జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రుఘువర్ దాస్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేతగా రఘువర్ దాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. బీజేపీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ (జంషెడ్‌పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది.