Himachal Pradesh Election Results 2022 Live Updates: Counting Begins - Sakshi
Sakshi News home page

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022.. అప్‌డేట్స్‌

Published Thu, Dec 8 2022 7:19 AM | Last Updated on Thu, Dec 8 2022 7:34 PM

Himachal Pradesh Election Results 2022 Votes Counting Live Updates - Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ అప్డేట్స్

అప్డేడ్‌ 07: 00PM
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. హిమాచల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్‌ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. 

అప్డేడ్‌ 06: 30PM
హిమాచల్‌ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.  ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనక శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ ఫలితం లభించిందన్నారు.  ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు సహకరించిందని తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయన్నారు. ఈ విజయం క్రెడిట్ తను తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమని తెలిపారు. 

కాగా హిమాచల్‌ ఎన్నికల్లో విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.ఔ

అప్డేడ్‌ 06: 00PM
బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అప్డేడ్‌ 04: 15PM
హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్‌ హైకమాండ్ నిర్ణయించనుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ప్రియాంక గాంధీ 10 పాయింట్ల మ్యానిఫెస్టో అక్కడ పనిచేసిందన్నారు. అయితే గుజరాత్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ప్రచార సమయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, బీజేపీకి ఊహించని విజయమని అన్నారు.

2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే..

అప్డేడ్‌ 03: 45PM
కాంగ్రెస్‌ విజయం
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్‌ 35ను దాటేసింది. ఇప్పటికే 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. 

అప్డేడ్‌ 03: 15PM
సీఎం జైరాం ఠాకూర్‌ రాజీనామా
హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై జైరాం ఠాకూర్‌ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.  

కసుంప్టి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత అనిరుధ్ సింగ్ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి(బీజేపీ), రాష్ట్ర మంత్రి సురేష్ భరద్వాజ్‌పై 8,655 ఓట్ల తేడాతో గెలుపొందారు.

అప్డేట్‌ 3: 00PM
హిమాచల్ ప్రదేశ్ మంత్రి రామ్ లాల్ మార్కండ ఓటమి చెందారు. లాహౌల్ &స్పితి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో 1,616 ఓట్ల తేడాతో  పరాజయం పొందారు.

అప్డేట్‌ 2: 300PM
హిమాచల్‌ప్రదేశ్‌లోని  హమీర్‌పూర్‌ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(బీజేపీ రెబల్‌) అభ్యర్థి ఆశిష్‌ శర్మ విజయం సాధించారు.

అప్డేట్‌ 2: 00PM
కాంగ్రెస్‌ దూకుడు
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 24 సీట్లలో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 35ను చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. 

అప్డేట్‌ 1: 10PM
ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌ ధీమా
హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌. ప్రస్తుతం కౌంటింగ్‌ కొనసాగుతోందని, కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకురాబోమని, కానీ, వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది, ఏ స్థాయికైనా వెళ్తుందన్నారు. 

అప్డేడ్‌ 11: 25AM
ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్‌.. 
హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

అప్డేడ్‌ 11: 05AM
రెబల్స్‌తో బీజేపీ చర్చలు
హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 68 స్థానాలకు గానూ మ్యాజిక్‌ ఫిగర్‌ 35 అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింగి బీజేపీ. రెబల్స్‌తో చర్చలు చేపట్టింది. అందుకోసం వినోద్‌ తావ్డేను హిమాచల్‌కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ 32, కాంగ్రెస్‌ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండే అవకాశం ఉన్నందున రెబల్స్‌ను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ఆపరేషన్‌ లోటస్‌ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్‌

అప్డేట్‌ 10:30AM
 శాసన సభ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ‍్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీలు తలో 32 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.  

అప్డేట్‌ 9:50AM
అసెంబ్లీ ఎన్నికల  ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్‌ మధ‍్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీలు తలో 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్‌ ఇంకా ఖాతా తెరవలేదు. 

అప్డేట్‌ 9:25AM
హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ 34, బీజేపీ 33, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా తెరలవలేకపోయింది. 

అప్డేట్‌ 8:55AM
పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్‌ ముందంజలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

హిమచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 22, కాంగ్రెస్‌ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 

►  హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 17, కాంగ్రెస్‌ 13 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రారంభమైంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. 11 గంటలకు ఫలితాలపై ఒక అంచనా వస్తుంది. హిమాచల్‌లో మొత్తం 68 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది.

డబుల్‌ ఇంజన్‌ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్‌ 12న జరిగిన ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement