దారుణం.. బాలికపై పోలీసులే.. | Jamshedpur Girl Alleges Raped By Cops CM Ordered A CID probe  | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 10:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

Jamshedpur Girl Alleges Raped By Cops CM Ordered A CID probe  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగట్టారు. ఓ మైనర్‌ బాలిక తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారిలో ఇద్దరు పోలీసులున్నారి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం సీఎం సిద్దిబాత్‌ కార్యక్రమానికి వచ్చిన బాలిక సీఎంతో తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు.

ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. జంషెడ్‌పూర్‌కు చెందిన ఆ బాలిక ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ బర్తార్యా స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement