కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురయ్యింది. తృణమూల్ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. బెంగాల్‌లో 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకొని, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ నేడు సున్నాకు పరిమితం కావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 3 దశాబ్దాలు బెంగాల్‌ను ఏలిన కాంగ్రెస్ క్రమంగా తన పట్టును కోల్పోయింది.
1970వ దశకంలో కమ్యూనిస్టుల రంగ ప్రవేశంతో ఓట్లు, సీట్లు తగ్గడంతో ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుంది. 9.09 శాతం ఓట్లు సాధించింది. 2016లో తన బలాన్ని కొంత మెరుగుపర్చుకుంది. 44 సీట్లతో 12.25 శాతం ఓట్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు దారుణ పరాజయం మూటగట్టుకుంది. కేవలం 3.02 శాతం ఓట్లే కాంగ్రెస్‌కు పడ్డాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు, 9.58% ఓట్లతో ఆశలు పెరిగినా.. 2019లో 2 ఎంపీ సీట్లే లభించాయి. కాంగ్రెస్ ఓట్లు 5.67 శాతానికి పడిపోయాయి.
చదవండి: Bengal Results: మరీ దారుణం.. ఒక్కచోటా గెలవని కమ్యూనిస్టులు
Comments
Please login to add a commentAdd a comment