వైభవంగా సాయినాథుడి నగరోత్సవం
నెల్లూరు(బందావనం) : గురుపూర్ణిమ మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సమీపంలోని శ్రీషిర్డీసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సాయినాథుడి నగరోత్సవ వైభవంగా జరిగింది. విశేషపుష్పాలంకరణలో, సర్వాలంకారశోభితంగా కొలువుదీరిన స్వామివారిని మంగళవాయిద్యాలతో, భజనలు, కోలాటాలు, వివిధ సాంస్కతిక ప్రదర్శనలు, బాణసంచావేడుకల నడుమ నగరోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గాంధీబొమ్మ మీదుగా ట్రంకురోడ్డు, ఏసీ సెంటర్, సంతపేట నాలుగుకాళ్ల మండపం,చిన్నబజార్, పెద్దబజార్, బారకాసు, వీఆర్ కళాశాల సెంటర్, కో–ఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ మీదుగా సాగింది. మందిరం కార్యవర్గసభ్యులు మన్నెం అమరనాథ్‌రెడ్డి, పైడిపాటి సుధాకర్‌రావు, కొల్లి శ్యాంసుందర్‌రెడ్డి, దువ్వూరి జయమ్మ, బి.మోహన్‌రావు పర్యవేక్షించారు. కాగా ఉదయం సాయినాథుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అష్టోత్తర సహస్రనామ, విశేషపూజలు, హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని సభ్యులు తెలిపారు.