రాంచి: అస్సాం, బిహార్ తర్వాత జీఎస్టీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాం ముందుగా జిఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేయేతర పార్టీల పాలిత రాష్ట్రంగా బిహార్ నిలిచింది. బిహార్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో మంగళవారం దీన్ని ఆమోదించారు. కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు.
జీఎస్టీ బిల్లుకు జార్ఖండ్ ఆమోదం
Published Wed, Aug 17 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement