జీఎస్టీపై టీ.అసెంబ్లీ సమావేశం
హైదరాబాద్: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ త్వరలో సమావేశం కానుంది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ సెషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీటీఐకి చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని తెలిపారు. ఈ సమావేశం సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చి అత్యవసరంగా బిల్లును ఆమోదానికి పెట్టాలని నిర్ణయించిందనీ రాజేందర్ చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు బిల్లుకు మద్దతిచ్చారనీ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్ బహిరంగ సభలో బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాగా ఆగస్టు 8న పార్లమెంటు ఆమోదం లభించిన జీఎస్ టీ బిల్లును బీహార్ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. దీంతో ఈబిల్లును ఆమోదించిన తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా బీహార్ అవతరించిన సంగతి తెలిసిందే.