Raghubar das
-
గవర్నర్ కొడుకు ఓవరాక్షన్.. లగ్జరీ కారు కోసం రాజ్‌భవన్ అధికారిపై దాడి
భువనేశ్వర్: ఒడిశా రాజ్‌భవన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు రాజ్‌భవన్‌లోకి ఓ అధికారిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదురు అధికారి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ ఘటనపై బాధితుడి భార్య సయోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకుంత్ ప్రధాన్(47) ఒడిశా రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, డొమెస్టిక్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కాగా, బైకుంత్ ప్రధాన్ ఏడో తేదీన గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్‌ను పూరీ రైల్వే స్టేషన్ నుంచి రాజ్‌భవన్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సన్నాహకాలు జరుగుతున్నాయి. #WATCH | Sayoj, wife of Baikuntha Pradhan, who works in Odisha's Raj Bhavan, has accused the Governor's son and others of beating her husband.She said, "...On the night of June 7, the Governor's son called my husband to his room and beat him badly. He came out to save himself,… pic.twitter.com/PmWmVs3hqh— ANI (@ANI) July 13, 2024ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ బయటకు వెళ్లిపోవడంతో అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ కారును తీసుకుని బైకుంత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అనంతరం, కారు ఎక్కిన లలిత్.. బైకుంత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మారుతీ కారును తీసుకురావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారు రాజ్‌భవన్‌కు చేరుకోగానే లలిత్ కుమార్, అతడి స్నేహితులు(ఐదుగురు) బైకుంత్పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఇక, ఈ ఘటనపై రాజ్‌భవన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు. సయోజ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పూరీ పోలీసులు చెప్పారు. -
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘుబర్ దాస్ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్ -
చేజారిన మరో రాష్ట్రం!
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో బీజేపీ పాలనకు జనం చరమగీతం పాడారు. వేర్వేరు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ సోమవారం అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మహారాష్ట్ర భంగపాటు జరిగి రెణ్నెల్లు తిరక్కుండానే జార్ఖండ్‌లో బీజేపీకి తగిలిన రెండో గాయమిది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటినుంచీ కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని స్థానాల్లోనూ ఈ ధోరణి కనబడింది. చెప్పాలంటే మొదట్లో బీజేపీ ఎంతో కొంత మెరుగైన స్థితి కనబరిచింది. కానీ లెక్కింపు కొనసాగుతున్నకొద్దీ అది క్రమేపీ క్షీణించింది. ఆఖరికి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సైతం తన నియోజకవర్గంలో ఆదినుంచీ వెనకబడివున్నారంటే జనాగ్రహం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇది నూరు శాతం బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. రఘువర్ దాస్ ఓడింది చెప్పుకోదగ్గ నాయకుడిపై కాదు. నిన్న మొన్నటివరకూ తమ పార్టీలో, తన అను చరుడిగావున్న వ్యక్తి చేతుల్లోనే ఆయనకు ఓటమి తప్పలేదు. వాస్తవానికి జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కి చెప్పుకోదగ్గ బలమంటూ లేదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల మాదిరే ఇక్కడ కూడా ఆ పార్టీ నిస్తేజంగా ఉంది. రాహుల్‌గాంధీ అయిదు ప్రచారసభల్లో, ఆయన సోదరి ప్రియాంక ఒక సభలో మాత్రమే మాట్లాడారు. ఇందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెరో తొమ్మిది సభల్లో ప్రసంగించారు. బీజేపీకి చెందిన ఇతర నేతలు సరేసరి. అటు కాంగ్రెస్‌కు పార్టీ శ్రేణుల్ని సమరానికి సమాయత్తం చేయగల సత్తాగానీ, ప్రజల్ని ఒప్పించగల నేర్పరితనంగానీ ఉన్న నాయకుడు లేరు. మహారాష్ట్ర మాదిరి గెలుపు గుర్రంతో చెలిమి చేయడం ఆ పార్టీకి కలిసొచ్చిన ఏకైక ఎత్తుగడ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బీజేపీకి గట్టి సవాలు ఇవ్వగల పార్టీయే అయినా ఆ పార్టీ నాయకుడు హేమంత్ సోరెన్ శరద్ పవార్ స్థాయి నాయకుడు కాదు. ఆయనలా కాంగ్రెస్ నాయకత్వ లేమిని పూడ్చగలిగినవాడు కాదు. రాష్ట్రానికి మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌పై జనంలోవున్న అనుకూలత హేమంత్‌కు కలిసొచ్చింది. అయితే తమ పార్టీకి మొదట్నించీ పునాదిగావున్న ఆదివాసీలనూ, కుర్మీలనూ కూడగట్టుకోవడంలోనే ఆయన అధిక సమయాన్ని వెచ్చించాల్సివచ్చింది. ఎందుకంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)కి కూడా కుర్మీలలో చెప్పుకోదగ్గ పలుకుబడివుంది. జార్ఖండ్ జనాభాలో ఆదివాసీ, కుర్మీలు దాదాపు సగభాగం ఉంటారు. మొదటినుంచీ అంచనాలకు భిన్నమైన ఫలితాలు అందించడం జార్ఖండ్ ప్రత్యేకత. అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు తప్పని రుజువయ్యాయి. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న 14 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు జారవిడుచుకోక తప్పదని ఎన్నికల ముందు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి. కానీ బీజేపీ మాత్రం అంతకుముందు మాదిరే 12 స్థానాలు సాధించగా, ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ(ఏజేఎస్‌యూపీ) ఒక స్థానాన్ని గెల్చు కుంది. బీజేపీ ఓటుబ్యాంకు 40 శాతం య«థాతథంగావుంది. కానీ ఆర్నెల్లు గడిచేసరికల్లా ఆ ఓటు బ్యాంకు గల్లంతయింది. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తొలిసారి వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. 81మంది సభ్యులుగల ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీకి 37 రాగా, ఆ పార్టీ మిత్ర పక్షం ఏజేఎస్యూపీకి 5 లభించాయి. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) 8 స్థానాలు సాధించినా అందులో ఆరుగురు 2015లో బీజేపీ శిబిరంలో చేరారు. అప్పట్లో జేఎంఎంకు 19, కాంగ్రెస్‌కు 6 వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావా ల్సిన కనీస మెజారిటీ 41 కనుక బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వగలిగింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తూ 1973లో ఆవిర్భవించిన జేఎంఎం పోరాటం ఫలితంగా 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో చెలిమి చేసి 8 చోట్ల పోటీచేసి అయిదుచోట్ల గెలుపొందిన ఏజేఎస్‌యూ, ఈసారి తమకు 17 నుంచి 19 కేటాయించాలని డిమాండ్చేసింది. మహారాష్ట్ర, హరి యాణా ఎన్నికల ఫలితాలు రావడం, ఆ రెండుచోట్లా బీజేపీకి ఆదరణ గతంతో పోలిస్తే క్షీణించడం చూశాక ఏజేఎస్‌యూ తన డిమాండ్‌పై మరింత పట్టుబట్టడం మొదలెట్టింది. చివరికది దూరం కావడంతో బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. 24 జిల్లాలున్న జార్ఖండ్‌లో 19చోట్ల మావోయిస్టుల ప్రాబల్యంవుంది. కనుకనే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఆదివాసీ జనాభా అధికంగావున్న జార్ఖండ్‌లో 2014లో తొలిసారి ఆదివాసీయేతరుడైన రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడం బీజేపీ సాహసమే. ఇది చాలదన్నట్టు కౌలు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల్ని, భూసేకరణ విధానాల్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ భూములపై తమకుండే హక్కును ఇవి దెబ్బతీస్తాయని వారు ఆందోళనపడ్డారు. బ్రిటిష్‌వారిపై పోరాడి ప్రాణాలర్పించిన ముండా తెగ ఆదివాసీల స్మృతికి నివాళులర్పించేందుకు లోక్‌సభ ఎన్నికల సమయంలో రఘుబర్‌దాస్ కుంతి ప్రాంతానికెళ్లినప్పుడు ఆదివాసీలు ఆయనపై చెప్పులు విసిరి నిరసన ప్రకటించారు. అయినా అప్పట్లో బీజేపీ అభ్యర్థే గెలిచారు. బీజేపీ విధానాలు తీవ్రంగా దెబ్బ తీస్తాయని ప్రచారం చేయడంలో విపక్షాలు ఈసారి విజయం సాధించాయి. తాము అధికారంలోకొస్తే ఆదివాసీల భూములకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశాయి. అలాగే సీఏఏ, ఎన్నార్సీలు జార్ఖండ్ ముస్లింలపై కూడా ప్రభావం చూపాయి. బీజేపీ తన ప్రచారాన్ని ప్రధానంగా అభివృద్ధిపై కేంద్రీ కరించింది. సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలది దుష్ప్రచారమని కొట్టిపారేసింది. ఎన్నికల ఫలితాలు పార్టీలు స్వీయ సమీక్ష చేసుకోవడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా మరో రాష్ట్రాన్ని చేజార్చుకున్న పార్టీగా బీజేపీ రాష్ట్రంతోపాటు కేంద్రంలో అనుసరిస్తున్న విధానాల్లోని తప్పొప్పులపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం నాడి తెలిశాక అయినా వాటిని సవరించుకోవాలి. -
'ఇది నా ఓటమి, పార్టీది కాదు'
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీ ఘోర పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రకటించారు. ఇది కేవలం తన ఓటమి అని, బీజేపీది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫలితాలపై స్పందిస్తూ.. జార్ఖండ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ జార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. గతంలో బీజేపీకి అధికారమిచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్ఖండ్ పీఠం తమదేనని పాలక బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. हम झारखंड की जनता द्वारा दिये गये जनादेश का सम्मान करते हैं। भाजपा को 5 वर्षों तक प्रदेश की सेवा करने का जो मौका दिया था उसके लिए हम जनता का हृदय से आभार व्यक्त करते हैं। भाजपा निरंतर प्रदेश के विकास के लिए कटिबद्ध रहेगी। सभी कार्यकर्ताओं का उनके अथक परिश्रम के लिए अभिनंदन। — Amit Shah (@AmitShah) December 23, 2019 -
జార్ఖండ్ పీఠం మాదే..
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా పాలక బీజేపీ గెలుపుపై భరోసా వీడలేదు. బీజేపీ నేతృత్వంలోనే జార్ఖండ్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి రఘబర్‌దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన క్రమంలో ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని చెప్పుకొచ్చారు. ఆధిక్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి మధ్య దోబూచులాట నెలకొందని, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్ ఏ క్షణమైనా తారుమారు కావచ్చని ఆయన పేర్కొన్నారు. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న వాళ్లను చేసుకోనివ్వండి..ఒకరు వేడుక చేసుకుంటుంటే ఎవరూ ఆపబోరని వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన సమయంలో మొత్తం 81 స్ధానాలకు గాను బీజేపీ 28 స్ధానాల్లో ముందంజలో ఉండగా, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండి మేజిక్ ఫిగర్ (41)ను అందుకుంది. విపక్ష కూటమి విజయంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ సీఎం పగ్గాలు చేపడతారని కూటమి నేతలు స్పష్టం చేశారు. -
‘మూక దాడులకు పాల్పడితే సహించం’
రాంచీ : మూక దాడులకు పాల్పడే వారు ఏ కులం, మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమని జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ స్పష్టం చేశారు. బైక్‌ను చోరీ చేశాడనే ఆరోపణలపై ముస్లిం యువకుడిపై ఇటీవల జరిగిన మూక దాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, నేరగాళ్లను కఠినంగా శిక్షించడంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ తరహా కేసులను ఫాస్ట్‌ట్రాక్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జార్ఖండ్ దేశంలోనే తొలి రాష్ట్రమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ ఘటనపై రాజ్యసభలో స్పందిస్తూ ఈ తరహా చర్యలు తనను బాధించాయని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. తబ్రేజ్ అన్సారీ అనే వ్యక్తిని అల్లరి మూకలు చుట్టుముట్టి జై శ్రీరాం, జై హనుమాన్ అని నినదించాలని కోరుతూ దాడికి పాల్పడిన వీడియో కలకలం రేపింది. మూక దాడికి గురైన అన్సారీ ఆ తర్వాత మరణించారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తమ ప్రభుత్వం నేరగాళ్లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని జార్ఖండ్ సీఎం దాస్ కోరారు. -
‘బెంగాల్‌ను పాక్‌లో కలిపేందుకు దీదీ ప్రయత్నం’
కోల్కత్తా: ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మమతపై జార్ఖండ్ సీఎం రఘువర దాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌ను పాకిస్తాన్లో విలీనం చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే జై శ్రీరాం అనే వారందరిని అరెస్ట్ చేసి రాష్ట్రంలో నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. జైశ్రీ రాం అంటే తప్పేంటని.. మనం భారతదేశంలో కాదా నివసించేదని దాస్ ప్రశ్నించారు. ఆమె వింత ప్రవర్తనతో ప్రజలు విసిగిపోయారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మోదీ నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలంతా విశ్వసిస్తున్నారని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ కాన్వాయ్ ఎదుట బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దారుణం.. బాలికపై పోలీసులే..
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగట్టారు. ఓ మైనర్ బాలిక తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారిలో ఇద్దరు పోలీసులున్నారి జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం సీఎం సిద్దిబాత్ కార్యక్రమానికి వచ్చిన బాలిక సీఎంతో తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. జంషెడ్‌పూర్‌కు చెందిన ఆ బాలిక ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీ, డీఎస్పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన జంషెడ్పూర్ ఎస్పీ అనూప్ బర్తార్యా స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
సామూహిక వివాహ వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్
-
వివాహ వేడుకలో సీఎం డ్యాన్స్...!!
రాంచి : నగరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. కేంద్రీయ సరానా సమితి(కేఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 351 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రఘుబర్ దాస్ గిరిజనుల స్థితి గతుల గురించి మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లుగా గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. గిరిజన వర్గం నుంచి అత్యధిక మంది ఇంజనీర్లు, పోలీసు ఉన్నతాధికారులుగా ఎదిగితే చూడాలని ఉందన్నారు. ఫెలోషిప్ యోజన ద్వారా గిరిజన బాలలకు ఉన్నత విద్యావకాశాలు పెంపొందిస్తున్నామని.. అందుకోసం 10 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. -
మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్
-
మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్
జంషెడ్పూర్: జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అంటూ పలువురు పెదవి విరిచేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎందుకు కాళ్లు కడిగించుకున్నారని అనుకుంటున్నారా.. గురుపూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దాస్‌ను ఆహ్వానించారు. అయితే, సాధారణంగా పూలమాల వేసో లేక ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చో స్వాగతం పలకడం చేస్తారు. కానీ, ఎప్పుడైతే ఆయన వచ్చారో ఓ ఇద్దరు మహిళలు ఆయనకు ఎదురెళ్లారు. కింద పెద్ద తాంబాళంలాంటిదాన్ని పెట్టారు. ఆ తర్వాత ఆయన తన పంచెను పైకెత్తి పట్టుకోగా కాళ్లపై గులాబీ రేకులతో నింపి ఉన్న నీళ్లు పోస్తూ కడిగేశారు. అనంతరం లేచి నిల్చొని ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి ఇది ఏ మాత్రం తగదని, ఇలాంటి చర్యలు తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రంజీత్ రంజన్ స్పందిస్తూ ఇలాంటి స్వాగతం ఆయనకు పలకాలని అనుకున్నప్పుడు అది మహిళలతోనే ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీశారు. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు. -
కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి
ఏవైనా కేసులు నమోదైతే చాలు.. వాటికి వెంటనే బెయిల్ తెచ్చుకోవడం, కోర్టు మెట్లు ఎక్కకుండా జాగ్రత్తగా తప్పించుకోవడం కొందరు ముఖ్యమంత్రులకు ఉన్న అలవాటు. కానీ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ మాత్రం అలా చేయలేదు. 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయన స్వయంగా ఓ స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఉన్న మరో సహ నిందితుడితో కలిసి ఆయన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్ఘేట్ జీకే తివారీ ఎదుట హాజరయ్యారు. బిస్తుపూర్ సమీపంలో జిల్లా అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి లేకుండా దాస్‌తో పాటు మరో 12 మంది బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలను ఎగరేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులందరి వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. మరో కేసులో కూడా సీఎం రఘువర్ దాస్, మరో 22 మంది నిందితులు కలిసి 2007లో నమోదైన కేసు విచారణకు సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశోక్‌కుమార్ ఎదుట హాజరయ్యారు. అధికారుల అనుమతి లేకుండా ఓ ఆలయానికి ప్రహరీ నిర్మించిన కేసులో అరెస్టయిన నిందితులను బలవంతంగా తీసుకెళ్లిపోయినట్లు దాస్, 22 మంది బీజేపీ కార్యకర్తలతో పాటు 500 మంది గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో కూడా దాస్ చెప్పిన విషయాలను నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. ఈ రెండు కేసులలోనూ తాను నిర్దోషినని, నాటి అధికార పార్టీలు తనను తప్పుడు కేసుల్లో ఇరికించాయని దాస్ అన్నారు. -
కొత్తజంటకు సీఎం వినూత్న కానుక!
పెద్దనోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లపైనా పడుతోంది. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో నూతన వధూవరులకు కానుకలు ఇవ్వాలనుకున్నవారు కొన్ని సందర్భాల్లో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కొత్త జంటకు వినూత్న కానుక ఇచ్చారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లయింది. ఈ పెళ్లికి హాజరైన రఘుబర్ దాస్ నూతన వధూవరులకు క్యాష్ ప్రిపెయిడ్ కార్డును కానుకగా ఇచ్చారు. నోట్ల రద్దు నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఒక బ్లాక్‌ను ఈ నెల ముగిసేలోగా నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాల్సిందిగా ప్రజలకు సందేశం ఇస్తూ సీఎం పెళ్లివేడుకలో ఈ కొత్తరకం కానుకను ఇచ్చారు. గిరిజన జనాభా అధికంగా గల జార్ఖండ్‌లో నోట్ల రద్దు ప్రభావాన్ని తప్పించుకొనేందుకు నగదురహిత లావాదేవీలను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం భావిస్తోంది. -
జార్ఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: గోహత్యలపై వివాదం నెలకొన్న ఈ తరుణంలో జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని స్వదేశంగా భావించే వారు గోవును తల్లిలా పూజించాలన్నారు. ఇటీవల జరుగుతున్న ఉదంతాల్లో పశువుల అక్రమ రవాణాదారుల హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గోవధ, సంఖ్యపై కొంచెం సంఘ్ పరివార్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గోరక్షణపై మాత్రం ఏకాభిప్రాయం నెలకొందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న అసాంఘిక శక్తులే గోవధలకు పాల్పడుతున్నాయన్నారు. గోవధకు పాల్పడే వారే గో సంరక్షకుల్లా మారువేషం వేసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తమను మోదీ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై దాస్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధాని తెలిపిన వ్యాఖ్యల్లో నిజముందని పేర్కొన్నారు. -
జీఎస్టీ బిల్లుకు జార్ఖండ్ ఆమోదం
రాంచి: అస్సాం, బిహార్ తర్వాత జీఎస్టీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాం ముందుగా జిఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేయేతర పార్టీల పాలిత రాష్ట్రంగా బిహార్ నిలిచింది. బిహార్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో మంగళవారం దీన్ని ఆమోదించారు. కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు. -
ఫిబ్రవరిలో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకం, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. సత్వర అనుమతులు, నిరంతర విద్యుత్‌తో వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16-17 తారీఖుల్లో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో రఘుబర్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్‌తోనూ, విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ కోసం ఐటీ సంస్థ ఒరాకిల్‌తోనూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. శ్రీ సిమెంట్ దాదాపు రూ. 600 కోట్లతో జార్ఖండ్‌లో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు రఘుబర్ దాస్ ఈ సందర్భంగా చెప్పారు. -
జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం గురువారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో... టైర్ పేలింది. అయితే సీఎం రఘుబర్ దాస్తోపాటు 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోఎయిర్వేస్ విమానం ఢిల్లీ నుంచి రాంచీ విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. -
'భార్యాబిడ్డలు ఓడిపోయినా బుద్ధి రాలేదు'
పాట్నా: 'సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భార్య, కూతుర్లు చిత్తుగా ఓడిపోయారు. బొటాబొటి ఓట్లతో డిపాడిట్ మాత్రమే దక్కించుకోగలిగారు. అయినా సరే ఆ నేతకు బుద్ధి రాలేదు. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యుల్ని చట్టసభలో కూర్చోబెడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు' అంటూ ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాలూ సహా బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో లాలూ సతీమణి రబ్రిదేవి, కుమార్తె మీసా భారతిలు ఇద్దరూ ఓటమి చెందిన విషయం తెలిసిందే. 'బీహార్ లో ఇద్దరు పొగరుమోతు నాయకులున్నారు. ఒకరికేమో తన కుటుంబ ఉన్నతి తప్ప మరేదీ పట్టదు. ఇంకొకాయన తాను సమర్థుడినని ప్రచారం చేసుకోవడంతప్ప పనేమీ చేయరు' అంటూ లాలూ, నితీశ్ లను దాస్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ఓటర్లు జేడీయూ, ఆర్ జేడీలను పాతిపెట్టి.. బీజేపీకి విజయాన్ని అందించాలని కోరారు. -
జార్ఖండ్ సీఎంగా రఘువర్‌దాస్ ప్రమాణం
మంత్రులుగా మరో నలుగురు కూడా.. పొగమంచు వల్ల హాజరుకాలేకపోయిన ప్రధాని రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సాముండా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రఘువర్దాస్తో పాటు మరో నలుగురితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణం చేయించారు. వీరిలో బీజేపీ తరఫున నీల్కాంత్సింగ్ ముండా, చంద్రేశ్వర్ప్రసాద్ సింగ్, లూయిస్ మరాండీ, మిత్రపక్షం అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్‌జేయూ) నుంచి చంద్రప్రకాశ్ చౌదరి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తదితరులు రావాల్సి ఉన్నా... ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలను నిలిపివేయడంతో హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రఘువర్దాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిరహిత అభివృద్ధి సాధిస్తాం రాంచీ: అవినీతికి తావులేని అభివృద్ధి పనులను చేపడతామని, ప్రభుత్వ సేవలను నిర్ధిష్టమైన కాలపరిమితితో అందిస్తామని జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్ చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగానికి ఈ అభివృద్ధి పనులను అప్పగిస్తామన్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జార్ఖండ్‌కు ఇప్పటి వరకూ అంతమంచి పేరు లేదని, దీనిని తొలగించాలంటే అందరి సహకారం అవసరమని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీడియా కూడా దీనికి సహకరించాలని కోరారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న కొత్త సీఎం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన కొద్దిసేపటికే రఘువర్‌దాస్ స్వచ్ఛభారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే కరంతోలి ప్రాంతంలోని రోడ్లను ఊడ్చారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రివర్గ సభ్యుడు సీపీ సింగ్‌తో కలసి ఆయన నేరుగా కరంతోలి ప్రాంతానికి చేరుకున్నారు. సంక్షేమ పథకాల కింద వృద్ధులకు పింఛన్లు, ఇతర సదుపాయాలు అందడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించానని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో వృద్ధులందరికీ పింఛన్లు, ఇతర సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
-
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రుఘువర్ దాస్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేతగా రఘువర్ దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. బీజేపీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ (జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది. -
జార్ఖండ్ కు తొలి గిరిజనేతర సీఎం?
రాంచీ: జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్(రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది. -
జార్ఖండ్ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు ఉండదు: బీజేపీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ అడుగులేస్తోంది. ఏపార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబార్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జేడీ(యూ)తో కలిసి బీజేపీ పోటీ చేసి.. 18 సీట్లలో విజయం సాధించింది. లోకసభ ఎన్నికల పలితాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్ లో 14 సీట్లలో పోటీ చేసి 12 సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఐదు దఫాలుగా జరిగే ఎన్నికలు జరుగుతాయన్నారు. నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 14, 20 తేదిలలో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.