యూపీలోని అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడి సరయూ నదీతీరంలో భక్తివిశ్వాసాలు పెల్లుబికాయి. నేటి (ఆదివారం) ఉదయం నుంచి భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి, శ్రీరాములవారిని దర్శనం చేసుకుంటున్నారు.
గురు పూర్ణిమ సందర్భంగా రామనగరికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సరయూలో భక్తుల స్నానాలు మొదలయ్యాయి. శ్రీ రాముడు తన గురువైన వశిష్ణుడిని ఆరాధించాడని చెబుతారు. ఈరోజు రామాలయంలో రోజంతా గురు పూర్ణిమవేడుకలు జరగనున్నాయి.
Uttar Pradesh: On Guru Purnima in Ayodhya, devotees flocked to the Sarayu River for holy dips and rituals. The city buzzed with celebrations, honoring the ancient guru-disciple tradition with extensive security measures in place pic.twitter.com/2jfVkbFhlB
— IANS (@ians_india) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment