
సాక్షి,రఘునాథపాలెం( ఖమ్మం): ఇప్పటి వరకు ఆర్‌ఎంపీ వైద్యుడే దిక్కు... చిన్నాపెద్ద అనారోగ్యం ఏదైనా ఖమ్మం లేదంటే మంచుకొండ ప్రాథమిక వైద్యశాలకు వెళ్లాల్సిందే. అయితే, ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పల్లె దవాఖానా ద్వారా గ్రామానికి వైద్యురాలిని కేటాయించడంతో రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గ్రామంలోని ఆరోగ్య సబ్‌సెంటర్‌లో మంగళవారం డాక్టర్ కె.హారిక బాధ్యతలు స్వీకరించగా ప్రజాప్రతినిధులతో పాటు ఊరంతా ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మెంటంరామారావు, ఎంపీటీసీ సభ్యురాలు మాలోత్ లక్ష్మి, మాజీ సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామంలోనే వైద్యురాలు ఉండనుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు, గ్రామ పెద్దలు సీతారామయ్య, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
చదవండి: హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే
Comments
Please login to add a commentAdd a comment