సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు(ఆదివారం) రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేశ్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు.
కాగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా, బండి పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
మొదలైన నాగోబా జాతర
ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు.
చదవండి: ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్
Comments
Please login to add a commentAdd a comment