Jharkhand assembly elections
-
జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు. జార్ఖండ్ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు. -
జార్ఖండ్ తొలి దశకు సర్వం సిద్ధం
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ బుధవారమే పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారు.ఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.ఐదవ జార్ఖండ్ శాసనసభ కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలుబుధవారమే 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
కమలదళానికి కొత్త కష్టం!
-
బెడిసికొట్టిన అమిత్ షా అయోధ్య వ్యూహం!
రాంచీ: దేశ వ్యాప్తంగా తమకు తిరుగులేదనుకుంటున్న బీజేపీకి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించిన షాక్ ఇచ్చాయి. అధికార బీజేపీ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొన్న జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశంలో ఒకవైపు ఎన్ఆర్సీ, మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కాషాయ దళానికి ఈ ఫలితాలు మింగుడుపడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా, హోంమంత్రి అమిత్ షా విజయం కోసం శక్తివంచనలేకుండా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మోదీ 12, అమిత్ షా 14 బహిరంగసభల్లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయవాదం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. (జేఎంఎం కూటమి జయకేతనం) పనిచేయని షా పాచికలు.. ఎన్ఆర్సీ, సీఏఏపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని సాక్షాత్తూ ప్రధాని బహిరంగ విమర్శలకు దిగారు. మరో అడుగు ముందుకు వేసిన అమిత్ షా.. అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిర నిర్మాణం నాలుగు నెలల్లో మొదలుకానుందని ప్రకటించారు. కానీ షా పాచికలు పారలేదు. జార్ఖండ్‌లోని పకూర్ ప్రాంతంలో డిసెంబర్ 17న జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మందిర ప్రస్తావన తెచ్చారు. రామ జన్మభూమి అంశం కేసు కోర్టుల్లోనే నలిగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించే ప్రయత్నం చేశారు. గడిచిన మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిరంపై ప్రచారం చేసుకుంటూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ, జార్ఖండ్ ఎన్నికల్లోనూ అదే అస్త్రం ప్రయోగించింది. కానీ మందిర నిర్మాణ అంశం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. స్థానిక సమస్యల పరిష్కారంగా భావించిన ఓటర్లు.. అయోధ్య అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అలాగే మోదీ, షా ప్రచారం చేసిన జాతీయ అంశాలనూ జార్ఖండ్ ప్రజలు ఏమాత్రం దరిచేరనీయలేదు. (సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!) ఫలించిన పవార్ వ్యూహం.. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అనుసరించిన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసిన హేమంత్ సొరెన్ ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. జాతీయ అంశాల జోలికి పోకుండా కేవలం స్థానిక సమస్యలు, గిరిజనుల అభివృద్దే ధ్యేయంగా కాగ్రెస్-జేఎంఎం ప్రచారం సాగింది. అలాగే జార్ఖండ్‌లో గడిచిన ఏడాది కాలంలో జరిగిన 20కి పైగా మూకదాడులు అల్పసంఖ్యాక వర్గాల్లో భయాందోళన రేపాయి. ముస్లింలపై దాడులు భారతీయ జనతా పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ వ్యవహార శైలి కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు బీజేపీ ఓటమికి ఒక కారణంగా నేతలు వర్ణిస్తున్నారు. గిరిజన జనభా ఎక్కువగా గల జార్ఖండ్‌లో ఓబీసీకి చెందిన రఘుబర్ను ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు అంటే వ్యతిరేకత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అధికార బీజేపీకి జార్ఖండ్ ఫలితాలు భారీ ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.(జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం) -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్‌దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్‌దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్‌ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్‌గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్‌కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్‌కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్‌లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్‌దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
27న సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం
-
27న సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం
రాంచీ: జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాలు కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకుడు హేమంత్ సీఎం పదవి చేపట్టనున్నారు. హేమంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు స్పీకర్ పదవితోపాటు నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఆర్పీఎన్ సింగ్ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో రాంచీలో సమావేశమై చర్చలు జరిపారు. -
చేజారిన మరో రాష్ట్రం!
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో బీజేపీ పాలనకు జనం చరమగీతం పాడారు. వేర్వేరు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ సోమవారం అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మహారాష్ట్ర భంగపాటు జరిగి రెణ్నెల్లు తిరక్కుండానే జార్ఖండ్‌లో బీజేపీకి తగిలిన రెండో గాయమిది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటినుంచీ కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని స్థానాల్లోనూ ఈ ధోరణి కనబడింది. చెప్పాలంటే మొదట్లో బీజేపీ ఎంతో కొంత మెరుగైన స్థితి కనబరిచింది. కానీ లెక్కింపు కొనసాగుతున్నకొద్దీ అది క్రమేపీ క్షీణించింది. ఆఖరికి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సైతం తన నియోజకవర్గంలో ఆదినుంచీ వెనకబడివున్నారంటే జనాగ్రహం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇది నూరు శాతం బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. రఘువర్ దాస్ ఓడింది చెప్పుకోదగ్గ నాయకుడిపై కాదు. నిన్న మొన్నటివరకూ తమ పార్టీలో, తన అను చరుడిగావున్న వ్యక్తి చేతుల్లోనే ఆయనకు ఓటమి తప్పలేదు. వాస్తవానికి జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కి చెప్పుకోదగ్గ బలమంటూ లేదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల మాదిరే ఇక్కడ కూడా ఆ పార్టీ నిస్తేజంగా ఉంది. రాహుల్‌గాంధీ అయిదు ప్రచారసభల్లో, ఆయన సోదరి ప్రియాంక ఒక సభలో మాత్రమే మాట్లాడారు. ఇందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెరో తొమ్మిది సభల్లో ప్రసంగించారు. బీజేపీకి చెందిన ఇతర నేతలు సరేసరి. అటు కాంగ్రెస్‌కు పార్టీ శ్రేణుల్ని సమరానికి సమాయత్తం చేయగల సత్తాగానీ, ప్రజల్ని ఒప్పించగల నేర్పరితనంగానీ ఉన్న నాయకుడు లేరు. మహారాష్ట్ర మాదిరి గెలుపు గుర్రంతో చెలిమి చేయడం ఆ పార్టీకి కలిసొచ్చిన ఏకైక ఎత్తుగడ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బీజేపీకి గట్టి సవాలు ఇవ్వగల పార్టీయే అయినా ఆ పార్టీ నాయకుడు హేమంత్ సోరెన్ శరద్ పవార్ స్థాయి నాయకుడు కాదు. ఆయనలా కాంగ్రెస్ నాయకత్వ లేమిని పూడ్చగలిగినవాడు కాదు. రాష్ట్రానికి మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌పై జనంలోవున్న అనుకూలత హేమంత్‌కు కలిసొచ్చింది. అయితే తమ పార్టీకి మొదట్నించీ పునాదిగావున్న ఆదివాసీలనూ, కుర్మీలనూ కూడగట్టుకోవడంలోనే ఆయన అధిక సమయాన్ని వెచ్చించాల్సివచ్చింది. ఎందుకంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)కి కూడా కుర్మీలలో చెప్పుకోదగ్గ పలుకుబడివుంది. జార్ఖండ్ జనాభాలో ఆదివాసీ, కుర్మీలు దాదాపు సగభాగం ఉంటారు. మొదటినుంచీ అంచనాలకు భిన్నమైన ఫలితాలు అందించడం జార్ఖండ్ ప్రత్యేకత. అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు తప్పని రుజువయ్యాయి. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న 14 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు జారవిడుచుకోక తప్పదని ఎన్నికల ముందు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి. కానీ బీజేపీ మాత్రం అంతకుముందు మాదిరే 12 స్థానాలు సాధించగా, ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ(ఏజేఎస్‌యూపీ) ఒక స్థానాన్ని గెల్చు కుంది. బీజేపీ ఓటుబ్యాంకు 40 శాతం య«థాతథంగావుంది. కానీ ఆర్నెల్లు గడిచేసరికల్లా ఆ ఓటు బ్యాంకు గల్లంతయింది. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తొలిసారి వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. 81మంది సభ్యులుగల ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీకి 37 రాగా, ఆ పార్టీ మిత్ర పక్షం ఏజేఎస్యూపీకి 5 లభించాయి. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) 8 స్థానాలు సాధించినా అందులో ఆరుగురు 2015లో బీజేపీ శిబిరంలో చేరారు. అప్పట్లో జేఎంఎంకు 19, కాంగ్రెస్‌కు 6 వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావా ల్సిన కనీస మెజారిటీ 41 కనుక బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వగలిగింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తూ 1973లో ఆవిర్భవించిన జేఎంఎం పోరాటం ఫలితంగా 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో చెలిమి చేసి 8 చోట్ల పోటీచేసి అయిదుచోట్ల గెలుపొందిన ఏజేఎస్‌యూ, ఈసారి తమకు 17 నుంచి 19 కేటాయించాలని డిమాండ్చేసింది. మహారాష్ట్ర, హరి యాణా ఎన్నికల ఫలితాలు రావడం, ఆ రెండుచోట్లా బీజేపీకి ఆదరణ గతంతో పోలిస్తే క్షీణించడం చూశాక ఏజేఎస్‌యూ తన డిమాండ్‌పై మరింత పట్టుబట్టడం మొదలెట్టింది. చివరికది దూరం కావడంతో బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. 24 జిల్లాలున్న జార్ఖండ్‌లో 19చోట్ల మావోయిస్టుల ప్రాబల్యంవుంది. కనుకనే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఆదివాసీ జనాభా అధికంగావున్న జార్ఖండ్‌లో 2014లో తొలిసారి ఆదివాసీయేతరుడైన రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడం బీజేపీ సాహసమే. ఇది చాలదన్నట్టు కౌలు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల్ని, భూసేకరణ విధానాల్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ భూములపై తమకుండే హక్కును ఇవి దెబ్బతీస్తాయని వారు ఆందోళనపడ్డారు. బ్రిటిష్‌వారిపై పోరాడి ప్రాణాలర్పించిన ముండా తెగ ఆదివాసీల స్మృతికి నివాళులర్పించేందుకు లోక్‌సభ ఎన్నికల సమయంలో రఘుబర్‌దాస్ కుంతి ప్రాంతానికెళ్లినప్పుడు ఆదివాసీలు ఆయనపై చెప్పులు విసిరి నిరసన ప్రకటించారు. అయినా అప్పట్లో బీజేపీ అభ్యర్థే గెలిచారు. బీజేపీ విధానాలు తీవ్రంగా దెబ్బ తీస్తాయని ప్రచారం చేయడంలో విపక్షాలు ఈసారి విజయం సాధించాయి. తాము అధికారంలోకొస్తే ఆదివాసీల భూములకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశాయి. అలాగే సీఏఏ, ఎన్నార్సీలు జార్ఖండ్ ముస్లింలపై కూడా ప్రభావం చూపాయి. బీజేపీ తన ప్రచారాన్ని ప్రధానంగా అభివృద్ధిపై కేంద్రీ కరించింది. సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలది దుష్ప్రచారమని కొట్టిపారేసింది. ఎన్నికల ఫలితాలు పార్టీలు స్వీయ సమీక్ష చేసుకోవడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా మరో రాష్ట్రాన్ని చేజార్చుకున్న పార్టీగా బీజేపీ రాష్ట్రంతోపాటు కేంద్రంలో అనుసరిస్తున్న విధానాల్లోని తప్పొప్పులపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం నాడి తెలిశాక అయినా వాటిని సవరించుకోవాలి. -
జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోదీ, షా
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్-జేఎంఎం కూటమి అత్యధికంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారం బీజేపీ కేవలం 25 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు 9 స్థానాల్లో విజయం నమోదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రఘువర్‌దాస్ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం సోమవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది మూర్మాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కాగా ఫలితాలపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనపై ప్రజా తీర్పు వెలువడిందని అభిప్రాయపడుతున్నారు. అభినందనలు: మోదీ, షా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్-జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు. పాలనలో కూటమికి అంతామంచి జరగాలని వారు ఆకాంక్షించారు. జార్ఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు. -
'ఇది నా ఓటమి, పార్టీది కాదు'
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీ ఘోర పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రకటించారు. ఇది కేవలం తన ఓటమి అని, బీజేపీది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫలితాలపై స్పందిస్తూ.. జార్ఖండ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ జార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. గతంలో బీజేపీకి అధికారమిచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్ఖండ్ పీఠం తమదేనని పాలక బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. हम झारखंड की जनता द्वारा दिये गये जनादेश का सम्मान करते हैं। भाजपा को 5 वर्षों तक प्रदेश की सेवा करने का जो मौका दिया था उसके लिए हम जनता का हृदय से आभार व्यक्त करते हैं। भाजपा निरंतर प्रदेश के विकास के लिए कटिबद्ध रहेगी। सभी कार्यकर्ताओं का उनके अथक परिश्रम के लिए अभिनंदन। — Amit Shah (@AmitShah) December 23, 2019 -
‘జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్ : జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యర్శి సంపత్ విమర్శించారు. జార్ఖండ్ ఫలితాల సందర్భంగా గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, దేశంలో బీజేపీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని, వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అధికారపార్టీకి దూరం అయ్యారన్నారు. అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వానిదేనని, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. (జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం) సంబంధిత వార్తలు : సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం! జార్ఖండ్‌లో నూతన శకం: సోరేన్ -
జార్ఖండ్ ఫలితాలు: డిప్యూటీ సీఎం ఎవరు?
రాంచి: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడం పట్ల జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరేన్ హర్షం వ్యక్తం చేశారు. తమ కూటమికి విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ‘కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. మా కూటమికి ప్రజలు పట్టం కట్టారు. మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు, మద్దతుదారులకు ధన్యవాదాలు. నన్ను నమ్మి, మద్దతు తెలిపినందుకు లాలూ ప్రసాద్, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రోజు నుంచి జార్ఖండ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. కులం, మతం, వృత్తి బేధాలు లేకుండా అందరి ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీయిస్తున్నాన’ని హేమంత్ సోరేన్ అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలను మైలురాయిగా ఆయన వర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీకి సంపూర్ణ ఆధిక్యం రావడంతో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఎన్నిక కానున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. జేఎంఎంకే డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా అని హేమంత్ సోరేన్‌ను విలేకరులు ప్రశ్నించగా కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించడంతో తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఆయన ఉల్లాసంగా గడిపారు. సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. (మోదీ, అమిత్ షాలకు గర్వభంగం) #WATCH: Jharkhand Mukti Morcha's (JMM) Hemant Soren rides a cycle at his residence in Ranchi. JMM is currently leading on 28 seats while the Congress-JMM-RJD alliance is leading on 46 seats. pic.twitter.com/e9HYcb26Y2 — ANI (@ANI) December 23, 2019 -
జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం
న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ కేవలం 21 స్థానాల్లోనే ముందంజలో ఉంది. దీంతో కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీయే ప్రతిపక్షాలు జార్ఖండ్ ఫలితాలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్సీపీలు స్పందించగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం స్పందించారు. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అధికార పీఠాన్ని చేజిక్కిచుకోనున్న క్రమంలో బీజేపీపై చిదంబరం విమర్శలు గుప్పించారు. (సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!) ‘నరేంద్ర మోదీ, అమిత్ షా పాలనను మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రజలు తిరస్కరించారు. హర్యానాలో కూడా స్వల్ప మెజార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ బీజేపీ 2019 కథ. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్‌తో ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి ముందుకు రావాలి. బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడటం ఖాయం’ అని ట్వీట్ చేశారు.(జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం) ఇక ఇదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన,ఎన్సీపీ స్పందించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతోందని, వీటికి జార్ఖండ్ ఫలితాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాయి. ప్రధాని, అమిత్ షా, అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచి పెట్టారని, ప్రజాస్వామ్యం గెలిచిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. అమిత్ షా నేతృత్వంలోని పార్టీని గిరిజనులు, పేద ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. -
సాదాసీదా సొరెన్.. సైకిల్‌పై కాబోయే సీఎం!
-
సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!
రాంచీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అధికార బీజేపీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. మిగతా స్థానాల్లో ఇతరులు విజయం దిశగా వెళ్తున్నారు. మొత్తం మీద అధికార బీజేపీ వ్యతిరేకంగా ఫలితాలు వెలువుడుతున్నాయి. కాంగ్రెస్- జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందిన సమచారం ప్రకారం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దీటైన పోటీ ఇస్తూ పాలక బీజేపీపై విస్పష్ట ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. ఒకవేళ మెజార్టీకి ఒకటీ, రెండు సీట్ల దూరంలో నిలిచినా.. ఇతరుల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాలకు కాగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యులు మద్దతు అవసరం కానుంది. దీంతో సోరెన్ మరోసారి సీఎం పీఠం అధిరోహించే అవకాశం ఉంది. కాగా ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టపాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి షిబు సొరెన్ తనయుడైన హేమంత్ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూ పార్టీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. ఫలితాల నేపథ్యంలో ఆయన భార్యతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుండగా ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జంషెడ్పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆయనపై పోటీకి దిగిన బీజేపీ రెబల్ అభ్యర్థి సర్యూరాయ్ రెండువేల ఓట్లపైగా ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇక్కడి నుంచి రఘువర్‌దాస్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన విషయం తెలిసిందే. -
జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం
ముంబై: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు అని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ‘మోదీ, అమిత్‌షాల గర్వాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచిపెట్టేశారు. ప్రజాస్వామ్యం గెలిచింద’ని ఆయన ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్, మనీష కయాండే (ఫైల్ ఫొటోలు) మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన బీజేపీపై ప్రజలకు విశ్వాసం సడలుతోందని శివసేన అధికార ప్రతినిధి మనీష కయాండే అభిప్రాయపడ్డారు. ‘వారు (బీజేపీ) అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తామని ప్రజలతో చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నార్సీ వంటి అంశాలను అందుకే తెర ముందుకు తీసుకొచ్చార’ని మనీష పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా బాగానే కష్టపడినప్పటికీ.. జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోయిందని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తాజా ట్రెండ్స్ ప్రకారం జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 24 స్థానాలతో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఏజేఎస్‌యూ 4, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 4 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది. (చదవండి: జార్ఖండ్ పీఠం మాదే..) -
జార్ఖండ్ పోల్ : మహాఘట్బంధన్ జోరు
-
జార్ఖండ్ పీఠం మాదే..
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా పాలక బీజేపీ గెలుపుపై భరోసా వీడలేదు. బీజేపీ నేతృత్వంలోనే జార్ఖండ్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి రఘబర్‌దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన క్రమంలో ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని చెప్పుకొచ్చారు. ఆధిక్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి మధ్య దోబూచులాట నెలకొందని, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్ ఏ క్షణమైనా తారుమారు కావచ్చని ఆయన పేర్కొన్నారు. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న వాళ్లను చేసుకోనివ్వండి..ఒకరు వేడుక చేసుకుంటుంటే ఎవరూ ఆపబోరని వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన సమయంలో మొత్తం 81 స్ధానాలకు గాను బీజేపీ 28 స్ధానాల్లో ముందంజలో ఉండగా, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండి మేజిక్ ఫిగర్ (41)ను అందుకుంది. విపక్ష కూటమి విజయంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ సీఎం పగ్గాలు చేపడతారని కూటమి నేతలు స్పష్టం చేశారు. -
జార్ఖండ్ పోల్ : మేజిక్ ఫిగర్ దిశగా జేఎంఎం-కాంగ్రెస్
రాంచీ : ఉత్కంఠభరితంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. పాలక బీజేపీపై జేఎంఎం- కాంగ్రెస్ కూటమి విస్పష్ట ఆధిక్యం కనబరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జేఎంఎం కాంగ్రెస్ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండగా పాలక బీజేపీ 28 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఏజేఎస్‌యూ 3 స్ధానాల్లో, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 5 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్ధానాలు కలిగిన జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 41కాగా జేఎంఎం కాంగ్రెస్ కూటమి కీలక సంఖ్యను దాటే దిశగా సాగుతోంది. మరోవైపు ఆధిక్యాల్లో దోబూచులాటతో ఇరు పక్షాలు చిన్నాచితకా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్పూర్ తూర్పు స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ తాను పోటీచేసిన రెండు స్ధానాల్లోనూ తొలుత ఆధిక్యంలో దూసుకుపోగా ఇప్పుడు ఓ స్ధానంలో వెనుకపడ్డారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యత కనబరుస్తుందన్న అంచనాలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దీటైన పోటీ ఇస్తూ పాలక బీజేపీపై విస్పష్ట ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. -
నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
సాక్షి, రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది. చదవండి: జార్ఖండ్ ఫలితాలు నేడే -
ఫలితాలపై ఉత్కంఠ: బీజేపీకి ఓటమి తప్పదా!
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అధికార బీజేపీకి కంగుతినిపించాయి. కమళనాథులకు ఈసారి ఓటమి తప్పదని పలు సంస్థలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్-జేఎంఎం కూటమికి 50కిపైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ 22-30 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. దీంతో రేపు విడుదలైయ్యే ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ 79 సీట్లలో బరిలో సొంతంగా బరిలో దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 సీట్లలో పోటీ చేశాయి. (ఎగ్జిట్‌పోల్స్: బీజేపీకి ఎదురుదెబ్బ) 2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా, వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీకి 2014లో ఒక్క సీటు కూడా రాలేదు. -
ఎగ్జిట్‌పోల్స్: బీజేపీకి ఎదురుదెబ్బ
రాంచీ: దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి మరో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకోబోతోందా?. జార్ఖండ్‌లో వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలు కానున్నాయా?. చిన్నరాష్ట్రం జార్ఖండ్‌లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్-జేఎంఎం కూటమికి 38-50 సీట్లను సొంత చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. వీటికి భిన్నంగా హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ పలు సంస్థలు స్పష్టం చేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 ఎమ్మెల్యే మద్దతు అవసరం కానుంది. ఎగ్జిట్‌పోల్స్ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రఘువర్ దాస్ విజయంపై ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తామే అధికారాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కాగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు