► పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమి 12 సీట్లు గెలుచుకుంది. మరో 3 అసెంబ్లీ విభాగాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్-డీఎంకె నేతృత్వంలోని కూటమి 5 స్థానాల్లో గెలిచి, రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
► కామరాజునగర్‌లో బీజేపీ అభ్యర్థి జాన్‌కుమార్ గెలుపు
►కదిర్‌గమమ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వనాథనె గెలుపు
►మహెలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ విజయం
►మన్నాడిపేట బీజేపీ అభ్యర్థి ఎ.నమఃశివాయం గెలుపు
►యానాంలో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ అశోక్ 3,877 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
►పుదుచ్చేరిలో 10 స్థానాల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. రెండు చోట్ల కాంగ్రెస్, ఒక చోట డీఎంకే విజయం కైవసం చేసుకుంది.
►యానాంలో మాజీ సీఎం రంగస్వామి వెనుకంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి 674 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
►పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐఎన్‌ఆర్‌సీ 6, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. యానాంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ఆధిక్యంలో ఉన్నారు.
►పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్డీయే పయనిస్తోంది.
►పుదుచ్చేరిలో ఎన్డీయే ముందంజలో ఉంది. యానాంలో బీజేపీ అభ్యర్థి రంగస్వామి ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్‌లో భాగంగా పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ-ఏఐఏడీఎంకే-ఏఐఎన్‌ఆర్‌సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు.
మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment