షిర్డి: షిరిడీ సాయి ఆలయానికి కానుకల రూపంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గురు పౌర్ణిమ సందర్బంగా భక్తులు కానుకల రూపంలో రూ. 5.52 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత ఏడాది గురు పౌర్ణిమ వేడుకలకు వచ్చిన ఆదాయం రూ.1.40 కోట్ల మాత్రమేనని వివరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు రూ.2.94 కోట్లు నగదు రూపంలో వచ్చినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో) రూబల్ అగర్వాల్ తెలిపారు. విరాళాల ద్వారా రూ. 1.40 కోట్లు, ఆన్‌లైన్‌ద్వారా రూ.52.48 లక్షలు సమకూరాయని వివరించారు.
దీంతో పాటు రూ. 61.4 లక్షల విలువైన 2.233 గ్రాముల బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా అందజేశారని తెలిపారు. మలేషియా, అమెరికా, లండన్, జపాన్, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చిన భక్తులు రూ. 9.30 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కానుకగా సమర్పించారని అన్నారు. గురుపౌర్ణిమ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు షిర్డీకి వచ్చారని ఆయన తెలిపారు.
షిర్డీసాయికి రికార్డు స్థాయి ఆదాయం
Published Wed, Jul 12 2017 4:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
Advertisement
Advertisement