సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్ కారణంగా గిరిజనులు నష్టపోయారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కేంద్రానికి తెలిపారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. పలు గిరిజన సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. అటవీ ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటించాలని కోరారు.
(ఇది శుభపరిణామం : జవహర్ రెడ్డి)
గిరిజనులు పండించే పసుపు,రాజ్‌మా, ఫైనాపిల్ పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. వన్‌ధన్ కేంద్రాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజనుల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. గిరిజనులను ఆదుకోవడానికి కేంద్రం నిధులను కేటాయించాలని కేంద్రమంత్రికి పుష్పశ్రీవాణి విజ్ఞప్తి చేశారు.
(ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment