జార్ఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: గోహత్యలపై వివాదం నెలకొన్న ఈ తరుణంలో జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని స్వదేశంగా భావించే వారు గోవును తల్లిలా పూజించాలన్నారు. ఇటీవల జరుగుతున్న ఉదంతాల్లో పశువుల అక్రమ రవాణాదారుల హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గోవధ, సంఖ్యపై కొంచెం సంఘ్ పరివార్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గోరక్షణపై మాత్రం ఏకాభిప్రాయం నెలకొందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న అసాంఘిక శక్తులే గోవధలకు పాల్పడుతున్నాయన్నారు. గోవధకు పాల్పడే వారే గో సంరక్షకుల్లా మారువేషం వేసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తమను మోదీ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై దాస్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధాని తెలిపిన వ్యాఖ్యల్లో నిజముందని పేర్కొన్నారు.