భువనేశ్వర్: ఒడిశా రాజ్‌భవన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు రాజ్‌భవన్‌లోకి ఓ అధికారిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదురు అధికారి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుడి భార్య సయోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకుంత్ ప్రధాన్(47) ఒడిశా రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, డొమెస్టిక్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కాగా, బైకుంత్ ప్రధాన్ ఏడో తేదీన గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్‌ను పూరీ రైల్వే స్టేషన్ నుంచి రాజ్‌భవన్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సన్నాహకాలు జరుగుతున్నాయి.
#WATCH | Sayoj, wife of Baikuntha Pradhan, who works in Odisha's Raj Bhavan, has accused the Governor's son and others of beating her husband.
She said, "...On the night of June 7, the Governor's son called my husband to his room and beat him badly. He came out to save himself,… pic.twitter.com/PmWmVs3hqh— ANI (@ANI) July 13, 2024
ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ బయటకు వెళ్లిపోవడంతో అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ కారును తీసుకుని బైకుంత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అనంతరం, కారు ఎక్కిన లలిత్.. బైకుంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మారుతీ కారును తీసుకురావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో వారు రాజ్‌భవన్‌కు చేరుకోగానే లలిత్ కుమార్, అతడి స్నేహితులు(ఐదుగురు) బైకుంత్‌పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఇక, ఈ ఘటనపై రాజ్‌భవన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు. సయోజ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పూరీ పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment