ratify
-
జీఎస్టీ బిల్లుకు జార్ఖండ్ ఆమోదం
రాంచి: అస్సాం, బిహార్ తర్వాత జీఎస్టీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాం ముందుగా జిఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేయేతర పార్టీల పాలిత రాష్ట్రంగా బిహార్ నిలిచింది. బిహార్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో మంగళవారం దీన్ని ఆమోదించారు. కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు. -
జీఎస్టీపై టీ.అసెంబ్లీ సమావేశం
హైదరాబాద్: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ త్వరలో సమావేశం కానుంది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ సెషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీటీఐకి చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని తెలిపారు. ఈ సమావేశం సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చి అత్యవసరంగా బిల్లును ఆమోదానికి పెట్టాలని నిర్ణయించిందనీ రాజేందర్ చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు బిల్లుకు మద్దతిచ్చారనీ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్ బహిరంగ సభలో బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాగా ఆగస్టు 8న పార్లమెంటు ఆమోదం లభించిన జీఎస్ టీ బిల్లును బీహార్ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. దీంతో ఈబిల్లును ఆమోదించిన తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా బీహార్ అవతరించిన సంగతి తెలిసిందే.