మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌ | Jharkhand Chief Minister 'Lets' Women Wash His Feet | Sakshi
Sakshi News home page

మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

Jul 10 2017 9:08 AM | Updated on Sep 5 2017 3:42 PM

మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

జంషెడ్‌పూర్‌: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అంటూ పలువురు పెదవి విరిచేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎందుకు కాళ్లు కడిగించుకున్నారని అనుకుంటున్నారా.. గురుపూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దాస్‌ను ఆహ్వానించారు. అయితే, సాధారణంగా పూలమాల వేసో లేక ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చో స్వాగతం పలకడం చేస్తారు. కానీ, ఎప్పుడైతే ఆయన వచ్చారో ఓ ఇద్దరు మహిళలు ఆయనకు ఎదురెళ్లారు. కింద పెద్ద తాంబాళంలాంటిదాన్ని పెట్టారు.

ఆ తర్వాత ఆయన తన పంచెను పైకెత్తి పట్టుకోగా కాళ్లపై గులాబీ రేకులతో నింపి ఉన్న నీళ్లు పోస్తూ కడిగేశారు. అనంతరం లేచి నిల్చొని ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి ఇది ఏ మాత్రం తగదని, ఇలాంటి చర్యలు తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రంజీత్‌ రంజన్‌ స్పందిస్తూ ఇలాంటి స్వాగతం ఆయనకు పలకాలని అనుకున్నప్పుడు అది మహిళలతోనే ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీశారు. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement