Arjun Munda
-
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్‌లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్‌లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్: బండి సంజయ్
ఆదిలాబాద్: కేశ్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగదేవత అత్యంత శక్తిమంతమైన దేవత అన్నారు. హిందువుగా పుట్టడమే తన అదృష్టమని పేర్కొన్నారు. గోండిలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగోబా జాతరకు వేల మంది తరలి వస్తున్నా ఏర్పాట్లు సరిగా చేయలేదన్నారు. నిజాం శవానికి అంత్యక్రియలు చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యత అదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ నాగోబా జాతరకు రాలేదని ధ్వజమెత్తారు. 'పోడు భూముల సమస్య ఉంది. కుర్చీ వేసుకోని పట్టాలు ఇస్తామన్నారు సీఎం. ఆ సంగతి మర్చిపోయారు. పోటుగాడు సీఎం కేసీఆర్ పైసలు ఇస్తామని తండాలను పంచాయితీ చేశారు. కాని ఒక్కపైసా ఇవ్వలేదు. గ్రామపంచాయితీ నిదులు దోంగిలించిన దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్ పేదలను ముంచుతున్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఇది లాస్ట్ అసెంబ్లీ. ఇచ్చిన హమీలను అసెంబ్లీ వేదికగా అమలు చేయాలి. అన్ని జాతులను ,వర్గాలను మోసం చేసిన నాయకుడు సీఎం. టీఆర్ఎస్ బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ మార్చారు.' అని బండి ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా బండి సంజయ్‌తో పాటు నాగోబా జాతరలో పాల్గొన్నారు. నాగోబా దేవతను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. చందాలు వేసుకొని అద్భుతమైన మందిరాన్ని నిర్మించారని కొనిడాడారు. జల్ ,జంగల్, జమీన్ హక్కులు కల్పించడంతో తెలంగాణ సర్కారు విపలైందని అర్జున్ ముండా ఆరోపించారు. 'ఆదివాసీలకు జంగలే దేవుడు. పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం కమ్యూనిటీ హక్కులు ఇవ్వడం లేదు. తెలంగాణ లో బీజేపీ అదికారంలో వస్తుంది. అదికారంలోకి రాగానే పట్టాలు ఇస్తాము. కొందరు అడవులను మింగేస్తున్నారు. ఆదివాసీల ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. అదివాసీల కోసం కేశ్లాపూర్ దర్మశాల నిర్మిస్తాం.' అని అర్జున్ ముండా అన్నారు. చదవండి: డెక్కన్‌మాల్ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా? -
కేస్లాపూర్ నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు(ఆదివారం) రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేశ్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. కాగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా, బండి పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మొదలైన నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. చదవండి: ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్ -
సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్) -
కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాను కలిసిన రాజన్నదొర
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గిరిజనశాఖ మంత్రి రాజన్నదొర కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండాను కలిశారు. గిరిజన సంక్షేమ పథకాలు, ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులు, వెనుకబడిన వారిపట్ల నిబద్ధతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కేంద్రమంత్రి ప్రశంసించారు. గిరిజన ప్రాంతంలో రోడ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, గిరిజన గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రంలో రబ్బర్ ప్లాంటేషన్ కోసం అనుమతించిన విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ ప్లాంటేషన్లకు పనులను విస్తరించాలని కోరారు. చదవండి: (కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
గిరిజనులకు విలువిద్యలో శిక్షణ
సాక్షి, విశాఖపట్నం: విలువిద్యలో ఆరితేరిన గిరిజనుల పిల్లల్ని ఆర్చర్లుగా తీర్చి దిద్దుతామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆదివాసీ ప్రాంతంలో ఆర్చరీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తామని, అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. అల్లూరి దాడిచేసిన పోలీస్ స్టేషన్ ఆవరణలో సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి అనుచరుడు గంటం దొర మనుమడు బోడి దొరని ఘనంగా సత్కరించారు. వారి వారసులు 11 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. న్యాయవాది కరణం సత్యనారాయణరాజు ఆంగ్లంలో రచించిన ‘లెజెండరీ అల్లూరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ గిరిజనులు ఆత్మాభిమానం కోసం ప్రాణాలు పణంగా పెడతారని చెప్పారు. అల్లూరి బ్రిటిష్ వారిపై విప్లవాగ్ని రగిలించడం గర్వంగా ఉందన్నారు. గిరిజన సంప్రదాయ కొమ్ములతో.. కేంద్ర మంత్రులు అర్జున్‌ముండా, కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, కళావతి తదితరులు గిరిజనుల ఉన్నత విద్యకు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్ని ప్రారంభించామని, 740కి పైగా పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌ను రూ.12 కోట్ల నుంచి రూ.38 కోట్లకు పెంచామన్నారు. ఆదివాసీలకు దైవంతో సమానమైన చెట్టు, పుట్ట, భూమిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తుల్ని పెంచి, వాటి మార్కెటింగ్‌కు మోడల్ విలేజ్‌లు అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బెంగళూరు, ఢిల్లీలోనూ అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఆధ్వర్యంలోనూ వేడుకలు జరుపుతామని అన్నారు. అల్లూరి నడయాడిన ప్రాంతాల్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు 9 లక్షల ఎకరాలకు పైగా అటవీ హక్కు పత్రాలు అందించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. రాజేంద్రపాలేన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణదేవి పేటలో రూ.66 లక్షలతో అల్లూరి స్మృతి వనం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కళావతి తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు: కిషన్‌రెడ్డి సాక్షి, విశాఖపట్నం: అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన చేసిన పలు సినిమాల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీట్‌కు అమిత్ షా కోరిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
అల్లూరి తొలి దాడికి వందేళ్లు
సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది. చింతపల్లితో మొదలుపెట్టి.. మన్యంలో గిరిజనులపై బ్రిటిష్ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది. ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్ 24న హతమార్చింది. ఆ తరువాత ఆక్టోబర్ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్, 1923 జూన్ 10న మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్ 22న పాడేరు పోలీస్ స్టేషన్‌పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్ పోలీసులు బంధించగా.. మేజర్ గుడాల్ తుపాకీతో కాల్చి చంపాడు. నేడు భారీ బహిరంగ సభ చింతపల్లి స్టేషన్‌పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. -
సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మెచ్చుకున్నారు. గిరిజనులపై సీఎం వైఎస్ జగన్‌కి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఏపీ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించేందుకు పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏపీకి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించగా.. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పారని రవిబాబు మీడియాతో చెప్పారు. ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని, గిరిజన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, గిరిజన ఆరోగ్యం, విద్య, నిరుద్యోగ నిర్మూలన వంటి కార్యక్రమాలను రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,31,420 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసిందని, గిరిజన ఉప ప్రణాళిక కింద 2020–21కి రూ.5,177 కోట్లు కేటాయించిందని, విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర సంస్థలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి వివరించినట్టు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, పునరావాస చర్యలనూ కేంద్ర మంత్రికి వివరించినట్లు రవిబాబు వెల్లడించారు. -
‘గిరిజనులను కేంద్రం ఆదుకోవాలి’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కారణంగా గిరిజనులు నష్టపోయారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కేంద్రానికి తెలిపారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. పలు గిరిజన సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. అటవీ ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటించాలని కోరారు. (ఇది శుభపరిణామం : జవహర్ రెడ్డి) గిరిజనులు పండించే పసుపు,రాజ్మా, ఫైనాపిల్ పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. వన్‌ధన్ కేంద్రాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజనుల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. గిరిజనులను ఆదుకోవడానికి కేంద్రం నిధులను కేటాయించాలని కేంద్రమంత్రికి పుష్పశ్రీవాణి విజ్ఞప్తి చేశారు. (ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు) -
జాతీయ హోదాకు కృషి
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మలను శనివారం ఆయన దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన.. జాతర విశిష్టతను తెలియజేసి జాతీయ హోదా కల్పించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎంతో కాలంగా కోరుకుంటున్న జాతీయ హోదా దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే జాతరకు తప్పకుండా వస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ఆస్తులు లేకపోయినా సంతోషంగా బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పించే అంశం గిరిజన పురాతన సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదని కితాబిచ్చారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. జాతర సమయంలో 36 వేల ట్రిప్పుల ద్వారా 12 లక్షల మందిని గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించారు. జాతర ముగియడంతో తిరుగు పయనమవుతున్న భక్తులు -
జాతీయ పండుగగా గుర్తించండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్‌ముండాను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. ఈమేరకు గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్కండ్ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని మంత్రి వివరించారు. దక్షిణ కుంభమేళాగా భావిస్తున్న మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర జరుగుతుందన్నారు. దీని నిర్వహణకు దాదాపు రూ.110 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర గిరిజన శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ముందుకొచ్చి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులివ్వండి ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతి గృహాల నిర్మాణాలు, సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం సమర్పించారు. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
-
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రుఘువర్ దాస్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేతగా రఘువర్ దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. బీజేపీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ (జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది. -
జార్ఖండ్ కు తొలి గిరిజనేతర సీఎం?
రాంచీ: జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్(రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది. -
జార్ఖండ్ కొత్త సీఎం ఎవరు?
రాంచీ: జార్ఖండ్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీతో విజయం కట్టబెట్టడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సంప్రదింపులు ప్రారంభించింది. అయితే, సీఎం పదవి ఎవరిని వరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రఘువర్‌దాస్, సరయూరాయ్, మాజీ సీఎం అర్జున్‌ముండా సీఎం పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జార్ఖండ్ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం పీఠానికి అర్జున్ ముండా పేరుపై జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికల్లో ఓడిపోవడం ముండాకు ప్రతికూలంగా మారనుంది. ప్రజలు తిరస్కరించిన వారికి బదులు కొత్తవారితో ప్రయోగం చేసేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ముండాకు సీఎం చాన్స్ లేనట్లే. ఇక, రఘువర్‌దాస్ 2010లో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. జంషెడ్పూర్ ప్రజల మద్దతును చూసి గర్విస్తున్నానని, జార్ఖండ్ ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని రఘువర్‌దాస్ ప్రకటించడం చూస్తే సీఎం పీఠంపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సరయూరాయ్కు ఆర్ఎస్ఎస్ మద్దతు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నది బుధవారం తెలియనుంది. -
బీజేపీలో జేవీపీ విలీనం
రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్ భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్‌చంద్ మండల్ బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.