Guru purnima
-
సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..!
గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహానగరంలో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు. సిడ్నీ తెలుగింటి ఆడపడుచుగా ఆస్ట్రేలియా లోనే మొదటి రచయిత్రి కథా సంపుటి 'నీ జీవితం నీ చేతిలో' 21 కథల సమాహారం. పాఠకులకు సందేశాన్ని, వినోదాన్ని, కనువిప్పును, స్ఫూర్తి ని నింపే కథలు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చేతిలోకి తీసుకోవలసినదే 'నీ జీవితం నీ చేతిలో'.రెండో పుస్తకం 'రంగానందలహరి' శ్రీ పెయ్యేటి రంగారావు గారు అందిస్తున్న94 భక్తిగీతాలు, భావ గీతాలు ప్రతి ఇంటిలో ఉండవలసిన భాషా కుసుమాలు. లండన్ డర్రీ నైబర్ హుడ్ కమ్యూనిటీ సెంటర్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు సకల కళా దర్శిని సిడ్నీ, ఆస్ట్రేలియా వారు నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన పాటలు, పద్యాలు, భావగీతాలు కళాకారులు శ్రీ వద్దిపర్తి శ్రీనివాస్ గారు, చిన్నారులు ఆశ్రిత గరగ, శ్రిత భాగవతుల ఆలపించారు. మయూర అకాడమీ గురువులు శ్రీ రమణ కరణం గారు కొరియోగ్రఫీ, డా. పద్మ మల్లెల సంగీతం సమకూర్చిన శ్రీ పెయ్యేటి రంగారావుగారి శ్రీ సీతా రాముల పరిణయ వేడుక గీతాన్ని అనిరుధ్ కరణం, లోహిత గొళ్లపల్లి కూచిపూడి నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.నృత్యాలయ డాన్స్ టెంపుల్ నుంచి విద్యార్థులు భరతనాట్యం ఫ్యూజన్ నృత్యం తో అందరినీ అలరించారు. లాలిత్య, సౌమ్య, సంతోషి గార్లు గణేశ, సరస్వతీ ప్రార్థన తో నృత్య అభినయంతో కార్యక్రమానికి శుభారంభం చేసారు. కార్యక్రమానికి సుశ్మిత విన్నకోట వ్యాఖ్యాత గా వ్యవహరించారు.సకల కళా దర్శిని అధ్యక్షురాలు శ్రీమతి విజయ గొల్లపూడి మాట్లాడుతూ, జూలై 2022 వ సంవత్సరంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఆశీస్సులతో సకల కళా దర్శిని, సిడ్నీ, ఆస్ట్రేలియా సకల కళలకు వేదికగా నెలకొల్పటం జరిగింది అన్నారు. ఇంకా ఈ సకల కళాదర్శిని వేదికపై గత ఫిబ్రవరిలో ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి తో, పేరొందిన లలిత సంగీత కళాకారులతో గాన విభావరి నిర్వహించాము. ప్రస్తుతం మన సనాతన ధర్మ ప్రచారం లో భాగంగా భగవద్గీత పారాయణ నెల నెల ఒక అధ్యాయం చొప్పున ప్రపంచ వ్యాప్తంగా నెల నెల నిర్వహించటము జరుగుతోంది. ఇప్పటివరకు ఐదు అధ్యాయాలు జయప్రదంగా జరుపుకున్నాము.వచ్చే ఆదివారం ఆరవ అధ్యాయ పారాయణ జరుపుకోబోతున్నాము.ఈ సకల కళా దర్శిని నెల కొల్పటంలో ముఖ్య ఉద్దేశ్యం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం ఎంతో అమూల్యమైనవి, తరగని విలువైన సంపద. ఇది తర తరాలకు అనంత వాహిని లా ప్రవహించేలా అందచేయటం బాధ్యతగా భావించాను. అమ్మ భాషతో అనుబంధం ఉండాలి. మన తెలుగునాట అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వారి లోని కళా నైపుణ్యాన్ని గుర్తిస్తూ, ప్రపంచానికి తెలియచేయాలి. అలాగే స్థానికంగా ఉన్న చిన్నారులు, కళాకారులకు కూడా ఈ సకల కళా దర్శిని ఒక చక్కని వేదికగా నిలవాలి అనే అకాంక్ష. ముఖ్యంగా సాహిత్యం, మన తెలుగు భాషా, సంస్కృతులు పరిమళాలు ఎల్లెడలా వ్యాపించాలి. మన మాతృభూమికి దూరంగా ఉంటున్నాము అన్న వెలితి లేకుండా, ఎక్కడ ఉన్నా తెలుగు వారమే, ఖండ ఖండాతరాలలో మన తెలుగు ఉనికిని, ప్రతిభా పాటవాలను చాటుకుంటు, అటకెక్కకుండా అవకాశాలను ఏర్పరుచుకోవడమే ముఖ్య ఆశయం అని సకల కళా దర్శిని సంస్థ లక్ష్యాలను విశదీకరించారు.విజయ మాధవి గొల్లపూడి రచించిన కథల సంపుటి 21 కథలు, జూలై 21 వ తేదీన పవిత్ర గురు పౌర్ణమి రోజున ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ రెస్టారెంట్ గ్రూప్ అధినేత ‘రాజ్ వెంకట రమణ’ చేతులతో పుస్తక ఆవిష్కరణ చేసారు.‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటి కి ప్రముఖ చిత్ర కళాకారులు శ్రీ కూచి సాయి శంకర్ గారు ముఖ చిత్రాన్ని అందించారు.పుస్తకం లోని గురువచనం ముందుమాటగా ‘ప్రియమైననీకు’ లేఖారూప కథ తీపి జ్ఞాపకాల స్నేహబంధాన్ని వివరించిన తీరు మధురంగా ఉంది. ఇలా ఒక్కో కథలో ఒక్కోప్రత్యేకత, సున్నితమైన భావాలు, మానవీయత, విలువలు కలిగిన జీవితం లోని పరమార్థం…వంటి సార్వకాలీన, సార్వజనీన విషయాలను మృదువైన, శక్తివంతమైన శైలిలో, హృదయానికి హత్తుకునేలా రచించిన రచయిత్రి సంస్కారానికి, ప్రతిభకి అభినందనలు” అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటలను చదివి వినిపించారు సుశ్మిత.శ్రీమతి చావలి విజయ ‘నీ జీవితం నీ చేతిలో’ 21 కథల సారాంసాన్ని, రచయిత్రి శైలిని వివరిస్తూ, చక్కని సమీక్ష ను అందచేసారు. రచయిత్రి విజయ గొల్లపూడి గారికి సీస, తేటగీతి పద్యమాలికలతో శ్రీమతి విజయ చావలి గారు అభినందన మందారమాలను అందచేశారు. గతంలో తెలుగు పలుకు పత్రికకు 15 ఏళ్ళు సంపాదకునిగా వ్యవహరించిన శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటిపై పుస్తక సమీక్ష చేశారు.కవి, రచయిత శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన ‘రంగానందలహరి’ పుస్తకాన్ని ఎసెట్ పాయింట్ హోమ్స్ సంస్థ అధినేత రామ్ వేల్ గారు ఆవిష్కరించారు.