fourth phase polling
-
Live Blog: ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది
-
పశ్చిమ బెంగాల్: ముగిసిన నాలుగో దశ పోలింగ్
► పశ్చిమ బెంగాల్లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు దశల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ కొంత హింసాత్మకంగా మారింది. కుచ్‌బిహర్‌లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ► బెంగాల్లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళి ఇలా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ► దీదీ, టీఎంసీ గూండాల ఆరాచకాలను బెంగాల్లో అనుమతించమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కూచ్ బెహార్లో జరిగిన సంఘటనకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని నేను కోరుతున్నట్లు తెలిపారు. ► పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. కూచ్ బెహార్లో చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు ఇచ్చే మద్దతు చూసి మమతా బెనర్జీ, ఆమె పార్టీ గూండాలు కలత చెందుతున్నారు. దీదీ తన కుర్చీ జారిపోతుందన్న భయంతో ఈ స్థాయికి దిగజారిందన్నారు. ► పశ్చిమ బెంగల్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ కేంద్ర వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నేత, భంగర్ నియోజకవర్గ అభ్యర్థి నౌషాద్ సిద్దిఖీ, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సౌమి హతి ఒకరినొకరు పలకరించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ► నాలుగో విడత పోలింగ్‌లో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ► బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. హుగ్లీలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. హూగ్లీలోని పోలింగ్ బూత్ నెంబర్ 66లో తనపై స్థానికులు, టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ అన్నారు. ఈ దాడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా జర్నలిస్టులపై కూడా దాడి జరిగిందని, అదనపు బలగాలను పోలింగ్ బూత్ వద్దకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. ► బెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. కూచ్ బెహార్‌లోని సితాల్‌కుచిలో ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 9:30 గంటల వరకు 15.85 శాతం పోలింగ్ నమోదైనట్ల ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► బెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కూచ్ బెహార్‌లోని నటాబరి నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రవీంద్ర నాథ్ ఘోష్ ఓ పోలీంగ్ కేంద్రానిక వినూత్నంగా వచ్చారు. ఆయన హెల్మెట్ ధరించి కనిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి తాను హెల్మెట్ ధరించినట్లు పేర్కొన్నారు. ► బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి సౌమి హతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ► కోల్‌కతాలోని గాంధీ కాలనీ భారతి బాలికా విద్యాలయంలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనుమతించలేదు. దీంతో బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో అక్కడకు చేరుకొని.. పోలింగ్ ఏజెంట్‌కు ఐడీ కార్డు ఉందని, అతనికి సంబంధించిన వివరాలు ఎన్నికల వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను అనుమతించారు. కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగుతుంది. 15,940 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విడత పోలింగ్‌లో 1.15 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చదవండి: మమతకు ఈసీ మరో నోటీసు -
పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్ మెజారిటీ
సాక్షి, గోరంట్ల: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో భారీ మెజారిటీ నమోదైంది. గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్సీపీ మద్దతుతో సరోజ బరిలో నిలవగా.. టీడీపీ మద్దతుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెళ్లి పీటల నుంచి పోలింగ్ కేంద్రానికి.. మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్లు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరువపల్లి గ్రామానికి చెందిన కోటానాయక్, కొత్తలం తండాకు చెందిన లావణ్యబాయికి ఆదివారం పావగడలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని నవ దంపతులు చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా పరిగికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వినయ్‌రెడ్డి, శ్రావణిల వివాహం ఆదివారం జరిగింది. మాంగల్యధారణ తర్వాత నూతన వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం -
కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ఏపీ నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ముగిసిన తుది విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్
మధ్యాహ్నం 3:30 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఓటింగ్ ముగిసే సమయానికి శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్ఆర్ జిల్లాలో 80.68 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం. 1.30 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12:30 వరకు 66.60 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. ► శ్రీకాకుళం- 62.07 శాతం ► విజయనగరం- 77.2 శాతం ► విశాఖపట్నం- 73.3 శాతం ► తూర్పు గోదావరి-64.04 శాతం ► పశ్చిమ గోదావరి- 63.29 శాతం ► కృష్ణా- 62.82 శాతం ► గుంటూరు- 62.87 శాతం ► ప్రకాశం- 61.79 శాతం ► నెల్లూరు- 61.62 శాతం ► చిత్తూరు- 66.62 శాతం ► కర్నూలు- 68.62 శాతం ► అనంతపురం- 71.65 శాతం ► వైఎస్ఆర్ - 69.93 శాతం మధ్యాహ్నం. 1.00 వార్డు ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరులో ఐదవ వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఏజెంట్ బాబురావుకు తీవ్రగాయాలు కాగా ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబు రావు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం. 12.00 పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ► కృష్ణా: గన్నవరం బాలుర హైస్కూల్లోని 9వ వార్డులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి మూడు విడతల ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతుందని అంచనా వేశారు. ఉదయం. 11. 30 తూర్పు గోదావరి: అల్లవరం మండలం మొగలుమూరులో ఎంపీ చింతా అనురాధ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా: గన్నవరం బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. గత మూడు విడతల్లో 86 శాతం ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. నాలుగో విడతలో కూడా అదే రీతిలో నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6.30 నుండి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఉదయం. 11.00 తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం ఉదయం 10:30 వరకు 41.55 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. ► శ్రీకాకుళం- 36.84 శాతం ► విజయనగరం- 54.57 శాతం ► విశాఖపట్నం- 48.94 శాతం ► తూర్పుగోదావరి- 35.85 శాతం ► పశ్చిమ గోదావరి- 34.62 శాతం ► కృష్ణా- 36.47 శాతం ► గుంటూరు- 41.25 శాతం ► ప్రకాశం- 40.5 శాతం ► నెల్లూరు- 33.94 శాతం ► చిత్తూరు- 43.58 శాతం ► కర్నూలు- 15.42 శాతం ► అనంతపురం- 46.36 శాతం ► వైఎస్ఆర్ - 40.69 శాతం ఉదయం. 10.20 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏపీలో కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ► శ్రీకాకుళం: ఎచ్చెర్ల రణస్థలం మండలం పాతర్లపల్లిలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా: గన్నవరం మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ శ్రీనివాసులు పర్యటించారు. గన్నవరం హైస్కూల్లోని పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. ఉదయం 9.30 రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8.30 గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు.. ► శ్రీకాకుళం- 12.5 శాతం ► విజయనగరం- 22.5 శాతం ► విశాఖపట్నం- 18.48 శాతం ► తూర్పుగోదావరి- 8.58 శాతం ► పశ్చిమగోదావరి- 14.12 శాతం ► కృష్ణా- 8.53 శాతం ► గుంటూరు-13.94 శాతం ► ప్రకాశం-9.13 శాతం ► నెల్లూరు-8.44 శాతం ► చిత్తూరు-12.4 శాతం ► వైఎస్ఆర్ కడప-9.35 శాతం ► కర్నూలు-15.4 శాతం ► అనంతపురం-15.40 శాతం ఉదయం. 9.10 ►నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాలుగో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భారీ వర్షం కారణంగా మందకొడిగా సాగుతోంది. ►విశాఖపట్నం: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో టీడీపీ, వైస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉదయం. 8.30 ► పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేయడానికి బారులు తీరారు. ►అనంతపురం: పెనుకొండ రెవెన్యూ డివిజన్లో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు పోలీసుల సాయం అందేలా ఆదేశాలు ఇచ్చారు. మండలానికో డీఎస్పీతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు. టీడీపీకి ఎదురుదెబ్బ కృష్ణా: గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై మద్దతుదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఉదయం. 