
రఘుబర్‌దాస్
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీ ఘోర పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రకటించారు. ఇది కేవలం తన ఓటమి అని, బీజేపీది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫలితాలపై స్పందిస్తూ.. జార్ఖండ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ జార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. గతంలో బీజేపీకి అధికారమిచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్ఖండ్ పీఠం తమదేనని పాలక బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
हम झारखंड की जनता द्वारा दिये गये जनादेश का सम्मान करते हैं।
— Amit Shah (@AmitShah) December 23, 2019
भाजपा को 5 वर्षों तक प्रदेश की सेवा करने का जो मौका दिया था उसके लिए हम जनता का हृदय से आभार व्यक्त करते हैं। भाजपा निरंतर प्रदेश के विकास के लिए कटिबद्ध रहेगी।
सभी कार्यकर्ताओं का उनके अथक परिश्रम के लिए अभिनंदन।