రంగానందలహరి పుస్తకానికి ప్రణవి గొల్లపూడి ముఖచిత్రాన్ని అందించారు. రంగానందలహరి లోని కావ్య గీతికలను తెలుగు పండితులు శ్రీ తూములూరి శాస్త్రి గారు సమీక్ష చేసారు. తెలుగు భాషాభిమానులను ఈ పుస్తకం అందరినీ చదివింపచేస్తుంది. రాకేందు శేఖరా, ఏడుకొండల ఏలికా రంగానందలహరి లో రచయిత వాడిన పదప్రయోగాలపై శ్రీ పెయ్యేటి రంగారావు గారిని ప్రశంసించారు.శ్రీ తూములూరి శాస్త్రి గారు రంగారావుగారికి అభినందనలతో ప్రశంసా పత్రాన్ని అందించారు.గీ. తెలుగు పదముల సొగసులు తీయదనము వెలుగు జిలుగులు ఆనంద వీచికలతొ రంగరించిన కవితా తరంగ రంగ విహరి! ఈ రంగ యానంద లహరి లహరి! సీ. భక్తిభావము నించ పదకవితాపితా మహుడు కొండొకచోట మదిని నిల్చు సందేశములు పంచ సందోహమెంచగా గురజాడ జాడలే గుర్తు తెచ్చు మానవతావాద మహితోక్తు లందించ నాయని నండూరి నడకలెచ్చు భావకవిత్వంపు పరువాలు పండించ దేవులపల్లియే దీప్తినిచ్చుగీ. భక్తి ఆసక్తి సంసక్తి రక్తి యుక్తి నించి మించిన సాహితీ నియత శక్తి భావ విద్వత్ స్వభావ ప్రభావ మంత రంగరించిరి కవితల రంగరాయ!క. తియ్యని కవితా విరులతొ నెయ్యము సేయంగ మిగుల నేర్పరులౌగా పెయ్యేటి రంగరాయా! వెయ్యారుల వందనములు వినతులు సేతున్! వేద పండితులు శ్రీ నేతి రామకృష్ణ గారు రంగానందలహరి కావ్యగీతికలను సమీక్ష చేసారు. వేదికపై అలంకరించిన రచయితలకు, పండితులకు పుష్పగుచ్ఛం, శాలువాలతో సత్కరించారు.కార్యక్రమానికి విచ్చేసిన డా. చెన్నప్రగడ మూర్తి, డా. జ్యోతి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఓలేటి మూర్తి గారు, శ్రీ పోతుకూచి మూర్తిగారు కళాకరులందరికీ ప్రశంసా పత్రాలను అందచేసారు. -
హైదరాబాద్‌లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు (ఫోటోలు)
-
అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడి సరయూ నదీతీరంలో భక్తివిశ్వాసాలు పెల్లుబికాయి. నేటి (ఆదివారం) ఉదయం నుంచి భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి, శ్రీరాములవారిని దర్శనం చేసుకుంటున్నారు.గురు పూర్ణిమ సందర్భంగా రామనగరికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సరయూలో భక్తుల స్నానాలు మొదలయ్యాయి. శ్రీ రాముడు తన గురువైన వశిష్ణుడిని ఆరాధించాడని చెబుతారు. ఈరోజు రామాలయంలో రోజంతా గురు పూర్ణిమవేడుకలు జరగనున్నాయి. Uttar Pradesh: On Guru Purnima in Ayodhya, devotees flocked to the Sarayu River for holy dips and rituals. The city buzzed with celebrations, honoring the ancient guru-disciple tradition with extensive security measures in place pic.twitter.com/2jfVkbFhlB— IANS (@ians_india) July 21, 2024 -
దిల్ సుఖ్ నగర్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
షిర్డీ: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్‌కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ అంక్షలన్నీ ఎత్తివేసింది. ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు. అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి. 1.35 లక్షల హెక్టార్లలో పంటనష్టం: ఫడ్నవీస్ నాగ్‌పూర్/చంద్రాపూర్: వరదల కారణంగా నాగ్‌పూర్ డివిజన్లో దాదాపు 1,35,000 హె క్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. హింగ్‌ఘాట్, చంద్రాపూర్ జిల్లాల్లో మంగళవారం వర్ష ప్రభావిత గ్రామాలను సందర్శించిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్‌పూర్ డివిజన్లో ముఖ్యంగా చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం నాగ్‌పూర్ డివిజన్లో వరదలతో 1,35,000 హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాలపై సర్వే జరుగుతోందని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అలాగే జిల్లాలోని చిమూర్ తహసీల్‌లోని నవేగావ్ (పేథ్)లో పంట నష్టాన్ని కూడా ఫడ్నవీస్ పరిశీలించారు. -
తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
సీఎం జగన్ గురుపూర్ణిమ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: గురుపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: గురుపూర్ణిమ స్పెషల్: ఒక గురువు... వేలాది మంది శిష్యులు రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు.#GuruPurnima2022 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2022 -
గురు పూర్ణిమ సందర్బంగా సాయిబాబా ఆలయాలో భక్తుల సందడి
-
గురుపూర్ణిమ స్పెషల్: ఒక గురువు... వేలాది మంది శిష్యులు
గురు శిష్య సంబంధం అనేది మన జీవితాల్లో ఒక ప్రధాన అంశం. మన సాంప్రదాయక విలువల్లో విధిగా అది ఒక భాగం. మన భారతీయ సమాజం గురువుని అత్యున్నత పీఠంపై నిలిపింది. అలాగే పరమహంస యోగానంద శిష్యురాలూ, యోగదా సత్సంగ సమాజానికి పూర్వ అధ్యక్షురాలు మృణాళినీ మాత తాను రచించిన ‘గురుశిష్య సంబంధం’ అనే పుస్తకంలో శిష్యుడి జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలరన్న సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించారు. శిష్యుడిని అన్ని విధాలా తనకు ప్రతిరూపంగా తయారుచేయడానికి కావలసిన శక్తిని, సహజమైన సామర్థ్యాన్ని గురువు కలిగి ఉంటారు. చదవండి: నిన్ను వెలిగించే దీపం... నవ్వు నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం తేలికే. అయితే యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని సలహా ఇచ్చారు: ‘‘జీవితమనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ వెళ్తున్నపుడు, కళ్ళున్నవారి సహాయం నీకు కావాలి. ఆ మార్గం సత్యమైనదా, కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నారు, ఆయన చేసే పనులు తాను భగవంతుని చేత నడపబడుతున్నట్టు ఉన్నాయా, లేక తన స్వంత అహంతో నడపబడుతున్నట్టు ఉన్నాయా అని విచక్షణతో తెలుసుకోండి. ఆత్మసాక్షాత్కారం పొందని గురువుకు ఎంత పెద్ద శిష్యబృందం ఉన్నా అతడు మీకు దైవ సామ్రాజ్యాన్ని చూపలేరు.’’ అని చెప్పేవారాయన. శతాబ్దాలుగా హిమాలయాల్లో జీవించి ఉన్న మహావతార బాబాజీ తన గొప్ప శిష్యులలో ఒకరైన లాహిరీ మహాశయులకు 1861లో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన క్రియాయోగంలో దీక్ష ఇచ్చారు. ఆ తరువాత ఆయన శిష్యులైన యుక్తేశ్వర్ గిరి వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలను స్థాపించి ఈ మార్గంలోకి వేలాదిమందిని తీసుకువచ్చిన పరమహంస యోగానందకి శిక్షణనిచ్చి ఆయనను సిద్ధం చేసే బాధ్యత స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా జీవితాల్ని మార్చగల ఉజ్జ్వల ఆధ్యాత్మిక కావ్యంగా ప్రఖ్యాతి పొందిన తన ‘ఒక యోగి ఆత్మకథ’లో గురుశిష్య సంబంధాన్ని గురించి యోగానంద అత్యంత విశదంగా వివరించారు. ఎంతో జాగ్రత్తతోనూ సూక్ష్మదృష్టితో శ్రీ యుక్తేశ్వర్ యోగానందకి ఇచ్చిన శిక్షణతో యోగానంద భగవంతుడితోనూ గురువుతోనూ అనుసంధానంలో ఉండడం ఎలాగో చూపించిన ఒక నిజమైన దృష్టాంతంగా రూపుదిద్దుకొన్నారు. ఇక యోగానంద తన వంతుగా యోగధ్యానం, సమతుల జీవనాన్ని బోధించే తన సార్వత్రిక బోధల ద్వారా తన జీవిత కాలంలో వేలకొద్దీ శిష్యులకు, అనంతరం లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకునిగా, తత్వవేత్తగా తోడ్పాటు నందించారు. పతంజలి బోధించిన అష్టాంగయోగ మార్గంపై ఆధారపడిన తన ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని విశ్వాసంతో, స్థిరంగా అభ్యసించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు యోగానంద. ప్రతి వ్యక్తీ ఒక ఆత్మ అనీ అంతర్గతంగా అది పరమాత్మ తో తన ఏకత్వాన్ని పునఃస్థాపించుకోవడానికి తపిస్తుంటుందనీ బోధించారు. సత్యాన్వేషకులందరూ లోతుగా అర్థం చేసుకోవడం కోసం... ఆయన రచించిన జీవించడం ఎలాగో నేర్పే గహాధ్యయన పాఠాలు ఆయన బోధలకు ఆనవాళ్లు. భారతదేశపు గొప్ప గురువులకు మనం అందించగల అత్యంత గొప్ప నివాళి గురుపూర్ణిమ. గురువు ఆదర్శాలకు ఈ ముఖ్యమైన రోజున పునరంకితం కావడం ద్వారా చిత్తశుద్ధి గల శిష్యుడు ఆత్మసాక్షాత్కార నిచ్చెనపై తరువాతి మెట్టును ఎక్కుతాడు. (నేడు గురుపూర్ణిమ) -
ఆషాడ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ సందేశం
-
రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.#GuruPurnima2021 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 -
వ్యాస పూర్ణిమ: వేదవ్యాసుడి జీవిత కథ
వేదవ్యాసుడి జీవిత కథ ఆద్యంతం అద్భుతం. వ్యాసుడు వసిష్ఠుడికి ముని మనమడు. శక్తి మహర్షికి పౌత్రుడు. పరాశరుడి పుత్రుడు. తపో నిధి అయిన పరాశరుడు యమున దాటడానికి పడవ ఎక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దాశ పుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్య గంధిని మోహించడమేమిటి? తన తపశ్శక్తి ద్వారా ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించటమేమిటీ? ఆ యమునా నదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుడిని ప్రసాదిం చటమేమిటి? అప్పటికప్పుడే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టు కురావడమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్లిపోవట మేమిటి? ఇదంతా లోక కల్యాణం కోసం లోకాతీతుడిని అవతరింపజే సేందుకు లోకేశ్వరుడు ప్రదర్శించిన విచిత్ర విలాసం. ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మాన వాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, చక్కబరచి, అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్ని ఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి ఘోషించిన సకల లోక హితైషి సాత్యవతేయుడు. అర్థ కామ సాధనల విషయాలను విస్త రించి, అనేక నీతి కథల భాండాగారాలైన అష్టాదశ పురాణాల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆప్తుడు వ్యాసుడు. బాదరాయణ బ్రహ్మ సూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులం దరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థానికి బంగారు బాట పరచిన వాడూ పరాశరుడే. ఇంతటి మహోపకారి అయిన ఈ జ్ఞాన చంద్రుడు ఉదయించిన ఆషాఢ పూర్ణిమ శుభతిథిని ఆసేతు శీతాచలమూ గురు పూర్ణిమ పర్వదినంగా జరుపుకోవటం సర్వవిధాలా సముచితమైన సంప్రదాయం. ఆ సందర్భంగా ప్రత్యేకంగా అస్మాదాచార్య పర్యంతమైన గురుపరంపరను సాదరంగా సంస్మరించుకొని, యథాశక్తి కృత జ్ఞతను ప్రకటించుకోవటం మన కనీసపు కర్తవ్యం. – ఎం. మారుతి శాస్త్రి -
Guru Purnima: ఆదియోగి తనను ఆదిగురువుగా మార్చుకున్నారు
గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరం లాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేశారు. అనంతరం నిశ్చలుడయ్యాడు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయన్ని చూసినవారు అనుకున్నారు. తమతో సంభాషిస్తాడేమో అని శివుడి కోసం జనాలు ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని అక్కడ జనాలు ఉన్నారన్న స్పృహ శివుడికి లేదు. దీంతో కొంతకాలం ఎదురు చూసి అంతా వెళ్లిపోయారు. కేవలం ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. చివరకు “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు. శివుడి సూచనలకు తగ్గట్టు వారు యోగ్యత పొందేందుకు సిద్ధమయ్యారు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సంసిద్ధమవుతూనే ఉన్నారు. 84 ఏళ్ల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో ఆదియోగి ఈ ఏడుగురిని చూశారు. 84 ఏళ్లుగా సాధన చేస్తున్న వారిని శివుడు పట్టించుకోకుండా ఉండలేకపోయారు. 28 రోజుల పాటు వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్రం వారికి చెప్పడం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. మన మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు .... మనకు గురువు లభిస్తారు. ఉత్తమమైన గురువు కోసం వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. మనలో తీవ్రమైన తపన ఉంటే గురువు తనంతట తానుగా సంభవిస్తాడు, -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు
-
గురుభ్యోనమః
సాక్షి, ఒంగోలు : గురుర్బహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః /గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అని వేదాల్లో గురువు ప్రాముఖ్యతను వివరించారు. గురు పూజకు శ్రేష్ఠమైన గురు పౌర్ణమిని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు విశేషంగా జరుపుకొంటారు. ఆషాడ శుద్ధ పౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇదే రోజు వ్యాస మహాముని జన్మ తిథి కనుక మహా పర్వదినంగా భావించి గురు పౌర్ణమి వేడుక నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సాధారణ పండుగలకు గురుపౌర్ణమి భిన్నమైనది, గురు సమానులైనవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం ఇందులోని ప్రత్యేకత. ఈ రోజును ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిర్వహించుకుంటూ తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకుంటారు. అన్ని స్థానాల్లో గురుస్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుంచి జ్ఞానమనే వెలుగుల వైపు నడిపించే శక్తి కలిగినవారు గురువులు. అటువంటి గురువులను పూజించడం మన సంప్రదాయం. ఏటా హిందువులు ఆషాడ పౌర్ణమి నాడు వేదవ్యాసుని జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకొంటున్నారు. అదేవిధంగా సాయిబాబా కూడా తాను జీవితమంతా గురు సేవ చేసిన సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా పాటించాలని షిర్డీలో భక్తులకు ఆదేశించినట్టు ప్రతీతి. గురు పౌర్ణమినాడు సాయిబాబాకు కూడా ప్రత్యేక హారతులు సమర్పిస్తారు. భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగమైనది వేదవ్యాసుని మహా భారతం. అదేవిధంగా 108 ఉప పురాణాలు రచించినది కూడా వేద వ్యాసుడే. గురు పౌర్ణమినాడు సాయిబాబా ఆలయాల్లో స్వామివారికి ఇచ్చే హారతులను దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కొందరు భక్తులు సాయిబాబా ఆలయాల్లోని దత్తాత్రేయ స్వామివారికి శనగలను దారానికి గుచ్చి మాలలా అలంకరించి పూజలు చేస్తారు. మరికొన్ని ఆలయాల్లో దక్షిణామూర్తి చిత్రపటం వద్ద తెల్లని పుష్పాలు ఉంచి పూజలు చేస్తారు. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. వివాహం కాని వారు గురు పౌర్ణమి రోజున కోకిలా వ్రతం ఆచరిస్తారు. బియ్యం పిండిలో నీళ్లు కలిపి కోకిల బొమ్మ చేసి పూజిస్తారు. బెల్లం ప్రసాదంగా ఉంచుతారు. గురుపౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే శివ శయనోత్సవం. అంటే శివుడు ధ్యానంలోకి వెళ్తాడు. శివుడు ధ్యానంలో ఉన్న చిత్రపటం వద్ద తెల్ల పుష్పాలు ఉంచి పూజిచడం ద్వారా ఆర్థిక బాధలు తొలగిపోతాయని, శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా గురు పౌర్ణమి నాడు వ్యాసమహర్షి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి, శివుడిని పూచించడం ప్రత్యేక విశిష్టత. అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రాధాన్యం గురువుకు ఉంది. సాయిబాబా సద్గురువు. మనిషి ఎలా జీవించాలో.. సమత, మమత, మానవతను ఏ విధంగా ఆచరించాలో చేసి చూపారు. బాబా బోధనలు వికాసాన్ని, ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను కలిగిస్తాయి. అందువల్లే సాయిబాబా ఆలయంలో ఈ రోజు వేకువ నుంచే ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవలు, హారతులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సాయి ఆలయంలో కొలువై ఉన్న దత్తాత్రేయునికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాల్లో అన్నదానాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. నేడు శింగరకొండ గిరి ప్రదక్షిణ అద్దంకి: ఆషాడ శుద్ధ పూర్ణిమ సందర్భంగా శింగరకొండ గిరి ప్రదక్షిణ(కొండ చుట్టూ), కొండ పైన ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి, మెట్లోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. రమ్య ఫౌండేషన్ సహకారంతో లక్ష్మీ నరసింహ స్వామి మెట్ల వద్ద నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, 99 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాల మీదుగా, గోపాలపురం, భవనాశి రిజర్వాయర్ కట్టమీదుగా తిరిగి మెట్ట వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుందని చెప్పారు. కోలాటం, భజన కార్యక్రమాలతోపాటు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీతోపాటు దేశంలోని అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయాలను సుందరంగా అలంకరించారు. సాయినామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిర్డీలో సోమవారం గురుపౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్కడ మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బాబా సమాధి ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రకరకాల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయంతోపాటు షిర్డీ పుర వీధులన్ని భక్తులతో పులకించిపోతున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు
-
నేడు గురుపౌర్ణమి
-
గిరి ప్రదక్షణతో సందడిగా సింహగిరి పుణ్యక్షేత్రం
-
గురుపూర్ణిమ
గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. ప్రాచీన గురుకుల సంప్రదాయం శతాబ్దాల తరబడి కొనసాగింది. మన పురాణాల ప్రకారం పరమ శివుడిని ఆదిగురువుగా పరిగణిస్తారు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా ఆరాధిస్తారు. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పరమ శివుడు ఆదిగురువుగా ఆవిర్భవించినందున ఈ రోజును గురుపూర్ణిమగా పాటించడం యోగ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. జూలై 27న గురుపూర్ణిమ సందర్భంగా... యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా కూడా పరిగణిస్తారు. గురుపూర్ణిమ రోజుకు మరికొన్ని పౌరాణిక విశిష్టతలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి వ్యాస మహర్షి ఇదే రోజున జన్మించినందున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. అపౌరుషేయాలైన వేద శ్లోకాలను సేకరించి, వాటిని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు. అందుకే వ్యాసుడికి వేదవ్యాసుడనే పేరు వచ్చింది. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పర్వదినంగా పాటిస్తారు. గురుశిష్య పరంపర గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు శిష్యులకు వేద విద్యను మౌఖికంగా చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక, యోగ విద్యలు మాత్రమే కాకుండా ఆనాటి గురువులు అస్త్ర శస్త్ర విద్యలు, ఆయుర్వేద, గణిత జ్యోతిష వాస్తు శాస్త్రాలు, శిల్పం, సంగీతం వంటి లౌకిక విద్యలను కూడా నేర్పేవారు. గురువుల ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో రాజు పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన పిల్లలకూ ఒకే రీతిలో విద్యలు నేర్పించేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురుకులాల నిర్వహణ కోసం కావలసిన వనరులను రాజులు సమకూర్చేవారు. విద్యాభ్యాసానికి తగిన వయసు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్చేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు వారు గురుకులాల్లోనే నివాసం ఉండేవారు. శిష్యుల యోగక్షేమాలను గురువులే చూసుకునేవారు. గురువులకు శుశ్రూషలు చేస్తూ శిష్యులు విద్యలను నేర్చకునేవారు. యోగ వంటి ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే వారైతే గురువును అవతారమూర్తిగా ఆరాధించేవారు. ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే శిష్యులు మోక్షమే లక్ష్యంగా గురువుల వద్ద ఉంటూ యోగ సాధన కొనసాగించేవారు. లౌకిక విద్యలు నేర్చుకునే శిష్యులు తమ తమ విద్యల్లో తగిన ప్రావీణ్యం సాధించిన తర్వాత గురువులు వారిని ఆశీర్వదించి సమాజంలోకి పంపేవారు. వారు వివిధ వృత్తుల్లో స్థిరపడేవారు. హిందూ మతంలోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాల్లోను, బౌద్ధ, జైన మతాల్లోని వివిధ శాఖల్లోనూ గురుశిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉంది. గురుశిష్యుల అనుబంధానికి సంబంధించిన పలు గాథలు మన పురాణాల్లోను, ఆధ్యాత్మిక గురువుల చరిత్రల్లోనూ కనిపిస్తాయి. గురువు ఎలా ఉండాలంటే..? అద్వైత ఆచార్యుడు ఆదిశంకరాచార్యులు గురువు