లైవ్ అప్‌డేట్స్:
♦ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది.
♦ నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ ఓడిపోయిందంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లున్నాయని, నందిగ్రాం ఫలితం ప్రకటించలేదని తేల్చి చెప్పింది.
♦16వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సువేందు, దీదీపై 6 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు
♦నంనదిగ్రామ్‌లో దీదీ మళ్లీ ముందంజలో కొనసాగుతున్నారు. సువేందుపై 2 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు దీదీ.
♦ టీఎంసీ 209 స్థానాల్లో ఆధ్యికంలో కొనసాగుతూ.. హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతుంది. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతుంది.
♦ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. విచ్చినకర,విభజించే శక్తులను ప్రజలుతిప్పికొట్టారన్నారు.
♦ టీఎంసీకి అభినందనలు తెలిపిన శివసేన, ఎన్‌సీపీ
♦ క్రికెటర్ టర్న్‌డ్ పొలిటీసియన్ మనోజ్ తివారీ బీజేపీకి చెందిన రతిన్ చక్రవర్తిపై ఆధిక్యం
♦ స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
♦ బెంగాల్‌లో ఒక్క స్థానానికే కాంగ్రెస్, లెఫ్ట్ పరిమితం (మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్)
♦ బెంగాల్‌లో కమ్యూనిస్టులకు భారీ గండి
♦ నందిగ్రామ్‌లో దూసుకొచ్చిన మమత. సువేదు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్‌లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
♦ లీడింగ్‌లోడబుల్ సెంచరీ మార్క్‌ను దాటేసిన టీఎంసీ. 201 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ జోరు
♦ ఐదో రౌండ్‌లో పుంజుకున్న మమత 8,201 నుంచి 3వేలకు పడిపోయిన సువేందు ఆధిక్యం
♦ ఒకవైపు టీఎంసీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా,వరుసగా నాలుగో రౌండ్‌లోనూ సీఎం మమతకు భంగపాటు తప్పడం లేదు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ‍్యర్థి సువేందుకంటే 8106 ఓట్లు వెనుకబడి ఉన్నారు
♦లీడ్‌లో టీఎంసీ ప్రముఖులు: దమ్ దమ్ నార్త్‌లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్‌లో, సింగూర్‌లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ లీడింగ్
♦ ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో లీడింగ్‌లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 159 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 90 సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉంది
♦ మూడో రౌండ్‌లోనూ మమత వెనుకబడి ఉన్నారు. సుమారు 7287 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్
♦ రెండో రౌండ్‌లోనూ మమత వెనుకబాటులో ఉన్నారు. సుమారు 4500 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్
♦ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత మొలాయ్ ఘటక్ అసన్సోల్‌లో ఆధిక్యం.
♦ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత తారకేశ్వర్ నియోజకవర్గంలోబీజీపీ స్వాపన్ దాస్‌గుప్తా ముందంజ.
♦ కృష్ణానగర్ బీజేపీ ముకుల్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు.
♦ టోలీగంజ్‌లో బీజేపీకి చెందిన బాబుల్ సుప్రియో లీడింగ్‌లో ఉన్నారు.
♦ పోస్టల్ బ్యాలెట్‌లో దీదీ ముందంజలోఉన్నారు.
♦ నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజ : టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
♦ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
♦ ఈ హోరాహోరీపోరులో టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
♦ మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది.
♦ ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌లోఅధికార పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాల్సి ఉంటుంది. (చదవండి: దీదీనా? మోదీనా?)
కౌంటింగ్‌లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి.
కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శానిటైజ్ చేయనున్నారు.
మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment