్నాయి. నిర్వహణకు 102.3 కోట్లు గిరిజనుల పండుగలకు ప్రభుత్వం రూ.102.3 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారక్క జాతరకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించేందుకు రూ.కోటి ఖర్చు చేస్తోంది. -
38 మంది కొత్త కోడళ్లకు భేటింగ్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబాకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఘనంగా పూజలు చేశారు. మెస్రం వంశంలోని 38 మంది కొత్త కోడళ్లను భేటింగ్ చేయించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఆదివాసీలు జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వెలుగులు నింపిన హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకెల్ యోర్క్, మైకెల్ వాలరీ నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి అతిథి మర్యాదలు చేసి శాలువాలతో సన్మానించారు. మైకెల్ యోర్క్ దంపతులు గోడవ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులను గోండి భాషలో పలకరించి సందడి చేశారు. మైకెల్యోర్క్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. -
నేడే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ శిష్యు డు మైకేల్ యోర్క్ జాతరకు రానున్నారు. -
అంతా మా ఇష్టం!
కాగజ్‌నగర్‌టౌన్: అధికారుల పర్యవేక్షణలోపం..రాజకీయ నాయకుల అండదండలతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత ఎజెండాను అమలు చేస్తున్నాయి. డోనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. సెలవు దినాల్లోనూ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాగోబా జాతర రోజు పాఠశాల కొనసాగించారని డీఈవో మెమో జారీ చేశారు. కాని రాజకీయ అండదండలు, పలుకుబడితో మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యతోపాటు పాఠశాలల్లో క్రీడలు ఉండాలి. కాని చాలా పాఠశాలల్లో మైదానాలే లేవు. అంతే కాకుండా పైఅంతస్తులో పాఠశాల నిర్వహిస్తే అదనంగా అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి. కాని కొన్ని పాఠశాలలకు అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. జిల్లాలో 104 ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సౌకర్యాలు కల్పించని పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జనవరి 31న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఒక చోట, నిర్వహణ మరోచోట.. అనుమతి తీసుకున్న చోటనే ప్రైవేటు పాఠశాలలు కొనసాగించాలి. కాని కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల రెండు ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఒకచోట ఉంటే వాటిని మరోచోటకు తరలించారు. ఇలా స్కూల్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు యాజమాన్యాలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ఎగ్గొంటేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కాయి. ఇలాంటి వాటిపై స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదుదారుల ఒత్తళ్ల మేరకు ఉన్నతాధికారులు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అతితక్కువ జీతాలు చెల్లిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు మొత్తంలో 50 శాతం జీతాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం 12 నెలల జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులపై ఒత్తిడి ప్రైవేటు పాఠశాలలు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు రోజుకు ఏడు గంటలు కొనసాగాలి. మధ్యాహ్న భోజన విరామం, స్వల్ప విరామాలు కలుపుకొని ఏడు గంటలు ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 7:15 నిమిషాలు కొనసాగాలి. ఎక్కువ గంటలు పాఠశాలల్లో విద్యార్థులను ఉంచకూడదు. కాని 9 నుంచి 10 గంటల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచుకొని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మండల కమిటీల పర్యవేక్షణ కరువు ప్రైవేటు పాఠశాలల్లో మండల స్థాయి అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో వసతులు, సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ప్రతీ మండలంలో తహసీల్దార్ చైర్మన్, ఎంఈవో కన్వీనర్, ఎంపీడీవోతోపాటు సీఐ, ఎస్సైలు సభ్యులుగా ఉంటారు. కాని ఈ కమిటీలు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిబంధనలు పాటించడం లేదు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తరఫున ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. -ఎండీ.ఆసీఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పట్టించుకుంట లేరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చాలా మంది ప్రమాదకరంగా ఆటోల్లో వెళ్తున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. తేజశ్విని, టీపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ -
ఘనంగా నాగోబా జాతర పూజలు
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో జాతర వైభవంగా సాగుతోంది. గురువారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం వెనుక భాన్‌దేవత, పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు, మెస్రం వంశం కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి భాన్‌దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు కుల పెద్ద దేవత పెర్సపేన్ పూజలను ఘనంగా నిర్వహించారు. కటోడ మెస్రం హనుమంత్‌రావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగోబా యూత్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కృతి క్రీడలను కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రారంభించారు. -
సాంప్రదాయబద్దంగా నాగోబా జాతర
-
నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధం
సాక్షి, ఆదిలాబాద్: గిరిజనుల పండుగ నాగోబా మహాజాతరకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మంగళవారం) నాగోబా మహాజాతర మొదలుకానుంది. మర్రిచెట్ల నీడన మెస్రం వంశీయులు జాతర సందర్భంగా పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి పవిత్ర గంగా జలాలతో కేస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశస్థులు నాగోబాకు అభిషేకం చేయనున్నారు. నాగోబా మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు తరలిరానున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. -
నాగోబా జాతర ప్రారంభం
సాక్షి, ఆదిలాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర ఆదివారం ప్రారంభమైంది. పవిత్ర గంగా జలాలతో కేస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశస్థులు జాతరకు తరలివచ్చారు. కాగా... మంగళవారం రాత్రి నాగోబాకు జలాభిషేకం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల వారేగాక పొరుగున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. -
జాతరలో కీలక ఘట్టం
అదిలాబాద్: నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో పాల్గొనడానికి గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అటవీ ప్రాంతమంతా భక్తులతో కిటకిట లాడుతోంది. కాగా ప్రజా దర్భార్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆదిలాబాద్‌లో నాగోబా జాతర సందడి
-
నేటి నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 10 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే నాగోబా మహాపూజలు ఘనంగా నిర్వహించడానికి మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈనెల 27న ప్రారంభమయ్యే జాతర అధికారికంగా 31 వరకు కొనసాగుతుంది. మహాపూజలో భాగంగా పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. గంగాజలం కోసం 80 కిలోమీటర్ల దూరంలో జన్నారం మండలంలో ఉన్న గోదావరినదిలోని హస్తిన మడుగు నుంచి జలం తీసుకొని కాలినడకన ఈనెల 22న కేస్లాపూర్ మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. 23 నుంచి అక్కడ వివిధ రకాల పూజలు నిర్వహిస్తుండగా.. ఆయా ప్రాంతాల్లోని మెస్రం వంశీయులు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు, గిరిజనులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పేప్రే, కాళికోమ్ వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. వివిధ పూజల అనంతరం గోదావరినది నుంచి తీసుకొచ్చిన జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి, నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజలు నిర్వహిస్తారు. పూజల సమయంలో మెస్రం వంశీయులను తప్ప ఇతరులెవరినీ ఆలయంలోకి అనుమతించరు. పూజల తర్వాత అథితులైన జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మెస్రం వంశంలో ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మెస్రం కోడళ్లను వారి కుటుంబీకులు నాగోబా దర్శనం చేయించి, వంశ పెద్దలను పరిచయం చేయించి వారి ఆశీస్సులు పొందుతారు. దీనిని బేటింగ్ అంటారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైనట్లు మెస్రం వంశ పెద్దలు ప్రకటిస్తారు. 28న పెర్సపేన్ పూజలు పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. 29న భాన్ దేవాతకు పూజలు చేస్తారు. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 30న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. 31న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ పూజలు చేయడంతో అధికారికంగా జాతర ముగిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా మరో మూడు రోజుల వరకు జాతర రద్దీ కొనసాగుతుంది. నాగోబా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను విడుదల చేయగా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.ఉట్నూర్ నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. -
జాతరకు రూ.40 లక్షలు మంజూరు
ఇంద్రవెల్లి: తెలంగాణలో ఎంతో గుర్తింపు పొందిన నాగోబా జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న మెస్రం వంశీయుల మహాపూజతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయిస్తున్నారు. జాతరలో భాగంగా ఆదివాసీ సంప్రదాయ ఆటలపోటీలు కూడా జరుగనున్నాయి. -
ప్రారంభమైన నాగోబా జాతర
ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. మూడు రోజుల పాటూ ఈ జాతర కొనసాగనుంది. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్ జోజి, ఐటీడీఏ పీఓ కర్నన్ తదితరులు నాగోబా దేవత ఎదుట పూజలు నిర్వహించారు. జాతరలో ఆదివాసి గిరజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
అడవి పులకించింది
నాగోబా జాతరలో పెర్సాపేన్ పూజలు ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం జాతరలో భాగంగా మెస్రం వంశీయులు పెర్సాపేన్, భాన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డోలు, పెప్రే, కాలీకోమ్ వాయిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు. కొత్తగా భేటింగ్ (పరిచయం) అయిన కోడళ్లు మర్రిచెట్టు వద్ద ఉన్న బావి నుంచి పవిత్ర జలం తీసుకొచ్చారు. భాన్ దేవత ఆలయం ముందు ఉన్న పాత పుట్టను తొలగించారు. పవిత్రజలంతో మెస్రం వంశీయులు పాత భాన్ దేవతల ప్రతిమలను శుద్ధి చేశారు. కోడళ్లు కొత్త పుట్టలను తయారు చేసి భాన్ దేవతకు పూజలు చేశారు. ఆదిలాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. -
నాగోబా సంరంభం
ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర గురువారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజల్లో నిమగ్నమైన మెస్రం వంశీయులు విడిది చేసిన వడమర(మర్రిచెట్టు) నుంచి నాగోబా ఆలయానికి చేరుకుని డోలు, పెప్రె, కాలీకోం, కిక్రి వాయిస్తూ పూజలు చేశారు. పశువుల పేడతో మట్టి పుట్టలను తయారుచేయడానికి ఆడపడుచులు వడమర పవిత్ర బావి నుంచి జలాన్ని తీసుకొస్తున్న చిత్రమిది. - న్యూస్‌లైన్, ఇంద్రవెల్లి