విశిష్టతను తన ‘ఉపదేశ సాహస్రి’లో వివరించారు. జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడని ఆయన అభివర్ణించారు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాకుండా, వారి నియమ నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలని, వారికి రాగద్వేషాలను అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలని, అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో ముందుకు నడిపించడం గురువు బాధ్యత అని విశదీకరించారు. వేద వేదాంతాల్లో నిపుణుడు, జ్ఞానసంపన్నుడు, ఈర్షా్యద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి మాత్రమే గురువు కాగలడని, అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న గురువు మాత్రమే తన శిష్యులలో అంధకార తిమిరాన్ని పారద్రోలి వారిని జ్ఞానమార్గంలో ముందుకు నడిపించగలడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తత్వం ఎరిగిన వాడు, ధర్మాన్ని బోధించేవాడు, దైవత్వంగలవాడు మాత్రమే గురువు కాగలడని జైనమతం చెబుతోంది. గురువు మాత్రమే కైవల్యప్రాప్తిని కలిగించగలడని జైనుల విశ్వాసం. దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానమార్గానికి ఆలంబన గురువు అని సిక్కులు విశ్వసిస్తారు. గురువే ‘ధమ్మం’, గురువే ‘సంఘం’ అని బౌద్ధులు నమ్ముతారు. బుద్ధత్వాన్ని పొందిన గురువును అత్యుత్తమ గురువుగా వారు పరిగణిస్తారు. దత్త సంప్రదాయంలో గురుపూజ దత్త సంప్రదాయంలో గురుపూజకు చాలా విశిష్టత ఉంది. అత్రి అనసూయల తనయుడు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీదత్తాత్రేయుడిని గురుదత్తునిగా కొలుస్తారు. దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణించే శ్రీపాద శ్రీవల్లభుని, శ్రీ నృసింహ సరస్వతి స్వామిని, శ్రీ షిరిడీ సాయిబాబాను గురుపూర్ణిమ రోజున ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. దత్త క్షేత్రాలలోను, దత్త పీఠాల్లోను, షిరిడీలోని ప్రధాన ఆలయం సహా దేశవ్యాప్తంగా గల సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. దత్త భక్తులు, షిరిడీ సాయి భక్తులు ఈ రోజుల్లో గురు చరిత్ర, గురుగీత పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ తమ గురువులకు ఇతోధికంగా దక్షిణలు సమర్పించి, సత్కారాలు చేస్తారు. గురుపూర్ణిమ నాడు గురుపూజ వల్ల జ్ఞాన వృద్ధి, మోక్ష సిద్ధి కలుగుతాయని నమ్ముతారు. చరిత్రలో మన ఆధ్యాత్మిక గురువులు భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక గురువులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు తమ తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రబోధించి, భిన్న మతాలను స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని క్రీస్తుపూర్వమే స్థాపించారు. ఇవి విదేశాలకూ వ్యాపించాయి. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు. ఆదిశంకరులు జీవించిన కాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆ స్వల్పకాలంలోనే ఆయన ఆధ్యాత్మిక రంగంలో అసాధారణమైన పురోగతిని తీసుకొచ్చారు. వివేకచూడామణి, సౌందర్యలహరి వంటి గొప్ప రచనలు చేశారు. బ్రహ్మసూత్రాలపైన, భగవద్గీతపైన వ్యాఖ్యానాలు రాశారు. రామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపారు. దళితులకు ఆలయ ప్రవేశం వంటి సంస్కరణలకు తెరలేపిన తొలి ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన. ద్వైత మార్గాన్ని బోధించిన మధ్వాచార్యులు ఆదిశంకరులు, రామానుజులు చేసిన రచనలపై విమర్శనాత్మక విశ్లేషణలు చేశారు. గురు రాఘవేంద్రులు మధ్వ మార్గానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. నింబకారాచార్యులు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ గురువు, కృష్ణభక్తుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభువు భక్తి మార్గానికి ప్రాచుర్యం కల్పించారు. ఆధునిక యుగంలో మన గురువులు ఆధునిక యుగంలో కూడా పలువురు గురువులు యోగ, ఆధ్యాత్మిక మార్గాల్లో తమ తమ శిష్యులకు వెలుగు బాట చూపారు. బెంగాల్లో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని, అయితే ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. రామకృష్ణ పరమహంస వద్ద ఆధ్యాత్మిక విద్య పొందిన స్వామీ వివేకానంద పాశ్చాత్య ప్రపంచంలో సైతం భారతీయ ఆధ్యాత్మిక తత్వజ్ఞానానికి ప్రాచుర్యం కల్పించారు. స్వామీ వివేకానంద ఆధ్వర్యంలో రామకృష్ణ భక్తి ఉద్యమం దేశ విదేశాలకు విస్తరించింది. మహావతార్ బాబా పరంపరకు చెందిన పరమహంస యోగానంద సైతం భారతీయ యోగ ఆధ్యాత్మిక విద్యలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పించారు. లాహిరి మహాశయుని శిష్యుడైన యుక్తేశ్వర గిరి వద్ద పరమహంస యోగానంద యోగ విద్యాభ్యాసం చేశారు. తమిళనాడుకు చెందిన స్వామీ శివానంద కొంత కాలం దేశ విదేశాల్లో వైద్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. దివ్యజీవన సంఘాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జ్ఞానానికి బోధించారు. స్వామీ శివానంద శిష్యుడైన స్వామీ కృష్ణానంద దివ్యజీవన సంఘం ద్వారా తన గురువు బోధనలకు మరింత ప్రాచుర్యం కల్పించారు. స్వామీ రామతీర్థ కొంతకాలం గణిత ఆచార్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. ప్రాక్ పశ్చిమ దేశాల్లో విస్తృతంగా పర్యటించి భారతీయ వైదిక జ్ఞానాన్ని, తత్వాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ కుటుంబానికి చెందిన స్వామీ ప్రభుపాద ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఉద్యమాన్ని దేశ విదేశాలకు విస్తరించారు. ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించిన భాగవతం విదేశాల్లో పాఠకాదరణ పొందింది. అరుణాచల స్వామిగా పేరుపొందిన రమణ మహర్షి భక్తిమార్గాన్ని బోధించారు. ఇలాంటి ఎందరో గురువులు భారతీయ వైదిక తత్వానికి, భక్తి మార్గానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. గురువు ప్రాముఖ్యత మన సనాతన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గురువును త్రిమూర్తి స్వరూపంగా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించి, పూజించడం మన సంప్రదాయం. గురువు రూపమే ధ్యానానికి మూలమని, గురు పాదాలే పూజకు మూలమని, గురు వాక్యమే మంత్రానికి మూలమని, గురు అనుగ్రహమే మోక్షానికి మూలమని ‘గురు గీత’ చెబుతోంది. విశాల విశ్వమే గురుస్వరూపమని సనాతన గురువులు చెప్పిన మాట. గురువులకే గురువుగా పరిగణించే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు ప్రకృతి శక్తులనే గురువులుగా తలచి లోకానికి భక్తి జ్ఞానమార్గాన్ని బోధించాడు. గురు పూర్ణిమ రోజున వ్యాసుని మొదలుకొని గురు పరంపరను స్మరించుకుని పూజించడం ఆచారంగా వస్తోంది. మన దేశంలోని దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలలో గురుపూజ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లోనైతే దేవాలయాలే కాకుండా విద్యాసంస్థల్లో కూడా గురుపూర్ణిమ వేడుకలు జరుగుతాయి. గురుపూర్ణిమ నాడు విద్యార్థులందరూ గురువులను సంప్రదాయబద్ధంగా టోపీలతో అలంకరించి, కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు అందుకుంటారు. పురాణాల్లో ప్రసిద్ధ గురువులు మన పురాణాల్లో ప్రసిద్ధులైన గురువులు చాలామందే ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి సకల శాస్త్ర కోవిదుడుగా పురాణాల్లో కనిపిస్తాడు. పలు ధర్మశాస్త్రాలు బృహస్పతి పేరుతో ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి ప్రస్తావన రుగ్వేదం మొదలుకొని అనేక పురాణాల్లో కనిపిస్తుంది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా బృహస్పతికి దీటైన శాస్త్ర కోవిదుడు. శుక్రాచార్యుడు చెప్పిన నీతి సూత్రాలు ‘శుక్రనీతి’గా ప్రసిద్ధి పొందాయి. మరణించిన వారిని తిరిగి బతికించగల మృతసంజీవని విద్యకు శుక్రాచార్యుడే ఆద్యుడని, దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన విద్యతోనే తిరిగి బతికించేవాడని పురాణాలు చెబుతాయి. రామ లక్ష్మణులకు గురువైన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి చాటాడు. వశిష్టుడితో స్పర్థపూని అనేక కష్టనష్టాలను, అగ్నిపరీక్షలను ఎదుర్కొని మరీ బ్రహ్మర్షి పదవిని సాధించాడు. తాను బొందితో స్వర్గానికి పంపిన త్రిశంకుడిని దేవతలు కిందకు తోసేస్తే, అతడి కోసం దేవతల స్వర్గాన్ని తలదన్నే త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాడు. సప్తర్షులలో ప్రసిద్ధుడైన వశిష్టుడు రఘు వంశానికి కులగురువు. బాల్యంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్టుడి వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు జన్మించారు. ఆయనే వారికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు సకల శాస్త్రాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలనూ నేర్పించారు. కురువృద్ధుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. జగద్గురువుగా పూజలు పొందే శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురువులకే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన గౌరవార్థమే గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా పరిగణిస్తారు. గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం ఈసారి గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది సుదీర్ఘ చంద్రగ్రహణం. యోగ సాధకులు, మంత్రవేత్తలు గ్రహణాలు చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు. పర్వదినాల్లో గ్రహణాలు వచ్చినట్లయితే, అవి మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. గ్రహణ సమయంలో చేసే మంత్రజపం అనంత ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మంత్రోపదేశం పొందిన వారు గ్రహణకాలం ప్రారంభానికి ముందు స్నానం ఆచరించి, ఎలాంటి ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే వరకు మంత్రజపం, ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం లేని వారు నవ గ్రహశ్లోకాలలోని చంద్ర శ్లోకాన్ని ఈ సమయంలో పఠించుకోవచ్చు. గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానం ఆచరించి, ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు సంప్రోక్షణ జరిపి ఆ తర్వాతే నిత్యపూజ చేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత యథాశక్తి దానాలు చేస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గ్రహణ సందర్భంగా బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, కర్పూరం, చందనం, శంఖం, వెండి వస్తువులు, తెల్లని పువ్వులు, ముత్యాలు, తెల్లని వస్త్రాలు శక్తిమేరకు దానం చేస్తే దోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గురుపూర్ణిమ గురించి కొన్ని విశేషాలు గురు పూర్ణిమ రోజునే వర్ధమాన మహావీరుడు గౌతమస్వామిని తన తొలి శిష్యునిగా స్వీకరించాడు. ఇదే రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్‌లో తన శిష్యులను ఉద్దేశించి తొలి బోధ చేశాడు. ఆదిగురువు అయిన పరమశివుడు ఇదే రోజున సప్తర్షులకు యోగ రహస్యాలను బోధించాడు. వేదవ్యాసుడు తన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ రోజునే బ్రహ్మసూత్రాల రచన ప్రారంభించాడు గురుపూర్ణిమ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమంలోని గురువులు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాటి నుంచి నాలుగు నెలల పాటు బస చేసిన చోటే ఉంటూ శిష్యులకు బోధన చేస్తారు. ఆధ్యాత్మిక సాధన ప్రారంభించదలచిన వారు గురుపూర్ణిమ రోజున గురువుల సమక్షంలో సాధన ప్రారంభించడాన్ని శ్రేష్టంగా భావిస్తారు. -
షిర్డీసాయికి రికార్డు స్థాయి ఆదాయం
షిర్డి: షిరిడీ సాయి ఆలయానికి కానుకల రూపంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గురు పౌర్ణిమ సందర్బంగా భక్తులు కానుకల రూపంలో రూ. 5.52 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత ఏడాది గురు పౌర్ణిమ వేడుకలకు వచ్చిన ఆదాయం రూ.1.40 కోట్ల మాత్రమేనని వివరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు రూ.2.94 కోట్లు నగదు రూపంలో వచ్చినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో) రూబల్ అగర్వాల్ తెలిపారు. విరాళాల ద్వారా రూ. 1.40 కోట్లు, ఆన్‌లైన్‌ద్వారా రూ.52.48 లక్షలు సమకూరాయని వివరించారు. దీంతో పాటు రూ. 61.4 లక్షల విలువైన 2.233 గ్రాముల బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా అందజేశారని తెలిపారు. మలేషియా, అమెరికా, లండన్, జపాన్, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చిన భక్తులు రూ. 9.30 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కానుకగా సమర్పించారని అన్నారు. గురుపౌర్ణిమ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు షిర్డీకి వచ్చారని ఆయన తెలిపారు. -
మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్
జంషెడ్పూర్: జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అంటూ పలువురు పెదవి విరిచేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎందుకు కాళ్లు కడిగించుకున్నారని అనుకుంటున్నారా.. గురుపూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దాస్‌ను ఆహ్వానించారు. అయితే, సాధారణంగా పూలమాల వేసో లేక ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చో స్వాగతం పలకడం చేస్తారు. కానీ, ఎప్పుడైతే ఆయన వచ్చారో ఓ ఇద్దరు మహిళలు ఆయనకు ఎదురెళ్లారు. కింద పెద్ద తాంబాళంలాంటిదాన్ని పెట్టారు. ఆ తర్వాత ఆయన తన పంచెను పైకెత్తి పట్టుకోగా కాళ్లపై గులాబీ రేకులతో నింపి ఉన్న నీళ్లు పోస్తూ కడిగేశారు. అనంతరం లేచి నిల్చొని ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి ఇది ఏ మాత్రం తగదని, ఇలాంటి చర్యలు తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రంజీత్ రంజన్ స్పందిస్తూ ఇలాంటి స్వాగతం ఆయనకు పలకాలని అనుకున్నప్పుడు అది మహిళలతోనే ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీశారు. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు. -
గురుపౌర్ణమి గురించి మాట్లాడిన నాసా
న్యూఢిల్లీ: 'గురు పౌర్ణమి' వేడుకలను భారత్‌లో ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినాడు ఈ వేడుకలు నిర్వహిస్తారు. గురుపౌర్ణమి గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చలోకి ఓ అరుదైన అతిథి 'నాసా' వచ్చి చేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మనం జరుపుకునే గురుపౌర్ణమి గురించి తన ట్వీటర్ ఖాతాలో పేర్కొంది. నిండు చంద్రుడిని పలు ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో వివరించింది నాసా. అందులో 'గురు పౌర్ణమి', 'హే మూన్', 'మీడ్ మూన్', 'రైప్ కార్న్ మూన్', 'బక్ మూన్', 'థండర్ మూన్' అనే పేర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో పున్నమి చంద్రుడిని పిలుచుకునే పేర్లతో పాటు గురు పౌర్ణమి నాడు తీసిన ఓ అద్భుతమైన చంద్రుని ఫొటోని ట్వీటర్లో షేర్ చేసింది నాసా. దీంతో భారత్‌లో జరుపుకునే గురు పౌర్ణమిని గుర్తించినందుకు పలువురు భారతీయులు నాసాకు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.