రాంచీ: జార్ఖండ్‌లో నాలుగవ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 15 నియోజకవర్గాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో 56.58 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో సోమవారం ఈ ఎన్నికలు జరిగాయి. జమువా నియోజకవర్గంలో 50, 51 బూత్‌లలో ఓట్లు వేసేందుకు నిరాకరించారు. మొత్తం 6,101 పోలింగ్ కేంద్రాల్లో 587 సమస్యాత్మకమైనవిగా, 405 సున్నితమైనవిగా గుర్తించారు. 20న చివరి దశ పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment