నాలుగోవిడత లోక్‌సభ ఎన్నికల విధుల కోసం పశ్చిమబెంగాల్‌లోని నదియా నుంచి బయలుదేరుతున్న పారామిలటరీ జవాన్లు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ (మొత్తం మూడు దశలు) పోలింగ్ జరగనుంది.
కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ బమ్రే, ఎస్‌ఎస్ అహ్లూవాలియా, బాబుల్ సుప్రియోతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు సల్మాన్ ఖుర్షీద్, సినీనటి ఊర్మిళ మతోండ్కర్, సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ తదితర 961 అభ్యర్థుల భవితవ్యంపై 12.79 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా, బిహార్‌లోని బేగుసరాయ్ సీటు అందరి కన్ను ఉంది. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ గిరిరాజ్ సింగ్‌తో తలపడుతు న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం 302 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, నాలుగో దశతో మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment