Himachal Pradesh Election Results 2022
-
గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?
డిసెంబర్ 8న వెలువడిన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్ సాగు శాసించే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్‌సభ ఎన్నికలు, తాజా గుజరాత్ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది. సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. గుజరాత్ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్ ΄పార్టీ ‘ఖామ్’ పేరుతో ఒక ఓటుబ్యాంక్ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు మహమ్మద్ జావెద్ ఫిర్జాదా, ఘియాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్‌తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజంఖాన్ మీద క్రిమినల్ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసీమ్ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు. గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్‌లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్’ చీల్చినందునే కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు. ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్ బాగ్కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?) - డాక్టర్ గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
సాక్షి కార్టూన్
-
హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
హిమాచల్ కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ లోటస్’ గుబులు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శాసనసభ ఫలితాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరోహోరీ పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది. బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలను అడ్డుకుని, విజయం సాధించే తమ అభ్యర్థులను చేజారి పోకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రానికి ఆమె సిమ్లా చేరుకోనున్నారని సమాచారం. మరోవైపు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ! -
అంతటా.. రికార్డుల మీదే బీజేపీ కన్ను!
ఢిల్లీ: దేశం మొత్తం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ దాదాపుగా గుజరాత్ పీఠం బీజేపీదే అని ఖరారు చేసేశాయి. గుజరాత్లో వరసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్న కమలదళంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హుషారుని నింపాయి. ఈ తరుణంలో బీజేపీ మరో రికార్డుపై కన్నేసింది. గుజరాత్లో బీజేపీ విజయం సాధిస్తే వరసగా ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన పశ్చిమబెంగాల్లో సీపీఎం రికార్డుతో సమం అవుతుంది. అయితే.. తొలిసారిగా పోటీ చేస్తున్న ఆప్ మాత్రం కచ్ఛితంగా ప్రభావం చూపెడతామని ప్రకటించుకుంది. దీంతో కాస్త ఆసక్తి నెలకొంది. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి 37 కేంద్రాల్లో కౌంటింగ్ మొదలుకానుంది. పదకొండు గంటల కల్లా ఫలితాలపై ఒక అంచనా రానుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో చెరోసారి బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారం పంచుకుంటూ వస్తున్నాయి. ఈ తరుణంలో వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకుని ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసి రికార్డు నెలకొల్పాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. తొలిసారి పోటీ చేయబోతున్న ఆప్ కూడా విజయంపై కన్నేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు.. 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం, అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ములాయం మరణంతో మెయిన్‌పురి స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానంలో ఎస్పీ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో ములాయం మెజార్టీకి గండికొట్టిన బీజేపీ ఈసారి భారీ విక్టరీపై కన్నేసింది. -
హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ అప్డేడ్ 07: 00PM హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 06: 30PM హిమాచల్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనక శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ ఫలితం లభించిందన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు సహకరించిందని తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయన్నారు. ఈ విజయం క్రెడిట్ తను తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమని తెలిపారు. हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद। सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है। फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022 కాగా హిమాచల్ ఎన్నికల్లో విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఔ అప్డేడ్ 06: 00PM బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. I thank the people of Himachal Pradesh for the affection and support for the BJP. We will keep working to fulfil the aspirations of the state and raise people’s issues in the times to come. @BJP4Himachal — Narendra Modi (@narendramodi) December 8, 2022 అప్డేడ్ 04: 15PM హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించనుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ప్రియాంక గాంధీ 10 పాయింట్ల మ్యానిఫెస్టో అక్కడ పనిచేసిందన్నారు. అయితే గుజరాత్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ప్రచార సమయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, బీజేపీకి ఊహించని విజయమని అన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అప్డేడ్ 03: 45PM కాంగ్రెస్ విజయం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 03: 15PM సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కసుంప్టి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అనిరుధ్ సింగ్ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి(బీజేపీ), రాష్ట్ర మంత్రి సురేష్ భరద్వాజ్‌పై 8,655 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్డేట్ 3: 00PM హిమాచల్ ప్రదేశ్ మంత్రి రామ్ లాల్ మార్కండ ఓటమి చెందారు. లాహౌల్ &స్పితి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో 1,616 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అప్డేట్ 2: 300PM హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(బీజేపీ రెబల్) అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. అప్డేట్ 2: 00PM కాంగ్రెస్ దూకుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 24 సీట్లలో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35ను చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. అప్డేట్ 1: 10PM ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ ధీమా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోందని, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకురాబోమని, కానీ, వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది, ఏ స్థాయికైనా వెళ్తుందన్నారు. అప్డేడ్ 11: 25AM ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేడ్ 11: 05AM రెబల్స్‌తో బీజేపీ చర్చలు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 68 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 35 అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింగి బీజేపీ. రెబల్స్‌తో చర్చలు చేపట్టింది. అందుకోసం వినోద్ తావ్డేను హిమాచల్‌కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ 32, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండే అవకాశం ఉన్నందున రెబల్స్‌ను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ఆపరేషన్ లోటస్ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అప్డేట్ 10:30AM ► శాసన సభ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 32 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేట్ 9:50AM ► అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు. అప్డేట్ 9:25AM ► హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ 34, బీజేపీ 33, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరలవలేకపోయింది. అప్డేట్ 8:55AM ► పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ► హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 17, కాంగ్రెస్ 13 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. 11 గంటలకు ఫలితాలపై ఒక అంచనా వస్తుంది. హిమాచల్‌లో మొత్తం 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక