► పశ్చిమ బెంగాల్‌లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు దశల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ కొంత హింసాత్మకంగా మారింది. కుచ్‌బిహర్‌లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
► బెంగాల్‌లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళి ఇలా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.
► దీదీ, టీఎంసీ గూండాల ఆరాచకాలను బెంగాల్‌లో అనుమతించమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కూచ్ బెహార్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని నేను కోరుతున్నట్లు తెలిపారు.
► పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. కూచ్ బెహార్‌లో చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు ఇచ్చే మద్దతు చూసి మమతా బెనర్జీ, ఆమె పార్టీ గూండాలు కలత చెందుతున్నారు. దీదీ తన కుర్చీ జారిపోతుందన్న భయంతో ఈ స్థాయికి దిగజారిందన్నారు.
► పశ్చిమ బెంగల్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ కేంద్ర వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నేత, భంగర్ నియోజకవర్గ అభ్యర్థి నౌషాద్ సిద్దిఖీ, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సౌమి హతి ఒకరినొకరు పలకరించుకున్నారు.
► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
► నాలుగో విడత పోలింగ్‌లో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
► బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. హుగ్లీలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. హూగ్లీలోని పోలింగ్ బూత్ నెంబర్ 66లో తనపై స్థానికులు, టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ అన్నారు. ఈ దాడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా జర్నలిస్టులపై కూడా దాడి జరిగిందని, అదనపు బలగాలను పోలింగ్ బూత్ వద్దకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు.
► బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. కూచ్ బెహార్‌లోని సితాల్‌కుచిలో ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీజేపీ కార్యకర్త మృతి చెందాడు.
► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 9:30 గంటల వరకు 15.85 శాతం పోలింగ్ నమోదైనట్ల ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
► బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కూచ్ బెహార్‌లోని నటాబరి నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రవీంద్ర నాథ్ ఘోష్ ఓ పోలీంగ్ కేంద్రానిక వినూత్నంగా వచ్చారు. ఆయన హెల్మెట్ ధరించి కనిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి తాను హెల్మెట్ ధరించినట్లు పేర్కొన్నారు.
► బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి సౌమి హతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
► కోల్‌కతాలోని గాంధీ కాలనీ భారతి బాలికా విద్యాలయంలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనుమతించలేదు. దీంతో బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో అక్కడకు చేరుకొని.. పోలింగ్ ఏజెంట్‌కు ఐడీ కార్డు ఉందని, అతనికి సంబంధించిన వివరాలు ఎన్నికల వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ను అనుమతించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగుతుంది. 15,940 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విడత పోలింగ్‌లో 1.15 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
చదవండి: మమతకు ఈసీ మరో నోటీసు
Comments
Please login to add a commentAdd a comment