సాక్షి, గోరంట్ల: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో భారీ మెజారిటీ నమోదైంది. గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి.
సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సరోజ బరిలో నిలవగా.. టీడీపీ మద్దతుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పెళ్లి పీటల నుంచి పోలింగ్ కేంద్రానికి..
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్లు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరువపల్లి గ్రామానికి చెందిన కోటానాయక్, కొత్తలం తండాకు చెందిన లావణ్యబాయికి ఆదివారం పావగడలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని నవ దంపతులు చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా పరిగికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వినయ్‌రెడ్డి, శ్రావణిల వివాహం ఆదివారం జరిగింది. మాంగల్యధారణ తర్వాత నూతన వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
చదవండి:
పులివెందుల ‘పంచ్’ అదిరింది
Comments
Please login to add a commentAdd a comment