7.30 ► పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్, పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల బందోబస్తులో దాదాపు 48 వేల మంది పోలీసులు పాల్గొన్నారు. ► శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగం గ్రామంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాన్ తొలి ఓటు వేశారు. ► విశాఖపట్నం: రాంపురం పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలోని పెద్ద కాకాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మొదటి ఓటు వేశారు. ఇదే పోలింగ్ కేంద్రంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం. 7.00 ► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని రాయన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం. 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6.30 పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం. 6.20 7,475 మంది పోటీ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకంలోకి చేరుకున్నాయి. ఆఖరి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. తుది విడతలో 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేలా నోటిఫికేషన్లు జారీ కావడం తెలిసిందే. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల సర్పంచి పదవికి ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 67.75 లక్షల మంది ఓటర్లు.. ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు 28,995 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా సుమారు 67.75 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో ఓటింగ్‌ను ఎస్ఈసీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ విధులకు 88,091 మంది సిబ్బందిని నియమించగా శనివారం సాయంత్రమే సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పర్యవేక్షణ అధికారులుగా 4,570 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 70,829 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 283 గ్రామాల్లో నిలిచిపోయిన ఎన్నికలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ 283 పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా 274 పంచాయతీలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్లే జారీ చేయలేదు. మరో 9 చోట్ల సర్పంచి, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. పల్లె పోరుకు పటిష్ట బందోబస్తు.. పంచాయతీలకు చివరి దశ ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 161 మండలాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్ , పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. పోలీస్ బృందాలు శనివారం ఉదయం నుంచే రంగంలోకి దిగి సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించాయి. తుది విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 48 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. -
జార్ఖండ్‌లో 56.58% పోలింగ్ నమోదు
రాంచీ: జార్ఖండ్‌లో నాలుగవ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 15 నియోజకవర్గాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో 56.58 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో సోమవారం ఈ ఎన్నికలు జరిగాయి. జమువా నియోజకవర్గంలో 50, 51 బూత్‌లలో ఓట్లు వేసేందుకు నిరాకరించారు. మొత్తం 6,101 పోలింగ్ కేంద్రాల్లో 587 సమస్యాత్మకమైనవిగా, 405 సున్నితమైనవిగా గుర్తించారు. 20న చివరి దశ పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
‘నాలుగో విడత’లో హింస
న్యూఢిల్లీ/కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. నాలుగో విడత పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెంగాల్‌లోని ననూర్, రామ్పుర్హత్, నల్హటి, సురి ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా అధికార తృణమూల్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భరంగా 145 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌చేశారు. అసన్సోల్ లోక్‌సభ స్థానంలోని బర్బానీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుప్రియో సురక్షితంగా బయటపడ్డారు. అలాగే దుర్బాజ్పూర్ ప్రాంతంలో కొందరు దుండగులు సెల్ఫోన్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి తమపై దాడికి యత్నించడంతో కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. మొరాయించిన ఈవీఎంలు.. మధ్యప్రదేశ్‌లో మాక్‌పోలింగ్ సందర్భంగా 207 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వీఎల్ కాంతారావు తెలిపారు. వీటిని వెంటనే మార్చామన్నారు. ఆ తర్వాత పోలింగ్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తడంతో మరో 107 ఈవీఎంలను సమకూర్చామని వెల్లడించారు. ఇక రాజస్తాన్‌లోని బన్స్వారాలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదుకాగా, బర్మర్లో 72.21 శాతం నమోదైనట్లు అక్కడి ఎన్నికల అధికారులు చెప్పారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని ఆరు నియోజకవర్గాల్లో 51.11 శాతం పోలింగ్ నమోదయింది. కశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజవకర్గంలో రెండో విడత ఎన్నికల్లో 10.5 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒడిశాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య.. ఒడిశాలోని బలికుడా–ఎరసమా పోలింగ్ కేంద్రం నుంచి తిరిగివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్త లక్ష్మణ్ బెహరాపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. జాజ్‌పూర్–కేంద్రపరా, బాలాసోర్ లోక్‌సభ స్థానాల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ బీజేడీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు తన భార్య డింపుల్ యాదవ్ పోటీచేస్తున్న కన్నౌజ్‌లో ఈవీఎంల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని జమ్కారా పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారి తనకు బదులుగా ఈవీఎం బటన్ నొక్కేశాడని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారిని విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత బబూల్ సుప్రియోపై సోమవారం కేసు నమోదయింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సుప్రియో బర్బానీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం అక్కడి ఎన్నికల అధికారితో పాటు ప్రత్యర్థి పార్టీ ఏజెంట్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సుప్రియోపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అయితే ప్రజలను ఓటేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం రావడంతోనే తాను బర్బానీకి వచ్చానని సుప్రియో వివరణ ఇచ్చారు. ఆమిర్ ఖాన్ దంపతులు, సల్మాన్ ఖాన్, ఊర్మిళ ప్రియాదత్, సంజయ్ దత్, కంగనా రనౌత్ దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్, అభిషేక్, ఐశ్వర్య -
నాలుగో దఫా పోలింగ్: ముగిసిన పోలింగ్
నాలుగో దశ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు బిహార్‌లో 53.67 శాతం, జమ్ము&కశ్మీర్లో 9.79, శాతం, మధ్యప్రదేశ్‌లో 65.86 శాతం, మహారాష్ట్ర 51.06 శాతం, ఒడిశా 64.05 శాతం, రాజస్తాన్ 62.86 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 53.12 శాతం, పశ్చిమ బెంగాల్లో 76.47 శాతం, జార్ఖండ్ 63.40 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దార్ రోడ్డులోని విల్లా థెరీసా హైస్కూల్లో ముఖేష్, ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఇషా ఓటు వేశారు. అన్సోల్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ 199లోకి ప్రవేశించడమే కాకుండా పోలింగ్ ఏజంట్, బూత్‌లో ఉన్న ఎన్నికల అధికారిని బెదిరించాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. అన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి సుప్రియో బీజేపీ తరపున మరోసారి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో దశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 50.6 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బిహార్‌లో 44.33 శాతం, జమ్ము&కశ్మీర్లో 9.37, శాతం, మధ్యప్రదేశ్‌లో 57.77 శాతం, మహారాష్ట్ర 42.52 శాతం, ఒడిశా 53.61 శాతం, రాజస్తాన్ 54.75 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 45.08 శాతం, పశ్చిమ బెంగాల్లో 66.46 శాతం, జార్ఖండ్ 57.13 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. ఒడిషా : ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్ ఆరోపించింది. జైపూర్ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఓటర్లను బెదిరిస్తూ ఓటింగ్ శాతం పెరగకుండా టీఎంసీ గూండాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నాలుగో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బిహార్‌లో 44.23 శాతం, జమ్ము&కశ్మీర్లో 8.42, శాతం, మధ్యప్రదేశ్‌లో 55.22 శాతం, మహారాష్ట్ర 41.15 శాతం, ఒడిశా 51.54 శాతం, రాజస్తాన్ 54.16 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 44.16 శాతం, పశ్చిమ బెంగాల్లో 66.01 శాతం, జార్ఖండ్ 56.37 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. ఎన్నికలు సజావుగా జరగకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేంద్ర బలగాలు బీజేపీ నాయకులతో చేరి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓటర్లపై బెదిరింపులకు దిగారని ఈసీకి ఇచ్చిన లెటర్లో పేర్కొంది. కాగా,పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటంతో అక్కడ పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్‌లో ఉద్రిక్తత తలెత్తింది. టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాలుగో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 38.63 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 72 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిహార్‌లో 37.71 శాతం, జమ్ము&కశ్మీర్లో 6.66, శాతం, మధ్యప్రదేశ్‌లో 43.44 శాతం, మహారాష్ట్ర 29.93 శాతం, ఒడిశా 35.79 శాతం, రాజస్తాన్ 44.62 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 34.42 శాతం, పశ్చిమ బెంగాల్లో 52.37 శాతం, జార్ఖండ్ 44.90 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ 203లో సచిన్, ఆయన సతీమణి అంజలీ, కుమారుడు అర్జున్, కూతురు సారా ఓటు వేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షారుఖ్, ఆయన సతీమణి గౌరీఖాన్ ఓటు వేశారు. పోలింగ్ సెంటర్ 283లో ఆయన ఓటు వేశారు. ముంబైలోని జుహు పోలింగ్ కేంద్రంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ తన తండ్రి సురేష్ ఒబేరాయ్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జుహులోని గాంధీగ్రామ్ పాఠశాలలో వారు ఓటు వేశారు. హీరో రణ్వీర్ సింగ్ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్‌లో టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీఎంసీ మహిళా కార్యకర్తలు కర్రలు చేతబూని ఆందోళనకు దిగారు. కేంద్ర బలగాలు అందుబాటులో లేకపోవటంతో పోలీసు సిబ్బందే పరిస్థితిని చక్కబెడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యకర్తలు ఓ మహిళా రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు. మైకును లాక్కొని ఆమెపై చేయి చేసుకున్నారు. బాలీవుడ్ తారలు అజయ్ దేవ్‌గణ్, కాజల్ దంపతులు, అనుపమ్ ఖేర్, ప్రియాదత్ గేయ రచయిత గుల్జర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు బీహార్ 10.75 శాతం, మధ్యప్రదేశ్ 10.09 శాతం, మహారాష్ట్ర 4.09 శాతం, ఒడిశా 9 శాతం, రాజస్తాన్ 7.57 శాతం, యూపీ 8.05శాతం, పశ్చిమ బెంగాల్ 16.74 శాతం, జార్ఖండ్ 10.94 శాతం పోలింగ్ నమోదైంది. బాలీవుడ్ నటీమణులు భాగ్య శ్రీ, సోనాలీ బింద్రే ముంబైలోని విలే పార్లేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్‌ఖాన్ ఆయన సతీమణి కిరణ్‌రావ్ ముంబై బాంద్రాలోని అన్నెస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్ నటి మాధురీ దీక్షిత్ జుహులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ పెద్దర్ రోడ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ, బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. కేంద్ర మంత్రి, అసన్సోల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారుపై కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అంతకు క్రితమే ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఓటర్లు చైతన్య వంతులయ్యారని, కేంద్ర భద్రతా బలగాలు లేనిదే ఓటు వెయ్యమని చెప్పటం శుభసూచకమని పేర్కొన్నారు. భద్రతా బలగాలు లేని చోటుకు తాను స్వయంగా కే్ంద్ర బలగాలను తీసుకువెళతానని చెప్పారు. ఓటర్ల చైతన్యాని చూసి మమతా బెనర్జీ భయపడుతోందని అన్నారు. కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కుల్గామ్‌లోని కురిగామ్ పోలింగ్ బూత్‌లో ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ.. ఝాన్సీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీపీఐ బెగుసరయ్ ఎంపీ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ బెగుసరయ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెగుసరయ్ని పాడుచేసే వారికి ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్‌కు పోటీగా కన్షయ్య నిలబడిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సికర్పూర్లోని పోలింగ్ బూత్ నెం 17లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్ బాంద్రాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా శాంతిపూర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు కలకలం రేపింది. పోలింగ్ కేంద్రంలో ఇలా నాటు బాంబు దర్శనమియ్యటంతో ఓటర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ పరేశ్ రావల్ దంపతులు విలే పార్లీలోని జమ్నా బాయి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి రేఖ బాంద్రాలోని బూత్ నెంబర్ 283లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవి కిషన్ గురుగావ్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు నడవలేని వారికి అక్కడి పోలింగ్ పర్సనల్స్ సహాయమందిస్తున్నారు. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా జల్‌వార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ ఓర్లిలోని బూత్ నెం48లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేయడానికి పెద్దర్ రోడ్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చుని ఉన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, నవాడా సిట్టింగ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లకిసరయ్ జిల్లా బరహియాలోని బూత్ నెం 33లో ఓటు వేశారాయన. ఓటు వేయడానికి పూర్వమే ఆయన బరహియాలోని శక్తిదామ్‌లో పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ (మొత్తం మూడు దశలు) పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ బమ్రే, ఎస్ఎస్ అహ్లూవాలియా, బాబుల్ సుప్రియోతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు సల్మాన్ ఖుర్షీద్, సినీనటి ఊర్మిళ మతోండ్కర్, సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ తదితర 961 అభ్యర్థుల భవితవ్యంపై 12.79 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
రంగులుమారే రాజకీయాలా? పారదర్శక పాలనా?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు, కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలన్నీ ఒకవైపుగా పోరు నడుస్తోంది. కానీ బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాష్ట్రంలో ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరచూ మిత్రుల్ని మార్చే రాజకీయాలకు ఒక రిఫరెండంగా భావిస్తున్నారు. సుపరిపాలనకు పెట్టింది పేరైన నితీశ్ గత ఆరేళ్లలో ప్రతీ ఎన్నికలకి కూటములు మారడం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ? ఒకప్పుడు బిహార్‌లో మోదీని అడుగు పెట్టనివ్వనన్న నితీశ్ ఇప్పుడు బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పేందుకు చేస్తున్న కృషి ఫలితాన్నిస్తుందా ? సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. తొలి నుంచీ రాజకీయాలూ, కులం కలగలిసి ఉన్న రాష్ట్రం బిహార్. ఇటు రాజకీయాల్లోనూ, అటు సామాజిక కోణంలోనూ మిగిలిన రాష్ట్రాలకు పూర్తి భిన్నత్వం గల బిహార్ ఎన్నికల్లో ఈ సారి రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన ఆర్జేడీ నేత లాలూ లేకపోవడం కూడా ప్రత్యేకమే. ఓ పక్క అపర రాజకీయ దురంధరుడూ, చమత్కారీ లేని లోటుతో పాటు, రాష్ట్ర సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌పై బీజేపీ పూర్తిగా నమ్మకం ఉంచడం మరో ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) చేతులు కలిపి చెరో 17 సీట్ల నుంచి పోటీ పడుతున్నారు. శత్రువులు మిత్రులైన వేళ భారతీయ జనతా పార్టీ 2013లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఏనాటిౖకైనా ప్రధాన మంత్రి కావాలని కలలు కన్న ఆయన బీజేపీతో 17ఏళ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై విమర్శల దాడిచేశారు. ఆయనను బిహార్ గడ్డపై అడుగుపెట్టనివ్వనని ప్రతినబూనారు. మాటల గారడీ చేస్తారంటూ విమర్శించారు. మోదీ కూడా మోసం చేయడం నితీశ్ డీఎన్ఏలోనే ఉందని ఎదురుదాడి చేశారు. గత ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకున్నారు. కానీ మోదీ హవా ముందు నితీశ్ నిలబడలేకపోయారు. నితీశ్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పుడు శత్రువుగా చూసిన లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపి నెగ్గారు. సీఎం పదవిని కూడా అందుకున్నారు. మళ్లీ నాలుగేళ్లు తిరిగిందో లేదో లాలూకి హ్యాండిచ్చి తిరిగి బద్ధశత్రువులా చూసిన మోదీతో చేతులు కలిపారు. మోదీ అధికారంలోకి వస్తేనే దేశం భద్రంగా ఉంటుందని, బిహార్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నితీష్ మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా ? నితీశ్ ఎంత పరిపాలనాదక్షుడైనప్పటికీ ఇలా కూటములు మారడం వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు హిందూస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జితన్ రామ్ మాంఝీ ‘‘బహుశా ఇదే నితీశ్‌కి ఆఖరి ఎన్నికలు. అధికారంలో కొనసాగడానికి ఆయన ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు‘‘అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కంటే జేడీ(యూ)కి తక్కువ సీట్లు వచ్చాయని, లాలూ కుమారుడు ఎక్కడ సీఎం అవుతారోనని లోలోపల ఆయనకి భయం ఉందని ఆరోపించారు. కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా నితీష్ గోడదూకుడు రాజకీయాలను తప్పుపడుతున్నారు. ‘‘నితీష్ కుమార్లో ఈ మార్పు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా నితీ‹Ô నోటి వెంట మోదీ జపం విస్మయానికి గురిచేస్తోంది’’అని సీమాంచల్, కోశి ప్రాంతంలో వరద బాధితుల సమస్యలపై పనిచేస్తోన్న మహేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి నితీశ్, మోదీ కాంబినేషన్‌కి తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ‘‘మా రెండు పార్టీల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. లెక్కలు కూడా పక్కాగా వేశాం.గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ ఓటు షేర్ని బట్టి అంచనాలు వేసుకుంటే ఈ సారి మా కూటమి 40కి 38 సీట్లు గెలుచుకుంటుంది‘‘అని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ ఎన్నికలు మోదీ, నితీశ్ పరిపాలనకు రిఫరెండంగానే భావిస్తున్నారు. ‘‘ఎన్డీయేకి నితీ‹శ్ కుమారే ప్రధానమనీ, ఇప్పటికీ నితీశ్ బ్రాండ్ ఇక్కడ పనిచేస్తోందనీ జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అంటున్నారు. మహిళా ఓటర్లే నితీశ్‌కి అండదండ ! బిహార్‌లో ఇప్పటివరకు 14 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గయ మినహా మిగతా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా మెరుగు పడడం, అమల్లో లోపాలు ఉన్నప్పటికీ మద్యపానంపై నిషేధం విధించడంతో మహిళలంతా నితీశ్‌వైపే ఉంటారని అంచనాలున్నాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న వ్యక్తిగత కరిష్మాతో నితీశ్‌కుమార్‌కి ఉన్న క్లీన్ ఇమేజ్ తోడుకావడంతో వెనుకబడిన కులాలన్నీ ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. అందుకే మహిళలంతా కులాలకు అతీతంగా ఈ సారి మోదీ, నితీశ్ ద్వయానికే ఓట్లు వేసినట్టుగా అంచనాలున్నాయి. మరోసారి రాష్ట్రంలో ఎన్డీయే స్వీప్‌చేయడం ఖాయం‘‘అని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సైబాల్ గుప్తా అభిప్రాయపడ్డారు. మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు అనుకూలంగా లేవా ? ఈ సారి ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. సీట్ల పంపకం ఆ కూటమిలో సంక్షోభాన్నే నింపింది. కూటమిలో ఆర్ఎస్ఎల్పీ, హెచ్ఏఎం వంటి చిన్నా చితకా పార్టీలు సంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఆర్జేడీ కత్తులు దూసుకున్నాయి. చివరికి ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాయి. ఆర్జేడీ 20 స్థానాల్లో పోటీ చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టింది. మిగిలిన 11 సీట్లు చిన్నపార్టీలు పంచుకున్నాయి. ఇవన్నీ మహాగఠ్‌బంధన్ కొంప ముంచుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
నేడు నాలుగో దశ పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ (మొత్తం మూడు దశలు) పోలింగ్ జరగనుంది. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ బమ్రే, ఎస్ఎస్ అహ్లూవాలియా, బాబుల్ సుప్రియోతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు సల్మాన్ ఖుర్షీద్, సినీనటి ఊర్మిళ మతోండ్కర్, సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ తదితర 961 అభ్యర్థుల భవితవ్యంపై 12.79 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా, బిహార్‌లోని బేగుసరాయ్ సీటు అందరి కన్ను ఉంది. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ గిరిరాజ్ సింగ్‌తో తలపడుతు న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం 302 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, నాలుగో దశతో మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. -
యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న నాలుగోదశ సాధారణ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో విడతలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. దాదాపు 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే ప్రాంతాల్లో 2012 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్ మరిన్ని సీట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి సాయశక్తులా ప్రచారకార్యక్రమాలు నిర్వహించింది. -
నేడే నాలుగోదశ పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (గురువారం) నాలుగో దశ పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లో ఉన్న 53 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంతో పాటు, నెహ్రూ కుటుంబం కంచుకోట రాయ్‌బరేలీ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతాప్‌గఢ్, కౌశంబి, అలహాబాద్, జలౌన్, ఝాన్సీ, లలిత్పూర్, మహోబా, బందా, హమిర్పూర్, చిత్రకూట్, ఫతేపూర్. రాయ్‌బరేలీ జిల్లాల్లో నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తర అలహాబాద్ స్థానంలో అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2012లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 24 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ–5, బహుజన్ సమాజ్ పార్టీ–15, కాంగ్రెస్–6, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.